1. ఒకరిని పదేపదే కాల్ చేయవద్దు. వారు మీ కాల్‌ను తీసుకోకపోతే, అందుకు వారికి ముఖ్యమైన పనులు ఉన్నాయని అనుకోండి.
2. అవతలి వ్యక్తి మీమ్మల్లి అడగక ముందే మీరు అరువు తెచ్చుకున్న డబ్బును తిరిగి ఇవ్వండి. ఇది మీ సమగ్రతను మరియు వ్యక్తిత్వంను చూపుతుంది.
3. ఎవరైనా మీకు భోజనం / విందు ఇస్తున్నప్పుడు మెనులో ఖరీదైన వంటకాన్ని ఎప్పుడూ ఆర్డర్ చేయవద్దు. వీలైతే మీ ఆహారాన్ని వారిని ఎంపిక చేయనియండి.
4. ఇతరులను “మీకు ఇంకా వివాహం కాలేదా?’ లేదా ‘మీకు పిల్లలు లేరా‘ లేదా ‘ఎందుకు మీరు ఇల్లు కొనలేదు?’ వంటి ఇబ్బందికరమైన ప్రశ్నలను అడగవద్దు.
5. మీ వెనుక వచ్చే వ్యక్తికి ఎల్లప్పుడూ తలుపు తెరవండి. ఆ వ్యక్తి, పురుషుడు లేదా స్త్రీ / సీనియర్ లేదా జూనియర్ అయినా ఫర్వాలేదు. ఎవరితోనైనా సరే బహిరంగంగా గౌరవంగా వ్యవహరించoడి.
6. మీరు ఒక స్నేహితుడితో కలసి టాక్సీ లో ప్రయాణిస్తూ ఉంటె ఒకసారి అతను / ఆమె ఫేర్ చెల్లిస్తే, తదుపరి సారి మీరు చెల్లించoడి.
7. విభిన్న అభిప్రాయాలను గౌరవించండి. ఒక విషయం లో రెండవ అభిప్రాయం మంచిది.
8. ఇతరులు మాట్లాడేడప్పుడు ఎప్పుడూ అంతరాయం కలిగించవద్దు. వారు చెప్పేదాన్ని ఆసాంతం వినండి.
9. ఎవరితో పరాచికాలు ఆడవద్దు. వారు బాధపెడితే మరలా ఎప్పుడు ఆలా చేయకండి.
10. ఎవరైనా మీకు సహాయం చేస్తున్నప్పుడు “ధన్యవాదాలు” అని చెప్పండి.
11. బహిరంగంగా ప్రశంసించండి. పరోక్షం లో విమర్శించవద్దు.
12. ఒకరి శరీర బరువుపై వ్యాఖ్యానించవద్దు. “మీరు బరువు తగ్గితే అద్భుతంగా కనిపిస్తారు” అని మృదువుగా చెప్పండి
13. ఎవరైనా వారి ఫోన్‌లో మీకు ఫోటోలు చూపించినప్పుడు, ఎడమ లేదా కుడి వైపుకు స్వైప్ చేయవద్దు.
14. సహోద్యోగి ఆరోగ్య స్థితి గురించి వ్యంగంగా వ్యాఖ్యానించ వద్దు.
15. అటెండర్ ను సీఈఓతో సమానంగా చూసుకోండి. మీ క్రింద ఉన్నవారితో మీరు ఎంత బాగా ప్రవర్తిస్తే అంతా బాగా మీరు వారిని ఆకట్టువచ్చు. మీరు వారిని గౌరవంగా చూస్తే ఇతరులు దాన్ని గమనిస్తారు.
16. ఒక వ్యక్తి మీతో నేరుగా మాట్లాడుతుంటే, మీరు ఫోన్‌ను చూడటం మొరటుగా ఉంటుంది.
17. మిమ్మల్ని అడిగే వరకు ఎప్పుడూ సలహా ఇవ్వకండి.
18. చాలా కాలం తర్వాత ఒకరిని కలిసినప్పుడు, దాని గురించి మాట్లాడాలి తప్ప, వారి వయస్సు మరియు జీతం అడగవద్దు.
19. మీ పని మీరు చూసుకోండి – ఇతరుల పనిలో తల దూర్చవద్దు.
20. మీరు బజారులో ఎవరితోనైనా మాట్లాడుతుంటే మీ సన్ గ్లాసెస్ తొలగించండి. ఇది గౌరవానికి సంకేతం. మాట కంటే కంటి పరిచయం చాలా ముఖ్యం.
21. పేదల మధ్య మీ ఐశ్వర్యం గురించి ఎప్పుడూ మాట్లాడకండి. అదేవిధంగా, మీ పిల్లల గురించి మాట్లాడకండి … మీ జీవిత భాగస్వామీ గురించి మాట్లాడకండి.
22. చివరగా, ఇతరులు నేర్చుకోవడంలో మీరు సహాయపడoడి. అది మీ సహకారం వైరల్ అయ్యేలా చేస్తుంది.
You must log in to post a comment.