Posted in పండ్లు

నేరేడు పండు.

ఆరోగ్య ఫల ప్రధాయిని నేరేడు పండు ...
వేసవి కాలం లో భారతీయ ఉపఖండం లో విస్తారం గా దొరికే పండ్ల లో జామున్ లేదా నేరెడు పoడు ఒకటి.  భారత దేశం లో నేరేడు పండు  ముదురు ఊదా రంగు లో మే నుంచి ఆగష్టు వరకు విస్తారంగా దొరుకు తుంది.  ఒక గిన్నె నేరేడు పండ్ల పై ఉప్పు చిలకరించి ఒక రుచికరమైన వేసవి అల్పాహారం గా  తింటారు. నేరేడు లో అనేక పోషక విలువలు ఉన్నాయి. నేరేడు పండు ఆరోగ్య ప్రయోజనాలు క్రింది విధంగా వివరించ వచ్చు.
1. మధుమేహం కు మంచిది
జామున్ లేదా నేరేడు  శరీరంలోని  రక్తo లో  చక్కెర స్థాయిని  నియంత్రించడానికి సహాయపడుతుంది. ఇది తక్కువ శక్తి మరియు తరచుగా దాహం మరియు మూత్రవిసర్జన వంటి మధుమేహ లక్షణాలను  నివారిoచును. సుక్రోజ్ లేక పోవడం మరియు జంబోలిన్(jambolin) కలిగి శరీరం లోపల పిండి పదార్ధాలను చక్కెరగా మార్చడంను  అడ్డుకుంటుంది నేరేడు తేనెను  మధుమేహం కోసం ఒక తీపి ప్రత్యామ్నాయంగా ఉపయోగించవచ్చు.
2. శరీరం ను చల్లబరుచును.
నేరేడు పండు లో నీటి శాతo దాని మొత్తం బరువులో 84%కంటే ఎక్కువఉంది. ఫాస్పరస్ మరియు అయోడిన్ వంటి ఖనిజాలు కలిసి అది చమట, వేడి పరిష్కారంలో సహాయ పడును.1 కప్ నీరుమరియు 1 కప్ ఐస్ తో కప్పుల నేరేడు కాయల (విత్తనాలు లేకుండా) మిశ్రమంను  ఉప్పుమిరియాలుతేనె మరియు పుదీనా తో కలిపి తీసుకొన్న అది వేసవి లో ఒక చల్లని పానీయం అగును.
3. వ్యాధినిరోధక శక్తి పెంచును
విటమిన్లు B1, B2, B3 మరియు B6 పాటునలుపు నేరేడు పండులో  విటమిన్ సిఅంటి-ఆక్సిడెంట్ లను కలిగి అది శరీరం యొక్క రోగనిరోధక శక్తి పెంచును. అంటి-బ్యాక్తిరియాల్ లక్షణాలు కలిగి బహిర్గత మరియు అంతర్గత ఇన్ఫెక్షన్నినివారించును.  నీరు కలిపిన నేరేడు  పొడి(powder) చర్మం మరియు చిగుళ్ళ వ్యాధుల కోసం ఒక సహజ నివారణ మార్గంగా చెప్పవచ్చు.
4. ఎముకలను పటిష్టపరుచును.
నేరేడు  లో ఇనుముకాల్షియంమెగ్నీషియం మరియు పొటాషియం వంటి ముఖ్యమైన ఖనిజాల ఉనికిని ఎముకలు మరియు దంతములు బలపడటానికి తోడ్పడును.ఒక గాజు గ్లాస్ పాలలో ఒక టీ-స్పూన్  నేరేడు పొడి కలిపి తీసుకొన్న అది మీ ఎముకలు బలోపేతం అవడానికి తోడ్పడును.
5. క్యాన్సర్ ను అరికడుతుంది
నేరేడు లో ఉండే పోల్యఫేనోల్స్ లో (polyphenols) క్యాన్సర్   వ్యతిరేక లక్షణాలు ఉన్నాయని  అధ్యయనాలు నిరూపించాయి. నేరేడు కాయలను రోజు తీసుకొన్న ఇది మానవులలో కాన్సర్ వ్యాధి రాకుండా నిరోధించును.
.6. రక్తం శుద్ధి
నేరేడు లో ఉండే ఇనుము మరియు విటమిన్ సి రక్తమును  శుభ్రపర్చడానికి సహాయపడుతుంది మరియు రక్తంలో హిమోగ్లోబిన్ శాతం పెంచుతుంది.
7. మొటిమలు తొలగించును:
నేరేడు కొన్ని రకాల అస్త్రిజెంట్స్  ని కలిగి అవి బ్లాక్-హెడ్స్ ను మొటిమలను  మరియు అచ్నే(ACNE)లను నివారించును మరియు రక్తమును శుద్ది పరిచి చర్మమును  కాంతివంతంగా ఉంచును.
8. హృదయంను బలపరుస్తుంది.
నేరేడు లో  పొటాషియం మరియు ఫాస్పరస్ వంటి అత్యవసర ఖనిజాలు ఉంటాయి అవి  అదిక రక్త పోటు వంటి  కార్డియో వాస్కులర్ పరిస్థితులను  నిరోధించడానికి ఉపయోగపడతాయి.
9 . జీర్ణ క్రియ లో సహాయ పడును.
నేరుడు లో  జీర్ణక్రియను  ప్రోత్సహించే పీచు పదార్థం ఉందును. ఇది కాలేయo మరియు ప్లీహము తద్వారా డైజెస్టివ్ ట్రాక్ట్ ను సరిగా  ఉంచడం లో ప్రేరేపిస్తుంది
గుర్తుంచుకోవలసిన విషయాలు
Ø నేరేడుపండు  తినడం లో మితం పాటించండి. రెండు రోజులకు ఒక సారి ఈ రుచికరమైన పండ్లు 100 గ్రాములు తీసుకోండి.
Ø తినడానికి ముందు ఉప్పు నీటితో కడగడం మర్చిపోవద్దు.
Ø ఖాళీ కడుపుతో నేరేడు పండు ను తినవద్దు.
Ø నేరేడు పండు తిన్న తరువాత 2 గంటల ముందు లేదా వెనుక పాలు త్రాగవద్దు.
Ø గర్భవతి మరియు పాలుఇచ్చే తల్లులు నేరేడుపండ్లు  తిన రాదు.
Ø మధుమేహం ఉన్నవారు తక్కువ  పరిమాణం లో నేరేడు పండ్లు  తినవలయును.
నేరేడు పండుగా గాక  అదనంగా నేరేడు తేనెనేరేడు వెనిగర్ మరియు నేరేడు  ఆకుల సారం కూడా పండు వలె సమాన లాభాలను కలిగి ఉందని చెప్పవచ్చు.
కాబట్టి ఈ వేసవిలో నేరేడుపండు  రుచులను ఆస్వాదించండి మరియు ఈ రుచికరమైన పండు అందించే లెక్కలేనన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఫలితాలు  పొంది ఆరోగ్యంగా ఉండండిహ్యాపీ గా జీవించండి.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s