మారుతీ సుజుకీ ఎస్-ప్రెసో సీఎన్జీ
వేరియంట్ల వారీగా మారుతీ సుజుకీ ఎస్-సీఎన్జీ ధర.. ఎక్స్ షోరూంలో ఈ కారు ప్రారంభ ధర రూ.4.84 లక్షలు. నాలుగు వేరియంట్లలో లభ్యమవుతున్న ఈ వాహనం వేరియంట్ల వారీగా ధరలో వ్యత్యాసముంచింది. ఎల్ఎక్స్ఐ వేరియంట్ ధర............ రూ.4.84 లక్షలు ఎల్ఎక్స్ఐ (ఓ) వేరియంట్ ధర............ రూ.5.07 లక్షలు వీఎక్స్ఐ వేరియంట్ ధర.............. రూ.4.90 లక్షలు వీఎక్స్ఐ వేరియంట్ ధర.............. రూ.5.07 లక్షలు.
ఇంజిన్..
మారుతీ సుజుకీ ఎస్-ప్రెసో సీఎన్జీ మోడల్ 998సీసీ, మూడు సిలీండర్ల ఇంజిన్ ను కలిగి ఉంది. ఇది 58 బీహెచ్ పీ బ్రేక్ హార్స్ పవర్, 70 ఎన్ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. అంతేకాకుండా 5-స్పీడ్ మ్యానువల్ గేర్ బాక్స్ వ్యవస్థతో పనిచేస్తుంది. అయితే పెట్రోల్ వేరియంట్ కంటే పవర్ ఔట్ పుట్ గణంకాలు తక్కువగా ఉన్నాయి. మారుతీ సుజుకీ ఎస్-ప్రెసో పెట్రోల్ వేరియంట్ 67 బీహెచ్ పీ బ్రేక్ హార్స్ పవర్, 90 ఎన్ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తూ 5-స్పీడ్ మ్యానువల్ గేర్ బాక్స్ వ్యవస్థతో పనిచేస్తుంది.
మారుతీ సుజుకీ సెలేరియో

మారుతీ సుజుకీ తన సరికొత్త సెలేరియో మోడల్ ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఇప్పటికే పెట్రోల్, డీజిల్ వేరియంట్లను ఇప్పటికే విపణిలో లాంచ్ చేసిన ఈ సంస్థ తాజాగా సీఎన్జీ(కంప్రెసెడ్ నేచురల్ గ్యాస్) వేరియంట్ ను బీఎస్6 ప్రమాణాలకు అనుగుణంగా మార్పులు చేసి భారత మార్కెట్లోకి వదిలింది. ఎక్స్ షోరూంలో మారుతీ సుజుకీ సేలెరియో మోడల్ ప్రారంభ ధర వచ్చేసి రూ.5.61 లక్షలు. రెండు వేరియంట్లలో ఇది లభ్యమవుతుంది. వీఎక్స్ఐ, వీఎక్స్ఐ(ఓ) వేరియంట్లలో దీన్ని సొంతం చేసుకోవచ్చు.
వేరియంట్ల వారీగా మారుతీ సుజుకీ సెలేరియో ధర..
ఎక్స్ షోరూంలో ఈ కారు ధర వచ్చేసి రూ.5.61 లక్షలు. దీని బీఎస్4 మోడల్ తో పోలిస్తే దాదాపు 30 వేల రూపాయల వరకు పెరగనుందని తెలుస్తోంది.
సెలేరియో వీఎక్స్ఐ వేరియంట్ ధర……….. రూ.5.61 లక్షలు
సెలేరియో వీఎక్స్ఐ(ఓ) వేరియంట్ ధర………. రూ.5.68 లక్షలు.

ఇంజిన్..
ప్రస్తుతం ఈ సరికొత్త బీఎస్6 మారుతీ సుజుకీ సెలేరియో సీఎన్జీ వేరియంట్ పవర్ ఔట్ పుట్ వివరాలు సంస్థ ఇంకా బహిర్గతపరచలేదు. అయితే బీఎస్4 మోడల్ మాదిరే పవర్ ఔట్ పుట్ ఉంటుందని అంచనా. బీఎస్4 మారుతీ సుజుకీ సెలేరియో పెట్రోల్ వాహనం 1.0-లీటర్ కే10 యూనిట్ ను కలిగి ఉండి 68 బీహెచ్ పీ బ్రేక్ హార్స్ పవర్, 90 ఎన్ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. అంతేకాకుండా 5-స్పీడ్ మ్యానువల్ గేర్ బాక్స్ వ్యవస్థతో పనిచేస్తుంది. అదే సీఎన్జీ వేరియంటైతే 59 బీహెచ్ పీ బ్రేక్ హార్స్ పవర్, 78 ఎన్ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. మైలేజి కూడా ఈ వాహనం తగ్గనుంది. ఇది 30.47 కీమీ/కేజీ వరకు ఇవ్వనుంది. బీఎస్4 మోడల్ తో పోలిస్తే 1.27 కిమీ/కేజీలు తగ్గనుంది.
భారత మార్కెట్లో ఈ కారుకు పోటీగా హ్యుండాయ్ శాంత్రో పోటీగా ఉంది. శాంత్రో సీఎన్జీ మోడల్ కూడా మ్యాగ్నా, స్పోర్ట్జ్, వేరియంట్లో లభ్యమవుతుంది. ఈ కారు ప్రారంభ ధర వచ్చేసి 5.85 లక్షలు. దీని టాప్ వేరియంట్ ధర వచ్చేసి రూ.6.20 లక్షల
You must log in to post a comment.