1). రతన్ టాటా శిక్షణ పొందిన పైలట్ అని చాలా మందికి తెలియదు. టాటా కి పైలట్ లైసెన్స్ కూడా ఉంది. తరచుగా తన కంపెనీ విమానాలను తానే నడుపుతుంటాడు. అంతే కాకుండా ఎఫ్ -16 అనే ఫ్లైట్ ని నడిపిన తొలి భారతీయుడు టాటా.
2). టాటా సంపన్నుల ఇంటిలో జన్మించినప్పటికీ, చిన్నతనం లో ఇబ్బదులకి గురయ్యాడు. టాటా 7 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడే అతని తల్లిదండ్రులు, నావల్ టాటా మరియు సూని టాటా విడిపోయారు. ఆ తరువాత అతను మరియు అతని సోదరుడిని వాళ్ళ నాన్నమ్మ పెంచి పెద్ద చేసింది.
3). 1999 లో, రతన్ టాటా మరియు అతని బృందం తమ కార్ల వ్యాపారాన్ని ఫోర్డ్ అనే కంపెనీ కి అమ్మడానికి వెళ్లగా దాని యజమాని అయిన బిల్ ఫోర్డ్ టాటా ని అవమానించారు. “మీకు ఏమీ తెలియకుండా మీరు కార్ల వ్యాపారాన్ని ఎందుకు ప్రారంభించారు?” అని. తొమ్మిదేళ్ల తరువాత, అదే ఫోర్డ్ కంపెనీ దివాళా తీసి తమ జాగ్వర్ మరియు ల్యాండ్ రోవర్ లను అమ్మదల్చగా, టాటా ఆ రెండు కార్ల బ్రాండ్స్ ని కేవలం సగం ధరకే కొనుగోలు చేసి తనకి జరిగిన అవమానానికి సమాధానం చెప్పారు.

4). తన ట్రస్ట్‌లు మరియు ఫౌండేషన్లలో ఎక్కువ వాటాల్ని కలిగి ఉన్నందున రతన్ టాటా ప్రపంచంలోని ధనవంతుల జాబితాలో ఉండరు. ఆ వాటాలన్నీ లెక్కించబడితే, అతని నికర విలువ 72 బిలియన్ డాలర్లు.
5). రతన్ టాటా తన జీవితంలో 4 సార్లు వివాహానికి దగ్గరగా వచ్చాడు, కాని భయం లేదా మరొక కారణం వల్ల ప్రతిసారీ వెనక్కి తగ్గాడు. ఈ విషయం టాటా నే స్వయంగా వెల్లడించారు.
6). రతన్ టాటాకు ఐబిఎమ్‌లో ఉద్యోగం వచ్చింది, కాని అతను ఆ ఉద్యోగాన్ని కాదని తన కుటుంబ వ్యాపారంలో చేరాడు.
7). రతన్ టాటా వివిధ విజయవంతమైన స్టార్టప్‌లలో పెట్టుబడులు పెట్టారు.

8). రతన్ టాటా వరుసగా 2000 మరియు 2008 లో పద్మ భూషణ్ మరియు పద్మ విభూషణ్ అత్యున్నత పౌర పురస్కారాలను అందుకున్నారు. 2009 లో, యునైటెడ్ కింగ్‌డమ్ గౌరవ నైట్ కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది బ్రిటిష్ ఎంపైర్‌తో సత్కరించింది.
9). రతన్ టాటా ప్రతి సంవత్సరం కోట్ల రూపాయలను విరాళంగా ఇస్తాడు. ఒక సంవత్సరం, అతను హార్వర్డ్ విశ్వవిద్యాలయానికి 50 మిలియన్ డాలర్లు మరియు కార్నెల్ విశ్వవిద్యాలయానికి 25 మిలియన్ డాలర్లను విరాళంగా ఇచ్చాడు, ముఖ్యంగా రెండు విశ్వవిద్యాలయాలలో చదువుతున్న భారతీయ విద్యార్థుల కోసంఈ విరాళం అందజేశాడు.
You must log in to post a comment.