google.com, pub-9453835310745500, DIRECT, f08c47fec0942fa0
Posted in GENERAL_FOODS

సలాడ్లు

డ్రైఫ్రూట్ స‌లాడ్‌


కావల్సినవి :
  • అరటిపండు ముక్కలు : 1 కప్పు
  • యాపిల్‌ ముక్కలు : 1/2 కప్పు
  • ద్రాక్ష పళ్ళు : 1/2 కప్పు
  • పియర్‌ పండు ముక్కలు : 1/2 కప్పు
  • పాలు : 1గ్లాస్‌
  • పంచదార : 3 టేబుల్‌ స్పూన్లు
  • హార్లిక్స్‌ : 2 టేబుల్‌ స్పూన్లు
తయారీ :
  • ముందుగా స్టౌ మీద ఒక పాత్ర ఉంచి అందులో పాలు పోసి బాగా మరిగించాలి. 
  • తరవాత అందులో పంచదార, హార్లిక్స్‌ వేసి అవి కరిగేవరకు బాగా కలిపి దింపేయాలి.
  • పాలు బాగా చల్లారిన తరువాత, అందులో తరిగిపెట్టుకున్న పండ్లముక్కలు వేసి కలుపుకోవాలి.
  • పావుగంటసేపు ఫ్రిజ్‌లో ఉంచి సర్వ్‌ చేస్తే బావుంటుంది

ఫ్రూట్స్ స‌లాడ్‌



కావల్సినవి :

  • యాపిల్‌ ముక్కలు : 2 కప్పులు
  • పుచ్చకాయ ముక్కలు : 4
  • అరటిపండు ముక్కలు :5
  • పిస్తా పప్పులు : 6
  • బాదం : 6
  • ఎండుద్రాక్షలు : 10
  • పాలు : 1 కప్పు
  • పంచదార : 1/2 కప్పు
  • తేనె : 1 టేబుల్‌ స్పూన్‌


తయారీ :

  • ముందుగా యాపిల్‌ ముక్కల్ని చిన్న ముక్కలుగా కట్‌ చేసి పెట్టుకోవాలి.
  • అందులో సగం మిక్సీ జార్‌ లో వేసి మెత్తగా పేస్ట్‌ చేసి పెట్టుకోవాలి.
  • ఒక గిన్నెలో యాపిల్‌ ముక్కలు, పుచ్చకాయ ముక్కలు, అరటిపండు ముక్కలు వేసుకోవాలి.
  • పాలు వేడి చేసుకుని అందులో పంచదార, తేనె వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి.
  • పాలు చల్లారాక పండ్ల ముక్కల్లో పోయాలి.
  • యాపిల్‌ ముక్కల గుజ్జుని, డ్రైఫ్రూట్స్‌ కూడా వేసి బాగా కలిపి ఫ్రిజ్‌లో పెట్టుకోవాలి.
  • అంతే ఆపిల్‌ డ్రై ఫ్రూట్‌ సలాడ్‌ రెడీ.