
భారతదేశంలో ఎంబీఏ కోర్సుల్లో ఎన్రోల్ అయిన వారి సంఖ్య పెరగడం, యువ గ్రాడ్యుయేట్లకు 100% ప్లేస్మెంట్లు మరియు వేతన భారీ ప్యాకేజీలు అనేక కొత్త ఐఐఎంలు మరియు ప్రైవేటు బిజినెస్స్ స్కూల్స్ పెరుగుదలకు దారితీసింది. ప్రతిష్టాత్మక ఐఐఎంలు మరియు ఇతర మ్యానేజ్మెంట్ స్కూల్స్ లో చేరడానికి కామన్ అడ్మిషన్ టెస్ట్ లేదా క్యాట్ కోసం ఏటా లక్షలాది ఆశావాదులు(Aspirants) దరఖాస్తు చేసుకుoటున్నారు.భారత దేశం లో అత్యంత క్లిష్టమైన(Tough) పరిక్షలలో CAT ఒకటి అందులో విజయం సాధించడం అంత సులువు కాదు.
అనేక పెద్ద కంపెనీలలో ప్లేస్మెంట్ కోసం ఎంబీఏ గ్రాడ్యుయేట్ల లబిస్తున్నప్పటికి రిక్రూటర్లు తరచుగా మేనేజ్మెంట్ డొమైన్లో టాలెంట్ పూల్ లేకపోవడం గురించి ప్రశ్నలు లేవనెత్తుతుంటారు. ఈ సమస్య పరిశ్రమ ఆధారిత విద్య మరియు శిక్షణ యొక్క నాణ్యతలో ఉంది. కోర్సు పూర్తయిన తరువాత, రిక్రూటర్లు లేవనెత్తే ఉపాధియేతర (non-employability) సమస్య మరియు టైర్ 2 మరియు టైర్ 3 బి స్కూల్స్ – పరిశ్రమ కు అనుసంధానం కాకపోవడం వంటి పలు కారణాల వల్ల పెద్ద సంఖ్యలో విద్యార్థులు ఉద్యోగాలు లేకుండా ఉన్నారు. అగ్రశ్రేణి ఐఐఎంలలో కూడా 100% ప్లేస్మెంట్ అనేది ఒక అపోహగా మిగిలిపోయింది. అధిక మొత్తాన్ని కోర్సు ఫీజుగా చెల్లించిన తరువాత కూడా చాలా మంది B-స్కూల్ గ్రాడ్యుయేట్లు నిరుద్యోగులుగా మిగిలి పోతున్నారు..
ఇందుకు ప్రభుత్వం చాలా చేయాల్సి ఉంది. వాటిలో ఒకటి పాలసీ ఫ్రేమ్‌వర్క్ కోసం ప్రత్యేక రెగ్యులేటరీ కౌన్సిల్‌ను ఏర్పాటు చేయడం మరియు గ్లోబల్ బిజినెస్ స్కూల్ యొక్క పారామితుల ప్రకారం PGDM కోర్సు ప్రవేశ పెట్టడానికి కొన్ని కనీస ప్రమాణాలను నిర్ణయిoచాలి. B-స్కూల్స్ గ్రాడ్యుయేట్లకు ఉపాధి అవకాశాలను కల్పించడoతో పాటు మ్యానేజ్మెంట్ డొమైన్ అభివృద్ధి చెందడానికి ఈ రంగంలో పరిశోధనలను ప్రోత్సహించాలి.
కాబట్టి అధిక ఫీజ్ వసులు చేసే ఈ కళాశాలలో విద్యార్ధులు ప్రవేశించే ముందు వారికి ఈ రంగంలో నిజంగా ఆసక్తి ఉందొ, లేదో లేదా వారు అధిక వేతన ప్యాకేజీల కోసం ఈ కోర్సును కోరుకుంటున్నారా అనేది విశ్లేషించడానికి ప్రయత్నించాలి. ఈ సంస్థలలో చేరడానికి ముందు విద్యార్ధులు పిజిడిఎం కోర్సు యొక్క కఠినమైన నిర్మాణానికి (rigorous structure) తమను తాము సిద్ధం చేసుకోవాలి.కేవలం అకాడెమిక్ అర్హతలు మాత్రమే కాదు, మంచి మేనేజర్ కావడానికి అవసరమైన ప్రతి రంగంలోనూ విద్యార్థి ప్రావీణ్యం కలిగి ఉండాలని కోర్సు ఆశిస్తుంది. వ్యక్తిత్వ వికాసం, ఆంగ్లంలో బాగా ప్రావీణ్యత, నాయకత్వ లక్షణాలను కలిగి ఉండాలని, మంచి రచన మరియు మాట్లాడే నైపుణ్యాలు, వస్త్రధారణ మరియు అనేక ఇతర లక్షణాలను కలిగి ఉండాలని కోర్సు కోరుకొంటున్నది.
పని అనుభవం ఉన్న వ్యక్తికి పరిశ్రమపై ఉన్న అవగాహన కారణంగా ఫ్రెషర్ కంటే మంచి ఉద్యోగ ఆఫర్ లభించే అవకాశం ఉంది అయితే వాటితో పాటు మీ CV మరియు ప్లేస్మెంట్ల యొక్క HR రౌండ్లో విశ్వాసం కూడా ముఖ్యమైనవి. మీరు 24 గంటలు వ్యవధిలో కొన్ని శారీరక శ్రమలతో పాటు కఠినమైన తరగతులు, క్షేత్ర పర్యటనలు, ప్రాజెక్టులు మరియు పనులను ఎటువంటి హడావిడి లేకుండా నిర్వహించగలరని అనుకుంటే, అప్పుడు MBA మీకు సరైన కోర్సు.
ఈ సంవత్సరం క్యాట్ ప్రవేశానికి కంప్యూటర్ ఆధారిత పరీక్షకు దాదాపు 2 లక్షల మంది హాజరుకావచ్చు. 20 ఐఐఎంలు మరియు అనేక ఇతర బి-పాఠశాలల్లో 5000 సీట్లు కలవు. పేపర్ మూడు విభాగాలను కలిగి ఉంటుంది అవి వెర్బల్ ఎబిలిటీ & రీడింగ్ కంప్రహేన్షన్, డేటా వివరణ & లాజికల్ రీజనింగ్ మరియు క్వాలిటేటివ్ ఎబిలిటీ (verbal ability & reading comprehension, data interpretation& logical reasoning and quantitative ability) MCQ రూపంలో మొత్తం 100 ప్రశ్నలను కలిగి ఉంటాయి.
3 గంటల వ్యవధిలో దిన్ని ఆన్సర్ చేయాలి. ప్రతి సరైన సమాధానానికి 3 మార్కులు ఇవ్వబడతాయి; ప్రతి తప్పు ఆన్సర్ కు –1 నెగటివ్ మార్క్ ఉంటుంది. విద్యార్థులు సిలబస్ మరియు మాక్ పేపర్‌ను పూర్తిగా అనేకసార్లు ప్రాక్టీస్ చేయాలి. ఈ పరీక్షలో సమయ నిర్వహణ (time management) ప్రధాన పాత్ర పోషిస్తుంది.
CAT లో బాగా స్కోర్ చేయాలంటే, క్యాట్ మీ జ్ఞానం యొక్క లోతును పరీక్షించడానికి ఒక పరీక్ష కాదని గ్రహించాలి, అయితే ఇది మీ నిర్వహణ నైపుణ్యాలను(Manegirial skills) పరీక్షిస్తుంది. ప్రయత్నించే మరియు వదిలివేసే ప్రశ్నలకు మీరు ప్రాధాన్యత ఇవ్వాలి. మీరు అన్ని విభాగాల మధ్య న్యాయంగా సమయం కేటాయించాలి. అంతేకాక ప్రేపరేషన్ సమయంలో కూడా, మీరు ప్రతి విభాగంలో మీ బలం మరియు బలహీనత ఉన్న ప్రాంతాలను గుర్తించాలి. రెగ్యులర్ మాక్స్(Mocks) మీకు ఇందులో సహాయపడతాయి.
ఆశావహులు (Aspirants) తాము ఏ రకమైన ప్రశ్నలను క్రమం తప్పకుండా తప్పులు చేస్తున్నారో విశ్లేషించాలి, ఇవి మొత్తం స్కోరులో నెగటివ్ గా ఉంటాయి. అప్పుడు ఆ టాపిక్స్ పైపైన చదవండి లేదా వాటిని వదిలివేయండి. మాక్ ఇవ్వడం కన్నా పోస్ట్ మాక్ విశ్లేషణ చాలా ముఖ్యం. ప్రతి మాక్ తరువాత అదే రోజున 3-4 గంటలు పేపర్‌ను విశ్లేషించాలి మరియు మెరుగుదల అవసమైన ప్రాంతాలను గమనించండి. మీ క్యాట్ షెడ్యూల్ సమయంలో అదే స్లాట్‌లో మాక్స్ ఇవ్వడానికి ప్రయత్నించండి
ది హిందూ లేదా హిందూస్తాన్ టైమ్స్ వంటి మంచి వార్తాపత్రికలు చదవండి ముఖ్యంగా సంపాదకీయ పేజీ, ప్రధాన ముఖ్యాంశాలు మరియు వ్యాపార పేజీ లో మంచి ఆర్టికల్స్. ఇది ఖచ్చితంగా మీ గ్రహించే నైపుణ్యాలను పెంచుతుంది మరియు CAT యొక్క రీడింగ్ కాంప్రహెన్షన్ విభాగంలో బాగా స్కోర్ చేయడానికి మీకు సహాయపడుతుంది. ఇంటర్నెట్లో క్యాట్ ప్రేపరేషణ్ పై వివిధ ఓపెన్ ఫోరమ్‌లను అనుసరించండి.
ఐఐఎంలో చేరిన వారి ప్రేపరేషన్ వివరాలు తెలుసుకోండి. క్యాట్ లో డేటా కోసం ఉత్తమమైన పుస్తకాల్లో ఒకటి అరుణ్ శర్మ పుస్తకం. క్యాట్ కోసం ప్రిపేర్ అవడం సంప్రదాయ ప్రేపరేషన్ కు భిన్నంగా ఉంటుంది. హార్డ్ వర్క్ దానితో పాటు ఎక్కువ స్మార్ట్ వర్క్ అవసరం.
You must log in to post a comment.