Posted in Wildlife Sanctuaries

కొరింగా వన్యప్రాణి రక్షితకేంద్రం

ఈ వన్యప్రాణి రక్షితకేంద్రం తూర్పుగోదావరి జిల్లాలో 235.7 చ.కి.మీటర్లలో వ్యాపించియున్నది. సముద్రతీర ప్రాంతాలో పెరిగే 65 రకాల తెల్లమడచెట్లకు స్థావరం.

జంతువులు : ఇక్కడ వున్న ప్రధానమైన జంతువులు నీటికుక్కలు, ఒక జాతి మొసళ్ళకు, చేపలు పట్టే పిల్లలకు సురక్షిత ప్రాంతం. నక్కలు, సముద్రపు తాబేళ్ళు, బాతులు, ఫ్లెమింగో జాతి పక్షులు, సముద్రపు కాకులు, ఉల్లంగి పిట్టలు
ఒకప్పుడు సముద్ర వాణిజ్య కార్యకలాపాల్లో అంతర్జాతీయ ఖ్యాతి గడించిన కోరింగ.. ఇప్పుడు ప్రముఖ పర్యాటక కేంద్రంగా రూపుదిద్దుకుంది. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో కనుమరుగైన ఈ పోర్టు తిరిగి కోరింగ అభయారణ్యంగా ప్రాచుర్యంలోకి వచ్చింది. 235.7 చదరపు కిలోమీటర్లు విస్తరించిన మడ అడవులు.. కోరింగను ప్రకృతి సౌందర్యానికి పట్టుగొమ్మగా నిలబెట్టాయి. పక్షులు, జంతువులు, జలచరాలు.. ఈ వనాన్ని జీవవైవిధ్యానికి ఆవాసంగా మార్చాయి. 1998లో అభయారణ్యంగా ప్రకటించిన తర్వాత కోరింగ పర్యాటకంగానూ అభివృద్ధి చెందుతూ వస్తోంది. చిరుజల్లుల వేళ.. సుందరవనాలు (మడ అడవులు) మరింత మనోహరంగా కనిపిస్తాయి.
వలస పక్షుల విడిదిగా కోరింగ విలసిల్లుతోంది. శీతాకాలంలో 239 జాతులకు చెందిన సుమారు 88 వేల పక్షులు సంతానోత్పత్తి కోసం ఇక్కడికి వస్తుంటాయి. గౌరు కాకులు, హిమాలయాల్లో ఉండే బ్రాహ్మణి కైట్, స్టార్క్ కొంగలు, కింగ్ఫిషర్ పక్షులు ఎక్కువగా వలస వస్తాయి. గోదావరి, సముద్రం సంగమించే ఈ ప్రాంతమవ్వడంతో ఇక్కడి తీపి, ఉప్పు కలయికతో మిశ్రమ లవణ సాంద్రత ఉంటాయి. అందుకే ఈ నీటిలో విభిన్న జాతులకు చెందిన జలచరాలు మనుగడ సాగిస్తున్నాయి. 575 రకాల చేప జాతులను గుర్తించారు. చిత్తడి నేలలో మండపీతలు, పాములు అధికంగా ఉంటాయి. అంతేకాదు ఇక్కడ ఎలుకలు కూడా పక్షులతో పోటీగా చెట్లపై గూళ్లు కట్టుకోవడం విశేషం. కోరింగ పరిధిలో ఉన్న 32వ నీటిపాయ లోనికి వెళ్తే చెట్లపై ఎలుకలు కట్టుకున్న గూళ్లు కనిపిస్తాయి.

వృక్షజాతులు : కోరింగ వనాల్లో.. 35 రకాల మడజాతి వృక్షాలు ఉన్నాయి. నల్లమడ, తెల్లమడ, బిల్లమడ వృక్షాలు కనిపిస్తాయి. వనంలో నీటి కుక్కలు, నీటి పిల్లులు, బంగారురంగులో ఉండే నక్కలను చూడొచ్చు. చొల్లంగి గ్రామం దగ్గర అభయారణ్యానికి ప్రవేశం ఉంటుంది. కోరింగ గ్రామంలో మ్యూజియం, వసతి సముదాయాలు ఉన్నాయి. మడ అడవుల్లోని 32వ క్రీకు (నీటిపాయ)లో వివిధ రకాల పక్షి జాతులను వీక్షించే ఏర్పాట్లు ఉన్నాయి. కిందంతా చిత్తడి నేల ఉండటంతో నడవడం సాధ్యం కాదు. అందుకే అడవిలో విహరించడానికి చెక్క వంతెన ఏర్పాటు చేశారు. నాలుగు కిలోమీటర్ల మేర నిర్మించిన వంతెనపై కాలినడకన విహరిస్తూ.. వన సౌందర్యాన్ని ఆస్వాదించవచ్చు. క్రీకులో ప్రయాణించడానికి జెట్టీలు ఏర్పాటు చేశారు. 200 ఏళ్ల కిందటి పాతలైట్ హౌస్ను ఇటీవలే అభివృద్ధి చేశారు. యాత్రికులు బోట్లో వెళ్తారు. హోప్ ఐలాండ్ ఇక్కడ మరో ఆకర్షణ. నిండైన పచ్చదనంతో అలరించే ఈ ద్వీపానికి బోట్లలో చేరుకోవచ్చు.
ఎలా వెళ్ళాలి : కాకినాడ రైల్వేస్టేషన్‌ నుండి 20 కి.మీ. రాజమండ్రి రైల్వేస్టేషన్‌ నుండి 70 కి.మీ. దూరంలో ఉంటుంది.
వసతి సౌకర్యం : రాజమండ్రి, కాకినాడలో ఉండవచ్చు
అక్టోబర్‌ నుండి మే వరకు పర్యటనకు అనుకూలం.

ఆంధ్ర సముద్రతీరంలో ‘కోరంగి’ రేవు చరిత్ర,ప్రత్యేకత ఏమిటి?

ఆగ్నేయ తీర ప్రాంతమున గోదావరి ముఖ ద్వారము న నున్న కోరంగ /కోరంగి ఒక గ్రామము. ఒకనాటి రేవు పట్టణము. 1789 లో తూఫాన్ కారణముగా ఇరవై వేల మంది జనం బలైనారు. అయినా గాని తట్టుకొని నిలబడినది. కానీ మరల నవంబర్ 1839 లో వచ్చిన పెను గాలులు-ప్రచండ తూఫాను మూలమున రేవులో నున్న ఇరవై వేల పడవలు ధ్వంసము కాగా మూడు లక్షల మంది జనం బలైనారు. అప్పటినుండి రేవు పట్టణం శిధిలమై ప్రస్తుతం ఒక గ్రామముగ మిగిలి ఉన్నది.

ఈ గ్రామము తూర్పు గోదావరి జిల్లా-తాళ్లరేవు మండలం, కాకినాడ పట్టణానికి ఇరవై కిలో మీటర్ల దూరము లో ఉంది. డచ్చి వారు స్థావరం ఏర్పరుచు కోగా, పిమ్మట బ్రిటీషువారు స్వాధీన పర్చుకున్నారు. హోప్ ఐలాండ్ గా పేరు పెట్టారు.

ప్రస్తుతము ఇచ్చట వన్య ప్రాణి సంరక్షణ కేంద్రము గా రూపు దిద్దుకున్నది. ఇందు ఉప్పు నీటి మొసళ్ళు కు ప్రసిద్ధి గాంచినది. మడ అడవి ప్రాంతము.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s