హీరో స్ప్లెండర్

బీఎస్6 స్ప్లెండర్ ఐస్మార్ట్ 110

samayam telugu
హీరో స్ప్లెండర్ ఐస్మార్ట్ 110 మోటార్ సైకిల్ ను భారత విపణిలో లాంచ్ చేసింది. ఎక్స్ షోరూంలో ఈ డ్రమ్ వేరియంట్ ధర వచ్చేసి రూ.65,700లుగా సంస్థ నిర్దేశించింది.
ఈ సరికొత్త మోటార్ సైకిల్ 130 ఎంఎం డ్రమ్ బ్రేకులను ఇరువైపులా కలిగి ఉంది. అంతేకాకుండా ఈ మోటార్ సైకిల్ డిస్క్ బ్రేక్ వేరియంట్ 117 కేజీల బరువుండగా.. ఈ సరికొత్త డ్రమ్ బ్రేక్ స్ప్లెండర్ ఐస్మార్ట్ వేరియంట్ 1కేజీ తక్కువ బరువుతో అందుబాటులోకి వచ్చింది. అంతేకాకుండా డిస్క్ బ్రేక్ వేరియంట్ తో పోలిస్తే 2200 రూపాయల ధర కూడా తక్కువకు కూడా లభ్యం కానుంది.
samayam telugu
ఇంజిన్..హీరో స్ప్లెండర్ ఐస్మార్ట్ డ్రమ్ వేరియంట్ 110 బైక్ .. 113.2సీసీ సింగిల్ సిలీండర్ ఇంజిన్ ను కలిగి ఉండి 9 బీహెచ్ పీ బ్రేక్ హార్స్ పవర్, 9.89 ఎన్ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. అంతేకాకుండా 4-స్పీడ్ మ్యానువల్ ట్రాన్స్ మిషన్ వ్యవస్థతో అందుబాటులోకి వచ్చింది. అంతేకాకుండా మైలేజి కూడా ఎక్కువగా రానుంది. హీరో స్ప్లెండర్ ఐస్మార్ట్ మోడల్ లీటరుకు గరిష్ఠంగా 68 కిలోమీటర్లు వరకు మైలేజినిస్తుంది.
%d bloggers like this:
Available for Amazon Prime