తక్షణమే పాన్ కార్డు పొందటం కోసం ఆన్‌లైన్‌లో ఎలా అప్లై చేసుకోవాలో ఒకసారి చూద్దాం..

1. ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ ఇఫైలింగ్ పోర్టల్‌కు వెళ్లాలి. తర్వాత ఇన్‌స్టంట్ పాన్ థ్రూ ఆధార్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. ఎడమవైపు క్విక్ లింక్స్ ఆనే సెక్షన్‌లో మీరు ఈ ఆప్షన్‌ను గమనించొచ్చు.

2. కొత్త పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ గెట్ న్యూ పాన్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.

3. కొత్త పాన్ కార్డు అలాట్‌మెంట్ కోసం ఇప్పుడు మీ ఆధార్ నెంబర్‌ను ఎంటర్ చేయాలి. క్యాప్చా కోడ్‌ను ఎంటర్ చేయాలి. ఓటీపీ వస్తుంది. ఆధార్ కార్డుతో లింక్ అయిన మొబైల్ నెంబర్‌కు ఇది వస్తుంది.

4. ఓటీపీ ఎంటర్ చేయాలి. ఆధార్ వివరాలను ఓకే చేయాలి. ఇప్పుడు ఆధార్ నెంబర్ ఈకేవైసీ డేటా యూనిక్యూ ఐడెంటిఫికేషణ్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ) నుంచి ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్‌కు వెళ్తుంది.

5. ఇప్పుడు మీకు వెంటనే ఇపాన్ కార్డు జనరేట్ అవుతుంది. మీరు ఈ ప్రక్రియను పూర్తి చేయడానికి 5 నిమిషాలు కూడా పట్టదు. దీంతో ఇపాన్ కార్డును సులభంగానే పొందొచ్చు.

6. పాన్ కార్డును డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. పీడీఎఫ్ ఫార్మాట్‌లో ఇది సేవ్ అవుతుంది. చెక్ స్టేటస్/డౌన్‌లోడ్ పాన్ అనే ఆప్షన్‌లో ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి సబ్‌మిట్ చేస్తే పాన్ కార్డు డౌన్‌లోడ్ అవుతుంది. ఆధార్ కార్డుతో మీ ఈమెయిల్ లింక్ అయితే అప్పుడు మీకు కొత్త పాన్ కార్డు మెయిల్ కూడా వస్తుంది.

ఇక్కడ మీరు ఒక విషయం గుర్తు పెట్టుకోవాలి. కొత్త ఇన్‌స్టంట్ పాన్ కార్డు ఫెసిలిటీ కేవలం కొందరికే అందుబాటులో ఉంటుంది. గతంలో ఎప్పుడూ కూడా పాన్ కార్డు తీసుకొని వారు మాత్రమే ఇలా పాన్ కార్డు పొందొచ్చు. మైనర్లకు ఈ ఇన్‌స్టంట్ పాన్ కార్డు ఫెసిలిటీ అందుబాటులో లేదు. అలాగే ఆధార్‌లో కంప్లీట్ డేట్ ఆఫ్ బర్త్ ఉండాలి. అలాగే రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ తప్పనిసరి.
You must log in to post a comment.