బొల్లి అంటే బాగాలేదు విటిలిగో (Vitiligo) అని అంటే బాగుంటుంది.
విటిలిగో ను తెల్ల మచ్చల వ్యాధి అని లేదా ల్యూకోడెర్మా (Leucoderma) అని అంటారు.
ఈ విటిలిగో అనేది అసలు పెద్ద వ్యాధేమి కాదు. అయితే దీనికి నివారణ ఉంది అని చాలామంది అంటారు. ముఖ్యంగా ఆయుర్వేదం సహయంతో దీనిని పూర్తిగా నివారించవచ్చు అని చాలామంది వాదన.
కానీ నిజానికి దీనికి నివారణ (cure) లేదు , ఒక్కసారి వస్తే దీన్ని మ్యానేజ్ (Manage) చేస్కోడం తేలికే.
ఎందుకు పూర్తిగా నివారించలేం అంటే ఇది ఒక ఆటోఇమ్మూన్ డిసార్డర్ (Auto Immune Disorder).
సాధారణంగా మన దేహంలో మనకు వ్యాధి నిరోధక శక్తి ఉంటుంది. అది బయట నుంచి ఏదైనా వైరస్ గాని , బాక్టీరియా గాని మన లోపల ప్రవేశిస్తే దాన్ని చంపేస్తుంది. ఇది సహజంగా జరిగే ప్రక్రియ. కానీ ఆటోఇమ్మూన్ డిసార్డర్ లో వ్యాధి నిరోధక శక్తి దానికి అదే తప్పుడు సంకేతాలు ఇచ్చుకుని సొంత శరీరంలోని కణాలని లేదా అవయవాన్ని దాడి చేస్తుంది.
ఆటోఇమ్మూన్ డిజార్డర్ కు కొన్ని ఉదాహరణలు :
- విటిలిగో (Vitiligo) / ల్యూకోడెర్మా (Leucoderma)
- రుమాటైడ్ ఆర్థరైటిస్ (Rheumatoid arthritis) లేదా కీళ్ల వాతము
- జోగ్రేన్స్ సిండ్రోమ్ (Sjogren’s Syndrome)
ఈ వ్యాధి వచ్చిన వారు తమ చర్మం మీద సహజ రంగుని కోల్పోయి తెల్లగా అవుతారు. ఇలా ఎందుకు జరుగుతుంది అంటే మన శరీరంలో మనకు రంగుని (Pigmentation) (కి) దోహదపడే మెలనోసైట్స్ (Melanocytes) అనే కణాలు ఉంటాయి. ఈ మెలనోసైట్స్ మెలనిన్ (Melanin) అనే ఒక రంగు కారకాన్ని తయారు చేసి మన చర్మానికి రంగు వచ్చేలా చేస్తాయి. ఇది అందరికీ జరుగుతుంది.
కానీ విటిలిగో వచ్చిన వారికి ఈ మెలనొసైట్స్ అనేవి నాశనం అవుతాయి ఈ పనిని శరీరంలోని సొంత వ్యాధి నిరోధక వ్యవస్థ పొరపాటున చేస్తుంది. రంగుకు కారణం అయ్యే కణాలు (Melanocytes) లేకపోవడం వల్ల వీరు చర్మం పైన , జుట్టు పైన రంగుని కోల్పోతారు.
ఈ విటిలిగో ముట్టుకుంటే వచ్చేది కాదు. ఇది వచ్చిందని బాధ పడాల్సిన అవసరం లేదు. మంచి చికిత్స పొందితే మంచి ఫలితాలు ఉంటాయి. మంచి చికిత్స చేయించుకుని పోగొట్టుకున్న పిగ్మెంటేషన్ ను తిరిగి పొందిన వాళ్ళు కూడా ఉన్నారు.
You must log in to post a comment.