తలకోన జలపాతం

300 అడుగుల ఎత్తులో ఉన్న ఈ అందమైన జలపాతం పిల్లలకు మరియు పెద్దలకు సహితం మంచి విహారకేంద్రం. రెండుకొండల మధ్య ఉన్న ఈ జలపాతంలోని నీరు స్వచ్ఛంగా మెరుస్తూ ఉంటుంది. కొలనులోనీ నీరు ప్రవహిస్తుంటుంది కానీ ఎటువెళ్తుందో తెలియదు. ఈ జలపాతానికి అత్యంత ఎత్తులో పాపనాశనం కలదు. 3 శతాబ్ధాల నాటి గిల్లితీగ అనే మొక్క తలకోనకే తలమానికం అని చెబుతారు. ఈ మొక్కలోని ప్రతి భాగం ఔషధయుక్తమేనని అంటారు. గిరిజనులు ఈ మొక్కను వివిధ వ్యాధుల నివారణకు వాడతారు. ఈ మొక్క కాయలు మూడునుండి నాలుగు అడుగుల దాకా ఉంటాయంటారు.
తలకోన అడవిలో తెల్లని ఆర్కిడ్ పుష్పలు, మద్ది, జాలరి, చందనం, ఎర్రచందనం మొదలగు చెట్లను చూడవచ్చు. అడవి కోళ్ల, దేవాంగన పిల్లులు, ముచ్చుకోతులు, ఎలుగుబంట్లు, నెమళ్లు ఇక్కడ ఎక్కవగా ఉంటాయి. 40 అడుగుల ఎత్తులో కట్టిన తాళ్లవంతెనమీద నడవటం ఒక మరిచిపోలేని అనుభూతి. పడవలలో షికారు చేయవచ్చు. పచ్చని శాలువా కప్పుకున్నట్లు ఉన్న ఈ తూర్పుకనుమలు వీక్షకులకు కనువిందు చేస్తాయి.
ఎలావెళ్లాలి ?
చిత్తూరు జిల్లా యర్రంవారి మండలంలో తలకోన జలపాతం ఉంది. తిరుపతి వెళ్లిన వారు అక్కడనుండి షుమారు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ జలపాతానికి బస్సులలో వెళ్లవచ్చు.

%d bloggers like this:
Available for Amazon Prime