ఆరెంజ్

ఆరెంజ్ ఆనందం, శ్రేయస్సు, ఉల్లాసం మరియు సాదారణ భావనలను ప్రోత్సహించి శరీరాన్ని మానసికంగా బలపరుస్తుంది.ఆరెంజ్ ని ప్రతి రోజు తింటే శక్తిని పెంచటంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది.అందువల్ల అథ్లెట్లు సులభంగా శక్తి రావటానికి ఆరెంజ్ లను తింటారు.
 Health Benefits Of Oranges
 
 

1.క్యాన్సర్ నివారణలో సహాయపడుతుంది

సిట్రస్ జాతి పండు అయిన ఆరెంజ్ లో లిమోనాయిడ్స్ సమృద్దిగా ఉండుట వలన చర్మ, ఊపిరితిత్తుల, రొమ్ము, కడుపు మరియు ప్రేగు క్యాన్సర్ వంటి అనేక క్యాన్సర్ రకాల మీద పోరాటానికి సహాయపడుతుంది.

2.కిడ్నీ వ్యాధులను నిరోధిస్తుంది

ఆరెంజ్ జ్యూస్ ని ప్రతి రోజు క్రమం తప్పకుండా త్రాగితే మూత్రపిండాల వ్యాధులను నిరోధిస్తుంది.అలాగే మూత్రపిండాల్లో రాళ్ల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది.
ఆరెంజ్ లో ఉన్న అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు-Telugu Health - తెలుగు హెల్త్ టిప్స్ ,చిట్కాలు-Telugu Tollywood Photo Image

గమనిక: జ్యూస్ లను తగిన మోతాదులో మాత్రమే తీసుకోవాలి.పండ్ల రసాలలో ఉండే అధిక చక్కెర కంటెంట్ దంత క్షయానికి కారణమవుతుంది.
అంతేకాక అధిక ఆమ్ల శాతం ఎనామెల్ కి నష్టాన్ని కలిగిస్తుంది.
 
 
Telugu Cancer Prevention, Cholestrol, Health Benefits, Health Tips, Oranges-Top Posts Featured Slide

 

3.లివర్ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది

జపాన్ లో జరిగిన రెండు అధ్యయనాలలో మాండరిన్ అరెంజ్ తినడం వలన కాలేయ క్యాన్సర్ వచ్చే అవకాశాలు తగ్గుతాయని తెలిసింది.ఆరెంజ్ లో ఉండే కెరోటినాయిడ్ అని పిలిచే విటమిన్ A కాంపౌండ్స్ క్యాన్సర్ రాకుండా కాపాడతాయి.

Related posts

%d bloggers like this: