ఏలకులు /ఎలైచి: Elaichi

Health: * ఏలకులు

సుగంధ ద్రవ్యాలు చాలా ఉన్నాయి మరియు ప్రతి దానికి దాని  స్వంత ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఎలైచి (ఏలకులు), వివిధ వంటకాలు మరియు డెజర్ట్లలో విస్తృతంగా ఉపయోగించబడుతుంది. ఆహారంలో ఏలకులు /ఎలాచీని చేర్చుకోవడం జీవక్రియకు ఊపునివ్వడమే కాక, త్వరగా బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది.

ఏలకులు/ఎలైచి జీర్ణక్రియను ప్రేరేపిస్తుంది, జీవక్రియకు సహాయపడుతుంది మరియు ఉబ్బరం తగ్గిస్తుంది, ఇది బరువు తగ్గడానికి సూపర్ ఫుడ్ గా పనిచేస్తుంది.

బరువు తగ్గడానికి ఏలకులు:

ఆహారంలో ఏలకులు /ఎలాచీని చేర్చడానికి సులభమైన మార్గం నీటితో తీసుకోవడం. పాడ్ నుండి విత్తనాలను తీసివేసి, వాటిని ఒక గ్లాసు నీటిలో కలపండి., వాటిని రాత్రిపూట నానబెట్టండి. ఉదయాన్నే ఎలాయిచి నీరు ఖాళీ కడుపుతో త్రాగండి మరియు 60 నిమిషాలు పాటు  మరేదైనా తినకుండా ఉండండి. ఉత్తమ ఫలితాల కోసం ప్రతిరోజూ దీన్ని త్రాగాలి.

పాలలో ఏలకులు:

ఒక గ్లాసు పాలకు 2-3 పాడ్ల ఏలకుల/ఎలైచి తీసుకోండి. విత్తనాలను తీసివేసి, వాటిని ఒక రోకలి సహాయంతో చూర్ణం చేయండి. ఒక బాణలిలో ఒక గ్లాసు పాలు ఉడకబెట్టి దానికి ఎలాచీ పౌడర్ జోడించండి. కుంకుమ పువ్వు, పిండిచేసిన బాదం మరియు తేనెను కూడా జోడించవచ్చు. ఇది బరువు తగ్గడానికి సహాయపడటమే కాకుండా రుచిని పెంచడంలో సహాయపడుతుంది.

ఏలకుల టీ:

టీని అల్లం, తులసి, దాల్చినచెక్క మరియు లవంగాలతో తాగాలి. 2-3 ఎలకలు/ఎలైచి పాడ్స్‌ను తీసుకొని వాటిని పాలు, నీరు మరియు టీ ఆకులతో పాటు ఉడకబెట్టండి. అది ఉడకబెట్టిన తర్వాత, దాన్ని వడకట్టి చక్కెర లేదా తేనె జోడించండి. రుచికి అనుగుణంగా అల్లం లేదా తులసి ఆకులను కూడా జోడించవచ్చు

ఏలకులు/ఎలైచి యొక్క ఆరోగ్య ప్రయోజనాలు: రక్తంలో చక్కెర స్థాయిని సమతుల్యం చేయును. మాంగనీస్ రక్తంలో చక్కెర స్థాయిని నిర్వహించడానికి సహాయపడుతుంది. ఏలకులు /ఎలైచి మాంగనీస్ యొక్క గొప్ప మూలం, ఇది ఆహారంలో రక్తంలో చక్కెర స్థాయిలను సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది.

ఏలకులు అధిక రక్తపోటును తగ్గిoచును:

అధిక రక్తపోటును తగ్గించడానికి ఒక కప్పు పీచు రసం peach juice తీసుకొని, దానికి ఒక టేబుల్ స్పూన్ కొత్తిమీరతో పాటు ఒక చిటికెడు ఏలకుల /ఎలైచి పౌడర్ జోడించండి.

జీర్ణక్రియ కు సహాయం:

 అజీర్ణం మరియు మలబద్ధకం వంటి కడుపు సమస్యలకు ఏలకులు /ఎలైచి నిరూపితమైన నివారణ. జీర్ణక్రియకు సహాయపడే ఎంజైమ్‌ల స్రావంకు  కూడా ఇది సహాయపడుతుంది. భారీ భోజనం తర్వాత ఏలకులు నమలడం వల్ల కడుపు సమస్యలను పరిష్కరించును..

త్వరగా బరువు తగ్గడానికి, దినచర్యలో శారీరక శ్రమను కూడా చేర్చాలి. నడక /వ్యాయామం చేయడానికి కనీసం 30 నిమిషాలు కేటాయించండి మరియు తినే ఆహార పదార్థాల  పై శ్రద వహించండి. ఆరోగ్యమైన పానీయాలు తాగడం మరియు ఆరోగ్యకరమైన జీవనశైలి అనుసరించడం  బరువు తగ్గడం లో సహాయపడుతుంది

%d bloggers like this:
Available for Amazon Prime