ఆడీ కార్లు

​ఆడీ ఏ3..

samayam telugu
ఆడీ ఇండియా లైనప్ లో చౌకగా దొరిగే కార్లలో ఆడీ ఏ3 మోడల్ ముందువరుసలో ఉంది. ఈ ఏ3 సెడాన్ ప్రపంచ వ్యాప్తంగా ఎంతో విజయవంతమై మంచి విక్రయాలు అందుకుంది. మనదేశంలోనూ ఈ వాహనానికి మంచి ఆదరణ దక్కింది. భారత మార్కెట్లో ఈ వాహనం ధర వచ్చేసి రూ.29.2 లక్షల నుంచి రూ.32.21 లక్షల మధ్య ఉంది. లగ్జరీ సిగ్మెంట్లో ఇంత తక్కువ ధరకు దొరికే వాహనం ఇదే కావడం గమనార్హం. ఈ ఆడీ ఏ3 పెట్రోల్, డీజిల్ ఇంజిన్ ఆప్షన్లతో అందుబాటులోకి వచ్చింది. 1.4 లీటర్ పెట్రోల్, 2.0 లీటర్ డీజిల్ ఇంజిన్ తో పనిచేస్తుంది. డ్రైవింగ్ చేసేటప్పుడు కూడా విభిన్నమైన అనుభూతిని కలుగుతుంది.

​ఆడీ క్యూ3..

samayam telugu
తక్కువ ధరకు అందుబాటులో వచ్చే కార్ల జాబితాలో తర్వాత వస్తున్న వాహనం ఆడీ క్యూ3. భారత్ లో ఈ ఎస్ యూవీ అత్యంత చౌకగా రావడమే కాకుండా కంపెనీ పోర్ట్ ఫొలియోలో అత్యుత్తమ వాహనంగా గుర్తింపు తెచ్చుకుంది. ఆడీ ఏ3 మోడల్ మాదిరి ఇందులోనూ 1.4-లీటర్ పెట్రోల్, 2.0-లీటర్ డీజిల్ ఇంజిన్లను కలిగి ఉంది. ఈ ప్రీమియం ఎస్ యూవీ ఆఫ్ రోడ్ ఆఫ్ రోడింగ్ కెపాబిలిటీలతో సరికొత్త డ్రైవింగ్ డైనమిక్స్ తో అందుబాటులోకి రానుంది. ఈ ఎస్ యూవీ ధర వచ్చేసి రూ.34.96 లక్షల నుంచి రూ.43.61 లక్షల మధ్య ఉంది. ఈ సిగ్మెంట్లో తర్వాతి తరం క్యూ3 మోడల్ నూ 2020 మధ్యలో విడుదల చేసే అవకాశముంది.

​ఆడీ ఏ4..

samayam telugu
భారత్ లో ఆడీ వాహనాల్లో అత్యధిక విక్రయాలు సాధించిన మోడల్ ఆడీ ఏ4. ఎక్స్ షోరూంలో ఈ వాహనం ఖరీదు వచ్చేసి 41.96 లక్షల నుంచి రూ.46.96 లక్షల మధ్య ఉంది. అయితే దీని పాత మోడల్ తో పోలిస్తే ఆడీ ఏ4 వాహనం ధర కొంచెం ఎక్కువగా ఉంది. విభిన్నమైన డ్రైవింగ్ అనుభూతితో పాటు ఈ కారులో సరికొత్త ఫీచర్లు, అధునాతన సాంకేతికతను ఇందులో పొందుపరిచారు. ఆడీ ఏ4 వాహనం 1.4-లీటర్ పెట్రోల్ మోటార్ ను కలిగి ఉండి 150 బీహెచ్ పీ బ్రేక్ హార్స్ పవర్ ఉత్పత్తి చేస్తుంది. అంతేకాకుండా 7-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ వ్యవస్థతో పనిచేస్తుంది. ఆడీ ఏ4 2.0-లీటర్ టర్బో డీజిల్ ఇంజిన్ ను కూడా కలిగి ఉంది. ఇది 188 బీహెచ్ పీ బ్రేక్ హార్స్ పవర్, 400 ఎన్ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది.

ఆడీ ఏ6..

samayam telugu
ఈ జాబితాలో చివరగా వస్తున్న మోడల్ ఆడీ ఏ6. గతేడాదే భారత్ లోఈ మోడల్ కు చెందిన ఆరో తరం ఆడీ ఏ6 వాహనాన్ని భారత మార్కెట్లో లాంచ్ చేసిందీ సంస్థ. ఈ కారు లాంచ్ అయినప్పటీ నుంచి దేశవాళీగా కొనుగోలుదారు నుంచి పోటీ తీవ్రంగా ఉంది. ఈ లగ్జరీ ఏ6ను సెలబ్రెటీలు కూడా కొనుగోలు చేయడంతో దీని పాపులారిటీ అమాంతం పెరిగిపోయింది. భారత మార్కెట్లో ఈ కారు ధర వచ్చేసి రూ.54.42 లక్షల నుంచి 59.92 లక్షల మధ్య ఉంది. ఈ సిగ్మెంట్లో అత్యంత చౌకగా దొరుతున్న వాహనం ఇదే కావడం విశేషం. బీఎస్6 ప్రమాణాలకు అనుగుణంగా మార్పులు చేసిన ఈ వాహనం 2.0-లీటర్ టీఎఫ్ఎస్ఐ ఇంజిన్ ను కలిగి ఉండి 245 పీఎస్ పవర్, 370 ఎన్ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. అంతేకాకుండా 7-స్పీడ్ డ్యూయల్ క్లచ్ ట్రాన్స్ మిషన్ వ్యవస్థతో ఇది పనిచేస్తుంది.
ప్రస్తుతం ఆడీ ఏ సిరీస్ ఆడీ ఏ8 మోడల్ ను ఇటీవలే భారత మార్కెట్లో విడుదల చేసింది. ఎక్స్ షోరూంలో దీని ధర వచ్చేసి రూ.1.56 కోట్ల మధ్య ఉంది. పైన చెప్పిన ఈ వాహనాలు కాకుండా ప్రస్తుతం ఈ జర్మనీ కారుమేకర్ భారత్ లో 12 మోడళ్లను విక్రయానికి ఉంచింది.
%d bloggers like this:
Available for Amazon Prime