కొన్నికొన్ని కంపెనీ ల పేర్లు మనం తరచు వింటూ ఉంటాం,వాటిల్లో మన దేశం లోనే స్థాపించబడి ప్రపంచ వ్యాప్తంగా పేరు పొందిన మన భారతీయ కంపెనీ లు ఎన్నో ఉన్నాయి. వాటిలో కొన్నిమనకి తెలిసినా మరికొన్ని మన దేశానికే చెందినవి అని కూడా చాలా మందికి తెలియదు. అలంటి కొన్ని సంస్థ లగురించి ఇక్కడ రాయడం జరిగింది.
1). ఎయిర్ టెల్
భారతి ఎయిర్ టెల్ కి మన దేశం లో ఉన్న ప్రాముఖ్యత మనకి తెలిసిందే. 1985 సంవత్సరం లో సునీల్ మిట్టల్ గారు ఎయిర్ టెల్ ని స్థాపించారు. ప్రస్తుతం భారతి ఎయిర్ టెల్ ప్రపంచ వ్యాప్తంగా ౧౮ (దక్షిణ ఆసియ, ఆఫ్రికా, ఛానల్ ఐలాండ్స్ మొ,,లగు) దేశాల్లో సేవలను అందిస్తుండగా, ౩౦ కోట్ల మంది కి పైగా ఎయిర్ టెల్ సేవలను వినియోగిస్తున్నారు. పలు నివేదికల ప్రకారం మొబైల్ నెట్ వర్క్ సేవల్లో ప్రపంచం లో ఈ సంస్థ ౪వ స్థానం (సంపాదన ను బట్టి) లో ఉంది.
2). లార్సెన్ & టౌబ్రో(L & T)
లార్సెన్ & టౌబ్రో లిమిటెడ్, సాధారణంగా ఎల్ అండ్ టి అని పిలువబడే ఈ కంపెనీ ని భారతదేశంలో ఆశ్రయం పొందుతున్న ఇద్దరు డానిష్ ఇంజనీర్లు ౧౯౩౮ లో స్థాపించారు. , ఇది సాంకేతిక పరిజ్ఞానం, ఇంజనీరింగ్, వాహనాల తయారీ మరియు ఆర్థిక సేవల పై పని చేస్తుంది, దీని ప్రధాన కార్యాలయం ముంబై, మహారాష్ట్ర లో ఉంది. యూ ఎస్ ఏ, ఇటలీ, జర్మనీ, ఫిన్లాండ్, మరెన్నో దేశాల్లో ఈ సంస్థ కి సంధానందించిన విభాగాలు సేవలు అందిస్తున్నాయి. ఫోర్బ్స్ పత్రిక వెలువడించే ర్యాంకింగ్స్ లో ఈ సంస్థ చాలా సార్లు చోటు సంపాదించడం గమనార్హం.
3). రాయల్ ఎన్ ఫీల్డ్
రాయల్ ఎన్ ఫీల్డ్ బైక్ ల గురించి వివరణ అనవసరం. బైక్ అంటే ఇష్టపడే వారు ఖచ్చితంగా ఆ బైక్ ఒక్కసారైనా స్వ౦త౦ చేసుకోవాలని ఆశ పడుతుంటారు. మన దేశీయ మార్కెట్లో ఆ బైక్స్ కి ఉన్న ప్రత్యేకత అది. 1955 వ సంవత్సరం లో భారతదేశం లో స్థాపించబడింది. 1901 లో మొదటగా ఇంగ్లాండ్ లోని ఎన్ ఫీల్డ్ సైకిల్ అనే కంపెనీ వారిచే రూపొందించబడ్డ ఈ బైక్ 1955 లో పూర్తిగా మన దేశంలో స్థిరపడింది. ఐచర్ అనే కంపెనీ ఈ బ్రాండ్ కి ఇపుడు యజమానిగా కొనసాగుతుంది. ఆదరణ కరువై 1990 లో మూతపడిన ఈ సంస్థ ప్రజల్లో ఉన్న కోరిక, పెరుగుతున్న ఆదరణ మేరకు 2013 లో తిరిగి ప్రారంభించబడింది. 50 కి పైగా దేశాల్లో ఈ బైక్ లని విక్రయిస్తున్నారు.
4). ఓల్డ్ మాంక్
ఓల్డ్ మాంక్ అనే రమ్ కి మన దేశం లోనే కాకుండా ఇతర దేశాల్లో కూడా విశేష ఆదరణ ఉంది. ఉత్తర ప్రదేశ్ లోని ఘజియాబాద్ 1954 వ సంవత్సరం నుండి ఇది తయారీలో ఉంది. అమెరికా, రష్యా, ఇంగ్లాండ్, జపాన్, న్యూజిలాండ్ దేశాల్లో ప్రజలు ఈ రమ్ ని ఎక్కువగా ఇష్టపడతారు.వివిధ నివేదికల ప్రకారం ఏ ప్రకటన కూడా లేకుండా కేవలం ప్రజల మన్నన,అభిమానం తో సంవత్సరానికి 80 లక్షల బాటిల్స్ అమ్ముడుపోతాయట. విదేశాల్లో అతి ఎక్కువగా అమ్ముడుపోయే మద్యం గా ఓల్డ్ మాంక్ కొన్ని దశాబ్దాలుగా కొనసాగుతుంది.
5). MRF
ప్రజల్లో MRF టైర్స్ కి ఉన్నఆదరణ అందరికి తెలిసిందే, ఇది కూడా మన భారతీయ సంస్థే.అంతర్జాతీయంగా కూడా ఈ సంస్థ కి మంచి పేరు ఉంది మరియు 65కి పైగా దేశాల్లో ఈ సంస్థ వ్యాపారాన్ని కలిగి ఉంది.దీనిని 1946 వ సంవత్సరం లో మెమెన్ పిళ్ళై అనే భారతీయుడు స్థాపించాడు.ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా టైర్ లు తయారుచేసే సంస్థల్లో MRF 14 వ స్థానం లో ఉంది.1967 లో, యుఎస్ఎకు టైర్లను ఎగుమతి చేసిన మొదటి భారతీయ సంస్థగా ఇది నిలిచింది. భారతదేశపు మొట్టమొదటి ఆధునిక చిన్న కారు మారుతి 800 కు ఎంఆర్ఎఫ్ టైర్లను సరఫరా చేసింది.
6). టాటా
1868 లో జమ్సెట్జీ టాటా చేత స్థాపించబడిన ఈ సంస్థ అనేక ప్రపంచ సంస్థలను కొనుగోలు చేసిన తరువాత అంతర్జాతీయ గుర్తింపు పొందింది. ముంబై కేంద్రంగా ఈ సంస్థ ప్రపంచ వ్యాప్తంగా తన కార్యకలాపాలను కొనసాగిస్తుంటుంది. టాటా కెమికల్స్, టాటా కమ్యూనికేషన్స్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్, టాటా ఎల్క్సీ, టాటా మోటార్స్, టాటా పవర్, టాటా స్టీల్, వోల్టాస్, టాటా క్లిక్, టైటాన్, ట్రెంట్ (వెస్ట్ సైడ్), తాజ్ హోటల్స్, తాజ్ ఎయిర్, టాటా ఆటోకాంప్ సిస్టమ్స్ లిమిటెడ్, విస్టారా , తనీష్క్, జాగ్వార్ ల్యాండ్ రోవర్, క్రోమ్, సోనాట వంటి వన్నీ టాటా కంపెనీవె. దాదాపు ప్రపంచం లోని అన్ని దేశాల్లో (175) టాటా వ్యాపారాలు ఉన్నాయి.
1868 లో జమ్సెట్జీ టాటా చేత స్థాపించబడిన ఈ సంస్థ అనేక ప్రపంచ సంస్థలను కొనుగోలు చేసిన తరువాత అంతర్జాతీయ గుర్తింపు పొందింది. ముంబై కేంద్రంగా ఈ సంస్థ ప్రపంచ వ్యాప్తంగా తన కార్యకలాపాలను కొనసాగిస్తుంటుంది. టాటా కెమికల్స్, టాటా కమ్యూనికేషన్స్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్, టాటా ఎల్క్సీ, టాటా మోటార్స్, టాటా పవర్, టాటా స్టీల్, వోల్టాస్, టాటా క్లిక్, టైటాన్, ట్రెంట్ (వెస్ట్ సైడ్), తాజ్ హోటల్స్, తాజ్ ఎయిర్, టాటా ఆటోకాంప్ సిస్టమ్స్ లిమిటెడ్, విస్టారా , తనీష్క్, జాగ్వార్ ల్యాండ్ రోవర్, క్రోమ్, సోనాట వంటి వన్నీ టాటా కంపెనీవె. దాదాపు ప్రపంచం లోని అన్ని దేశాల్లో (175) టాటా వ్యాపారాలు ఉన్నాయి.
ఇవే కాకుండా ఈ కింద పేర్కొన్నవన్నీ ప్రపంచ వ్యాప్తంగా పేరుపొందిన భారతీయ బ్రాండ్ లు కంపెనీ లు కావడం విశేషం.
1). లూయిస్ ఫిలిప్
2). పీటర్ ఇంగ్లాండ్
3).అల్లెన్ సోలీ
4). కెఫె కాఫీ డే
5). రేమండ్
8) మోంటే కార్లో
9). మునిచ్ పోలో
10). ఫ్రాంకో లియోన్.
You must log in to post a comment.