బీఎండబ్ల్యూ

బీఎండబ్ల్యూ ఎక్స్6 ఎస్ యూవీ

బీఎండబ్ల్యూ ఎక్స్6 కూపే
లగ్జరీ కార్లకు ప్రసిద్ధి గాంచిన సంస్థ బీఎండబ్లూ. ఇటీవలే ఈ జర్మన్ కార్ల తయారీ సంస్థ తన సరికొత్త ఎక్స్1 ఫేస్ లిఫ్ట్ మోడల్ భారత మార్కెట్లో విడుదల చేసింది. తాజాగా బీఎండబ్ల్యూ ఎక్స్6 ఎస్ యూవీ కూపేను భారత విపణిలో లాంచ్ చేసింది. ఎక్స్5, ఎక్స్7 మధ్యలో ఉన్న ఈ సరికొత్త ఎక్స్6 కూపే అత్యాధునిక హంగులు ఫీచర్లతో ఆకట్టుకుంటోంది. బీఎండబ్ల్యూ ఎక్స్6 కూపే పెట్రోల్ ఇంజిన్ ప్రారంభ ధర వచ్చేసి రూ.95 లక్షలు. ఎక్స్ డ్రైవ్ ఆల్ వీల్ సిస్టం, బీఎండబ్ల్యూ టెక్నాలజీతో అందుబాటులోకి వచ్చింది.
సరికొత్త ఎల్ఈడీ హెడ్ ల్యాంపులు, ఎల్ఈడీ టెయిల్ ల్యాంపులుతో అందుబాటులోకి వచ్చింది. బీఎండబ్ల్యూ ఎక్స్6 12.3-అంగుళాల స్క్రీన్లు, లైవ్ కాక్ పిట్, ఇంఫాట్ డ్రైవర్, ఇంఫోటైన్మెంట్ సిస్టం, బీఎండబ్ల్యూ లేటెస్ట్ సాఫ్ట్ వేర్ యూజర్ ఇంటర్ఫేస్ తదిత ఫీచర్లు ఇందులో ఉన్నాయి. కూపే బేస్డ్ స్టైల్ డిజైన్ తో పాటు టూ-బాక్స్ ఎస్ యూవీ ఆకారంలో ఆకట్టుకుంటోంది. బీఎండబ్ల్యూ లేటెస్ట్ సాఫ్ట్ వేర్ యూజర్ ఇంటర్ ఫేస్ తో అందుబాటులోకి వచ్చింది.
samayam telugu
ఇంజిన్..

బీఎడబ్ల్యూ ఎక్స్6 కూపే 3.0-లీటర్ ఇన్ లైన్ సిక్స్ ట్విన్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ను కలిగి ఉంది. ఇది 335 బీహెచ్ పీ బ్రేక్ హార్స్ పవర్, 450 ఎన్ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. అంతేకాకుండా 8-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ వ్యవస్థతో పనిచేస్తుంది. అంతేకాకుడా ఎక్స్ డ్రైవ్ ఆల్-వీల్ సిస్టం ద్వారా పవర్ ను అన్ని వీల్స్ కు చేరవేస్తుంది.
బీఎండబ్ల్యూ ఎక్స్6 ఎక్స్ లైన్, ఎం స్పోర్ట్ ట్రిమ్ రెండింటి ధర కూడా 95 లక్షల రూపాయల వరకు అందుబాటులోకి వస్తుంది. ఈ వాహనానికి ప్రత్యక్షంగా ఆడీ క్యూ8, పోర్షే కేయానే కూపే, లెక్సస్ ఆర్ఎక్స్ లాంటి కార్లు భారత మార్కెట్లో వీటికి పోటీగా ఉన్నాయి. ధర కుండా తక్కువ అంతరంతోనే ఇవి భారత విపణిలోకి అందుబాటులోకి ఉండనున్నాయి.

%d bloggers like this:
Available for Amazon Prime