సీమ చింత కాయ

సీమ చింతకాయ తింటే ఎన్ని లాభాలో ...
సీమ చింత (గుబ్బ కాయలు) లేదా పిథెసెల్లోబియం డుల్సే Pithecellobium dulce(శాస్త్రీయ నామం)  లేదా కికార్ (రాజస్థాన్‌లో పిలుస్తారు) అనేది మైమోజేసీ ( Mimosaceae) కుటుంబానికి చెందిన చెట్టు. దీని ఫలములు చూడుటకు చింతకాయలవలె ఉంటాయి. ఇది ఇంగ్లీషు వారి నుండి దిగుబడి అయినదిగా భావిస్తుండుట వలన దీనిని సీమచింతగా వ్యవహరిస్తారు. దీని కాయలు నల్లని రంగుకల గింజలు కలిగి ఉంటాయి.. నల్లని గింజల చుట్టూ ఉండే తెల్లని తియ్యటి పప్పు ( Sweet Aril) ను అందరూ ఇష్టంగా తింటారు.
ఆంగ్లంలో ఈ ముళ్ళ చెట్టును Madras Thorn అంటారు. దీనిని మనిలా టామరిండ్ ( మనిలా చింత – Manila Tamarind) అని కూడా అందురు.ఇది పసిఫిక్ తీరానికి చెందినది మరియు  ఈ మొక్క జన్మస్థలం అమెరికా.
 
ఇది మెక్సికోమధ్య అమెరికా మరియు ఉత్తర దక్షిణ అమెరికా ప్రక్కనే ఉన్న ఎత్తైన ప్రాంతాలు, కరేబియన్ఫ్లోరిడాగువామ్ఇండియాబంగ్లాదేశ్శ్రీలంకపాకిస్తాన్థాయిలాండ్ మరియు ఫిలిప్పీన్స్లలో విస్తృతంగా లబిస్తుంది.
హిందీలో సీమ చింతను విలాయతీ ఇమ్లీ ( విదేశీ చింత) అనీవిలాయతీ బబూల్ ( విదేశీ తుమ్మ) అని అందురు. జిలేబీ చుట్టలలాగా ఉండే సీమ తుమ్మ కాయల్ని హిందీలో జంగ్లీ జలేబీ ( Janglee Jalebi) అని కూడా అంటారు.  మరాఠీ భాషలోనూ ఈ చెట్టును విలాయతీ చించ్ (విదేశీ చింత)అందురు..
మన గ్రామీణులు కొందరు ఈ సీమతుమ్మ కాయల్ని సీతమ్మ కాయలు అంటున్నారుపాకిస్తాన్‌లో దీనిని జంగిల్ జలేబీ‘ అని పిలుస్తారు. కువైట్‌లోదీనిని  షోకాట్ మద్రాస్”. అందురు. సీమవిలాయతీ శబ్దాలు ఈ చెట్లు మన దేశానికి బయట నుంచి వచ్చినవేనని తెలుపుతున్నాయి.
కొందరు ఈ కాయలనువాటిలోని తెల్లని పప్పును కూర  వండుకుంటారు. ఈ కాయలను పశువుల మేతగానూ వినియోగిస్తారు. విత్తన పాడ్స్‌ లో తీపి మరియు పుల్లని గుజ్జు ఉంటుందిదీనిని మెక్సికోపాకిస్తాన్ మరియు భారతదేశంలో పచ్చిగా తింటారు. కొన్ని చోట్ల వివిధ మాంసం వంటకాలకు తోడుగా మరియు చక్కెర మరియు నీటితో (అగువా డి గుమాచిల్‘) పానీయాలకు బేస్ గా ఉపయోగిస్తారు. నల్లని మెరిసే గింజలపైన ఉండే తెల్లని తియ్యటి పప్పు ( Sweet Aril) ఒకోసారి పండి ఎర్రగా కూడా అవుతుంది. ఈ పప్పు తో మెక్సికో లో లెమొనేడ్ ( Lemonade) వంటి షర్బత్ తయారు చేస్తారు.
సీమ చింత కాయ – ప్రయోజనాలు:
·        సీమ చింత గింజల నుంచి తీసే నూనె వంటనూనెగా ప్రసిద్ధి పొందింది. ఈ నూనెను సబ్బుల తయారీలో కూడా వినియోగిస్తారు.
·        విత్తనాలను ప్రాసెస్ చేసినప్పుడు  ఆకుపచ్చ నూనె వస్తుంది.
·        ఇది శుద్ధి చేసినప్పుడు తినదగిన కొవ్వు ఆమ్లాలను కలిగి ఉండును.
·        సీమ చింత గింజలు గానుగ ఆడిస్తే లభించే చెక్క ( Oil Cake) లో 29.7 శాతం మాంసకృత్తులు ఉన్న కారణంగా ఈ చెక్క పశువుల దాణాగా శ్రేష్ఠం.
·        సీమ చింత విత్తనాలలో 30 -67.11% వరకు ప్రోటీన్  ఉంది.
·        ఈ చెట్టు కాండంపై ఉండే బెరడులో టానిన్లు అధికంగా ఉండే కారణంగా తోళ్ళు ఊనడం (Tanning) లో ఈ బెరడును వినియోగిస్తారు. ఈ చెట్ల ఆకులు పశువులకు పచ్చి మేతగా ఉపయోగిస్తారు.
·        ఎరుపుగోధుమవర్ణాల మిశ్రమ వర్ణంలో ఉండే ఈ చెట్ల కలపను
నిర్మాణరంగంలోనూ వాడతారు.
·        కంచెలకు వినియోగించే బాదులుగాప్యాకింగ్ పెట్టెల తయారీలోఎడ్ల బళ్లువ్యవసాయ పనిముట్ల తయారీలోనూ ఈ కలపను ఉపయోగిస్తారు.
·        ఈ కలప వంటచెరుకుగా వాడితే మంచి సెగనిస్తుంది.
 

వేసవిలో సీమచింతకాయలు (గుబ్బకాయలు) బాగా వస్తాయి. వీటిలో ఆరోగ్య ప్రయోజనాలు పుష్కలంగా ఉన్నాయి:

 *బరువును అదుపుచేస్తాయి.
·         పోషకనిధులుఔషధ గుణాలు మెండు. అందుకే వీటిని మందుల తయారీల్లో వాడతారు.
·         వీటి చెట్టు బెరడుఆకులుకాయలుగింజలు ఆరోగ్య సమస్యలకు సంజీవినిలా పనిచేస్తాయి. పంటినొప్పులుచిగుళ్లల్లో రక్తంకారడంకడుపులో అల్సర్లను నివారిస్తాయి. ఆకుల నుంచి తీసిన పదార్థాలు గాల్‌ బ్లాడర్‌ సమస్యలను నిరోధిస్తాయి.
·         శరీరంపై రక్తస్రావాన్ని అరికడతాయి. గాయాలను మాన్పుతాయి.
·         రోగనిరోధకశక్తిని పెంచుతాయి.
·         క్యాన్సర్లను అరికట్టే సుగుణాలు వీటిల్లో ఉన్నాయి.
·         మధుమేహవ్యాధిగ్రస్థులకు ఇవెంతో మంచివి.
·         బ్లడ్‌షుగర్‌కొలెస్ట్రాల్‌లను ఇవి నియంత్రణలో ఉంచుతాయి.
·         వీటిల్లో చెడు కొలెస్ట్రాల్‌ ఉండదు. అందుకే ప్రతిరోజూ పావుకప్పు సీమచింతకాయల్ని ఆహారంలో చేరిస్తే మంచిది.
·         గర్బిణీలకు ఎనర్జీని అందిస్తాయి.
·         క్యాల్షియం కూడా అధికంగా ఉన్న వీటిని తినడం వల్ల ఎముకలు బలంగాఆరోగ్యంగా ఉంటాయి.
·         శరీరంలో వణుకునరాల అస్వస్థతను తగ్గిస్తాయి.
·         వీటిని తినడం వల్ల గుండె జబ్బులు దరిచేరవు.
·         లైంగికపరమైన అంటువ్యాధుల నివారణకు వీటిని వాడతారు.
·         విరేచనాల నివారణకు సీమచింతకాయల ఆకుల్ని ఉపయోగిస్తారు.
·         ఈ చెట్టు బెరడు మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. గుజ్జు దీర్ఘకాలిక డయేరియాడిసెంటరీటిబి వంటి వాటికి వాడతారు.
·         గాయాలకు ఇవి యాంటిసెప్టిక్‌లా పనిచేస్తాయి.
·         చర్మాన్ని కాంతివంతంగా ఉంచుతాయి.
·         వెంట్రుకలు రాలకుండా కాపాడతాయి.
·         రకరకాల జ్వరాలను నిరోధిస్తాయి. మలేరియాజాండిస్ లను తగ్గిస్తాయి.
·         రక్తప్రసరణను క్రమబద్ధీకరిస్తాయి.
·         నాడీ వ్యవస్థ బాగా పనిచేసేలా సహకరిస్తాయి.
·         నోటి అల్సర్లను తగ్గిస్తాయి.
·         మొటిమలుయాక్నే రాకుండా నివారిస్తాయి. నల్లమచ్చలు పోగొడతాయి.
·         వీటిని ఆహారంలో చేర్చితే నిత్యయవ్వనుల్లా కనిపిస్తారు.
·         సహజసిద్ధమైన స్కిన్‌ మాయిశ్చరైజర్‌ కూడా.
·         వీటితో వంటలు కూడా చేస్తారు.
·          చెట్టు బెరడు భారతదేశంలో రక్త విరేచనాలకు కట్టడిగా ఉపయోగించబడుతుంది.
·         ఇది యాంటిపైరెటిక్‌గా ఉపయోగించబడుతుంది.
·         మెక్సికోలోని హువాస్టెక్ ప్రజలు చిగుళ్ళ వ్యాధులుపంటి నొప్పి మరియు క్యాన్సర్ చికిత్సకు చెట్టు యొక్క వివిధ భాగాలను ఉపయోగించారు.
·         ఆకులు ఆల్కహాల్‌తో కూడిన పౌల్టీస్‌లో పిత్త చికిత్సకు ఉపయోగిస్తారని చెబుతారుఅలాగే గర్భస్రావం / గర్భస్రావం జరగకుండా నిరోధించడానికి ఉపయోగిస్తారుఅయినప్పటికీ ఆకులు గర్భస్రావం కలిగించడానికి కూడా ఉపయోగపడతాయని చెబుతారు.
·         పండ్ల నుండి వచ్చే గుజ్జు హెమోస్టాటిక్ అని చెప్పబడింది.
·         సీమ చింత గింజలను అల్సర్స్ శుభ్రం చేయడానికి ఉపయోగిస్తారు.
·         చెట్టు భాగాలను రక్తస్రావందీర్ఘకాలిక విరేచనాలు మరియు క్షయవ్యాధికి వ్యతిరేకంగా కూడా ఉపయోగిస్తారు.
 
%d bloggers like this:
Available for Amazon Prime