జ్యూస్‌లు

యాపిల్‌ జ్యూస్‌

కావల్సినవి : 
  • రెండు చిన్న యాపిల్స్‌ (పొట్టుతీసి తురుముకోవాలి)
  • రెండు కప్పుల పెరుగు
  • అర టీ స్పూను తాజా నిమ్మరసం
  • రెండున్నర కప్పులు చల్లటి నీళ్ళు
  • మూడు టేబుల్‌ స్పూన్ల పంచదార మెత్తగా చేసిన ఐస్‌ అవసరమైనంత.

తయారీ :
  • పెరుగు పంచదార, చల్లటి నీళ్లను మిక్సీజార్లో తీసుకుని ఒకసారి తిప్పాలి.
  • తయారైన లస్సీకి నిమ్మరసం యాపిల్‌ కలిపి మళ్లీ పట్టాలి.
  • సర్వింగ్‌ గ్లాసుల్లో మెత్తగా చేసిన ఐస్‌ను వేసి దానిపైన లస్సీ పోయాలి. 
  • యాపిల్‌ లస్సీ రెడీ

బాదం ఖీర్‌


కావలసినవి: 

  • పాలు ఒక లీటరు
  • బాదం పప్పుల ముద్ద పావు కప్పు
  • నానబెట్టి తొక్కుతీసి సన్న ముక్కలుగా చేసుకున్న బాదం పప్పులు మరో పావు కప్పు
  • సన్న ముక్కలుగా కోసుకున్న పిస్తా పప్పులు 15
  • చక్కెర అకప్పు
  • కుంకుమ పువ్వు చిటికెడు
  • నెయ్యి ఒక టీ స్పూను.

తయారుచేసే విధానం : 

  • మందంగా ఉండే గిన్నెలో పాలుపోసి సన్నటి సెగమీద ఆపకుండా తిప్పివండాలి.
  • కాసేపయ్యాక బాదం ముద్దవేసి పాలపరిమాణం సగానికి తగ్గేదాకా తిప్పుతూ ఉండండి.
  • వేరే గిన్నెలో నెయ్యివేసి పొయ్యి మీద పెట్టి బాదం, పిస్తా ముక్కలు బ్రౌన్‌ రంగు వచ్చేదాకా వేగించి ఆ పాలలో కలపాలి.
  • కుంకుమ పువ్వును విడిగా కొంచెం చల్లటి పాలలో కలిపి ఈ మిశ్రమంలో వేయాలి.
  • ఇప్పుడు చక్కెర వేసి కరిగేదాకా ఉంచి దించేయండి.

Related posts

%d bloggers like this: