తక్కువ బడ్జెట్ లో బెస్ట్ కార్లు

మారుతీ సుజుకీ ఆల్టో..

samayam telugu
ఈ వాహనం భారత్ లో అత్యధిక విక్రయాలు అందుకున్న కారుగా గుర్తింపు తెచ్చుకుంది. మారుతీ సుజుకీ ఆల్టో మోడల్ సగటున నెలకు 18 వేల నుంచి 20 వేల యూనిట్ల అమ్మకాలు అందుకుంది. ఫిబ్రవరిలో ఈ కారు అత్యధిక విక్రయాలు అందుకున్న వాటిలో మూడో స్థానంలో ఉంది. ఆరు వేరియంట్లలో లభ్యమవుతున్న ఈ వాహనం బీఎస్4 మోడల్ తో పోలిస్తే ధర కొంచెం ఎక్కువ. 796 సీసీ ఇంజిన్ ను కలిగి ఉండి 47 బ్రేక్ హార్స్ పవర్, 69 ఎన్ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. అంతేకాకుండా 5-స్పీడ్ మ్యానువల్ ట్రాన్స్ మిషన్ వ్యవస్థతో ఇది పనిచేస్తుంది. ఫీచర్ల విషయానికొస్తే 7-అంగుళాల టచ్ స్క్రీన్ ఇంఫోటైన్మెంట్ వ్యవస్థ, ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ ప్లే లాంటి ప్రత్యేకతలు ఉన్నాయి. ఇవి కాకుండా డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగులు, యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టంతో కూడిన ఎలక్ట్రానిక్ బ్రేకింగ్ వ్యవస్థ, రివర్స్ పార్కింగ్ సెన్సార్లు, పవర్ విండోలు తదితర సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి. ఈ కారు మైలేజి వచ్చేసి లీటరుకు గరిష్ఠంగా 24.7 నుంచి 22.05 కిలోమీటర్ల వరకు ఇస్తుంది.
బీఎస్6 మారుతీ సుజుకీ ఆల్టో 800 ధర రూ. 3.6 లక్షల నుంచి 4.39 లక్షల మధ్య ఉంది.

​రెనాల్ట్ క్విడ్..

samayam telugu
తక్కువ బడ్జెట్ కార్లలో అత్యదిక విక్రయాలు అందుకుని పాపులరైన వాహనాల్లో రెనాల్ట్ క్విడ్ ఒకటి. నెలకు సగటున 4 వేల యూనిట్లు అమ్మకాలు అందుకుందీ కారు. జనవరిలో భారత విపణిలో లాంచ్ అయిన బీఎస్6 రెనాల్ట్ క్విడ్.. పాత మోడల్ కంటే ధర కొంచెం పెరిగింది. బీఎస్6 వాహనాల్లో అతి తక్కువ ధరకు వస్తున్న ఈ వాహనం ఆకట్టుకుంటోంది. ఇంజిన్ అప్ డేట్ మినహా మిగతా అంతా బీఎస్4 మోడల్ మాదిరే ఉన్న ఈ రెనాల్ట్ క్విడ్ డిజైన్ హైలెట్ గా ఉంది. హెడ్ ల్యాంప్ సెటప్, 8-అంగుళాల ఇంఫోటైన్మెంట్ వ్యవస్థ, ఫుల్లీ డిజిటల్ ఇన్ స్ట్రూమెంట్ కన్సోల్, ఎయిర్ బ్యాగులు, యాంటీ బ్రేకింగ్ సిస్టం, ఎలక్ట్రానిక్ బ్రేకింగ్ డిస్ట్రీబ్యూషన్ తదితర ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఇందులో రెండు ఇంజిన్ల ఆప్షన్లు ఉన్నాయి. 0.8 లీటర్ ఇంజిన్ యూనిట్ అయితే 53 బ్రేక్ హార్స్ పవర్, 72 ఎన్ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. అదే 1.0 లీటర్ ఇంజినైతే.. 67 బ్రేక్ హార్స్ పవర్, 91 ఎన్ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. రెండు ఇంజిన్లు 5-స్పీడ్ మ్యానువల్ గేర్ బాక్స్ తోనే పనిచేస్తాయి.
బీఎస్6 రెనాల్ట్ క్విడ్ 0.8 లీటర్ ఇంజిన్ ఖరీదు రూ. 2.92 లక్షల నుంచి 4.22 లక్షల మధ్య ఉంది.
బీఎస్6 రెనాల్ట్ క్విడ్ 1.0 లీటర్ ఇంజిన్ ఖరీదు రూ. 4.42 లక్షల నుంచి 5.01 లక్షల మధ్య ఉంది.

​హ్యుండాయ్ శాంత్రో..

samayam telugu
బీఎస్6 హ్యుండాయ్ శాంత్రో మోడల్.. భారత మార్కెట్లో 2018లో వచ్చింది. ఈ సరికొత్త శాంత్రో ధర వచ్చేసి రూ.4.57 లక్షల నుంచి రూ.5.98 లక్షల మధ్య ఉంది. ఈ కారులో 7-అంగుళాల ఇంఫోటైన్మెంట్ వ్యవస్థ, యాపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, రివర్స్ పార్కింగ్ కెమెరా సెన్సార్లు లాంటి ప్రత్యేకతలు ఇందులో ఉన్నాయి. 4 అంగుళాల చక్రాలను కారుకు అమర్చారు. ఇక కారు లోపలి భాగంలో ఉన్న స్థలాన్ని చక్కగా వినియోగించారు. సీట్ల అమరిక చక్కగా ఉంది. ఈ కారులో తొలిసారిగా వెనుక సీట్లకు కూడా ఏసీ సౌకర్యాన్ని కల్పించారు. హ్యాండ్ రెస్ట్‌ తదితర ఫీచర్లు కూడా ఉన్నాయి. ఈ కారులో 4-సిలిండర్‌ మోటార్‌తో 1.1లీటర్‌ ఎప్సిలాన్‌ ఇంజిన్‌ ఉంది. ఇది 68 బీహెచ్‌పీ శక్తిని, 99 ఎన్‌ఎం టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు. బీఎస్‌-6 నిబంధనలకు అనుకూలంగా ఈ కారును రూపొందించారు. కారు మైలేజీ విషయాన్నికొస్తే లీటర్‌ పెట్రోలుతో 20.3 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు.

​టాటా టియాగో..

samayam telugu
జనవరిలో లాంచ్ అయిన ఈ వాహనం పెట్రోల్ ఇంజిన్ తో మాత్రమే అందుబాటులోకి వచ్చింది. 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ 85 బ్రేక్ హార్స్ పవర్ 113 ఎన్ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. అంతేకాకుండా 5-స్పీడ్ మ్యానువల్ గేర్ బాక్, ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ వ్యవస్థతో పనిచేస్తుంది. పాత మోడల్ తో పోలిస్తే బీఎస్6 వాహనంలో డిజైన్ ను కొద్దిగా మార్పులు చేశారు. ఫీచర్ల విషయానికొస్తే 7-అంగుళాల హర్మన్ ఇంఫోటైన్మెంట్ వ్యవస్థ, ఫుల్లీ డిజిటల్ ఇన్ స్ట్రూమెంట్ ప్యానెల్, డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగులు, యాంటీ బ్రేకింగ్ సిస్టం, ఎలక్ట్రానిక్ బ్రేకింగ్ డిస్ట్రీబ్యూషన్, రివర్స్ పార్కింగ్ కెమెరా లాంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. బీఎస్6 టాటా టియాగో ధర రూ.4.6 లక్షల నుంచి 6.6 లక్షల మధ్య ఉంది. సేఫ్టీలోనూ ఈ వాహనంలో అత్యుత్తమగా ఉంది. గ్లోబల్ ఎన్సీఏపీ క్రాష్ టెస్టులో 5 స్టార్లకు గాను 4 స్టార్ల రేటింగ్ ను తెచ్చుకుంది.

​మారుతీ సుజుకీ వాగన్ ఆర్..

samayam telugu
మారుతీ సుజుకీ నుంచి అత్యుత్తమ విక్రయాలు అందుకున్న మరో వాహనం వాగన్ ఆర్. ఇటీవల బీఎస్6 ఫార్మాట్లో అప్ డేట్ అయిన ఈ కారులో రెండు ఇంజిన్ల ఆప్షన్లు ఉన్నాయి. 1.0 లీటర్ ఇంజిన్ 67 బ్రేక్ హార్స్ పవర్, 90 ఎన్ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. అదే 1.2 లీటర్ మోటార్ అయితే 83 బ్రేక్ హార్స్ పవర్, 115 ఎన్ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. రెండు ఇంజిన్లు 5-స్పీడ్ మ్యానువల్ గేర్ బాక్స్ లేదా ఆటోమేటిక్ లేదా ఏజీఎస్ ఆటోమేటిక్ ట్రాన్ మిషన్ వ్యవస్థతలతో పనిచేస్తాయి. ఇవి కాకుండా ఇందులో 7-అంగుళాల ఇంఫోటైన్మెంట్ వ్యవస్థ, సెమీ డిజిటల్ ఇన్ స్ట్రూమెంట్ ప్యానెల్, ఆల్ ఫోర్ పవర్ విండోలు, యాంటీ బ్రేకింగ్ సిస్టం, ఎలక్ట్రానిక్ బ్రేకింగ్ డిస్ట్రీబ్యూషన్, డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగులు లాంటి సేఫ్టీ ఫీచర్లూ దీని సొంతం.
1.0 లీటర్ మారుతీ సుజుకీ వాగన్ ఆర్ ధర రూ.4.42 లక్షల నుంచి 5.42 లక్షల మధ్య ఉంది.
1.2 లీటర్ మారుతీ సుజుకీ వాగన్ ఆర్ ధర రూ.5.10 లక్షల నుంచి 5.91 లక్షల మధ్య ఉంది.

మారుతీ సుజుకీ సెలేరియో..

samayam telugu
ఇటీవలే ఈ కారును బీఎస్6 ఫార్మాట్లోకి అప్డేట్ చేసి భారత మార్కెట్లో లాంచ్ చేసింది మారుతీ సుజుకీ. ఈ వాహనం 1.0-లీటర్ 3-సిలీండర్ల పెట్రోల్ ఇంజిన్ ను కలిగి ఉండి 68 బీహెచ్ పీ బ్రేక్ హార్స్ పవర్, 90 ఎన్ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. అదే సీఎంజీ వాహనమైతే.. 59 బీహెచ్ పీ బ్రేక్ హార్స్ పవర్, 78 ఎన్ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. అంతేకాకుండా 5-స్పీడ్ మ్యానువల్ ట్రాన్స్ మిషన్ వ్యవస్థ లేదా ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ వ్యవస్థతో ఇది పనిచేస్తుంది. ఈ సరికొత్త కారులో ఫీచర్లకు కొదవే లేదు. టచ్ స్క్రీన్, ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ ఓఆర్వీఎం లాంటి ప్రత్యేకతలు ఇందులో ఉన్నాయి. మారుతీ సుజుకీ వాగన్ ఆర్ తో పోలిస్తే ఈ వాహనం ధర దాదాపు 5 వేల రూపాయల తక్కువ. ఎక్స్ షోరూంలో మారుతీ సుజుకీ సెలేరియో వాహనం ధర వచ్చేసి రూ.4.41 లక్షల నుంచి 5.58 లక్షల మధ్య ఉంది.
%d bloggers like this:
Available for Amazon Prime