చౌకగా దొరుకుతున్న టాప్ బీఎస్6 బైక్స్

బీఎస్4 మోటార్ సైకిళ్లతో పోలిస్తే తాజాగా వస్తున్న బీఎస్6 బైక్స్ ధర పెరగడం గమనిస్తున్నాం. ఇంజిన్ అప్ డేట్ తో కొన్ని సాధారణ మార్పులతో వస్తున్న ఈ సరికొత్త ద్విచక్రవాహనాల్లో చౌకగా దొరికే వాహనాలు ఉన్నాయి. వాటిలో బీఎస్6 హీరో హెచ్ఎఫ్ డీలక్స్, స్ప్లెండర్ ప్లస్, టీవీఎస్ స్టార్ సిటీ ప్లస్ లాంటి టూ-వీలర్లు బైక్ ప్రియులను ఊరిస్తున్నాయి.

samayam telugu
 కాలుష్య నియంత్రణ నిబంధనలకు అనుగుణంగా ఇంజిన్ ఒక్కటే అప్ డేట్ చేసినప్పటికీ ధర మాత్రం దాదాపు అన్ని బైక్స్ లోనూ పెంచేశాయి టూ-వీలర్ కంపెనీలు. ఈ నేపథ్యంలో బీఎస్6 మోటార్ సైకిళ్లలో చౌకగా దొరికే వాటికోసం ఎదురుచూస్తున్నారు చాలామంది. వీటిలో హీరో, హోండా, టీవీఎస్ లాంటి ద్విచక్రవాహన సంస్థలకు చెందిన కొన్ని బీఎస్6 బైక్స్ అతి తక్కువ ధరకే మార్కెట్లో లభ్యమవుతున్నాయి.

బీఎస్6 హీరో హెచ్ఎఫ్ డీలక్స్..

samayam telugu
ఎక్స్ షోరూంలో బీఎస్6 హీరో హెచ్ఎఫ్ డీలక్స్ బైక్ ధర 55,925 నుంచి 57,250 రూపాయల మధ్య ఉంది. మనదేశలో అత్యంత చౌకైన బీఎస్6 బైక్స్ లో ఈ మోటార్ సైకిల్ ముందువరుసలో ఉంది. ఇది రెండు వేరియంట్లలో లభ్యమవుతుంది. సెల్ఫ్ స్టార్ట్ అల్లాయ్ వీల్, సెల్ఫ్ స్టార్ట్ అల్లాయ్ వీల్ ఐ3ఎస్ అనే రెండు వేరియంట్లలో దీనిని కొనుగోలు చేసుకోవచ్చు. ఈ కమ్యూటర్ మోటార్ సైకిల్లో సరికొత్త బాడీ గ్రాఫిక్స్, కొత్త కలర్ ఆప్షన్లను పొందుపరిచారు. 100 సీసీ ఇంజిన్ ను కలిగి ఉన్న బీఎస్6 హీరో హెచ్ఎఫ్ డీలక్స్ బైక్.. 8 బీహెచ్ పీ బ్రేక్ హార్స్ పవర్, 8ఎన్ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. అంతేకాకుండా ఐడెల్ స్టార్ట్ స్టాప్ వ్యవస్థ అయిన ఐ3ఎస్ వల్ల ఇంధన వినియోగాన్ని తగ్గించుకునే సౌలభ్యాన్ని ఇందులో పొందుపరిచారు.

​బీఎస్6 హీరో స్ప్లెండర్ ప్లస్..

samayam telugu
చౌకగా దొరుకుతున్న బీఎస్6 మోటార్ సైకిళ్ల జాబితాలో వస్తున్న మరో బైక్ హీరో స్ప్లెండర్ ప్లస్. ఈ ఐకానిక్ బీఎస్6 స్ప్లెండర్ ప్లస్ ధర 59,600 నుంచి 63,110 రూపాయల మధ్య ఉంది. అయితే కొత్త కలర్ ఆప్షన్లో రావడం మినహా దీని డిజైన్, ఇతర ఫంక్షనల్స్ లో ఎలాంటి మార్పు లేదు. ఈ వాహనంలో వచ్చిన మరో పెద్ద మార్పు ఏమైనా ఉందంటే అది ఇంజినే. పవర్ డెలివరీని మెరుగుదల కోసం హీరో స్ప్లెండర్ ప్లస్ కార్పురేటర్ ను తొలగించారు. 100 సీసీ ఇంజిన్ ను కలిగి ఉన్న ఈ బైక్ 8 బీహెచ్ పీ బ్రేక్ హార్స్ పవర్ 8 ఎన్ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. కిక్ స్టార్ట్, సెల్ఫ్ స్టార్ట్, ఐ3ఎస్ టెక్నాలజీతో కూడిన సెల్ఫ్ స్టార్ట్ వచ్చే వేరియంట్ తో కలిపి మూడు వేరియంట్లలో ఇది లభ్యమవుతుంది.

​బీఎస్6 టీవీఎస్ స్టార్ సిటీ ప్లస్..

samayam telugu
సరికొత్త ఎల్ఈడీ హెడ్ లైట్, రేర్ వ్యూ మిర్రర్లకు సరికొత్త డిజైన్, రివర్క్ ఫెయిరింగ్ తో న్యూ లుక్ లో కనువిందు చేస్తోంది బీఎస్6 టీవీఎస్ స్టార్ సిటీ ప్లస్. ఎక్స్ షోరూంలో ఈ మోటార్ సైకిల్ ప్రారంభ ధర 62,043 నుంచి 62,534 రూపాయల మధ్య ఉంది. 5-స్టెప్ అడ్జస్టబుల్ షాక్ అబ్జార్బర్లు, స్పోర్టీ మఫ్లర్, యూఎస్ బీ మొబైల్ ఛార్జర్, న్యూ సెమీ డిజిటల్ ఇన్ స్ట్రూమెంట్ ప్యానెల్ ప్రత్యేకతలు బీఎస్4 స్టార్ సిటీ ప్లస్ వాహనంలో ఉన్నాయి. అంతేకాకుండా 110 సీసీ ఫ్యూయల్ ఇంజెక్టడ్ ఇంజిన్ ను కలిగి ఉన్న ఈ వాహనం 4-స్పీడ్ గేర్ బాక్స్ వ్యవస్థతో పనిచేస్తుంది. ఈ బైక్ ఇంజిన్ 8 బీహెచ్ పీ పవర్, 9 ఎన్ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. అంతేకాకుండా గరిష్ఠంగా గంటకు 90 కిలోమీటర్ల వేగంతో ఇది ప్రయాణిస్తుంది.

​బీఎస్6 హీరో స్ప్లెండర్ ఐస్మార్ట్..

samayam telugu
మనదేశంలో బీఎస్6 కాలుష్య నియంత్రణ ప్రమాణాలకు అనుగుణంగా రూపొందించిన బైక్ హీరో స్ప్లెండర్ ఐస్మార్ట్. ఎక్స్ షోరూంలో ఈ మోటార్ సైకిల్ ప్రారంభ ధర 64,900 రూపాయలుగా నిర్దేశించింది. పాత మోడల్ తో పోలిస్తే బీఎస్6 హీరో స్ప్లెండర్ ఐస్మార్ట్ బైక్ లో.. సరికొత్త డైమండ్ ఫ్రేమ్ ను అమర్చారు. అంతేకాకుండా ఈ ద్విచక్రవాహనంలో గ్రౌండ్ క్లియరెన్స్ నూ మెరుగుపరిచారు. దీంతోపాటు ఈ మోటార్ సైకిల్ సస్పెన్షన్ ను ఇంప్రూవ్ చేసి రైడ్ క్వాలిటీని పెంచారు. ఈ కమ్యూటర్ బైక్.. 9 బీహెచ్ పీ పవర్, 10 ఎన్ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది.

బీఎస్6 హోండా షైన్..

samayam telugu
గత నెలలో హోండా షైన్ బైక్ ను బీఎస్6 నిబంధనలకు అనుగుణంగా మార్చారు. ఎక్స్ షోరూంలో ఈ మోటార్ సైకిల్ ప్రారంభ ధర 67,857 నుంచి 72,557 రూపాయల మధ్య ఉంది. బీఎస్4 మోడల్ తో పోలిస్తే బీఎస్6 హోండా షైన్ ఖరీదు 9,500 రూపాయలు పెరిగింది. శుద్ధమైన ఇంజిన్, సరికొత్త ఫీచర్లు, ట్రాన్స్ మిషన్ వ్యవస్థలతో ఈ బండి ఆకట్టుకుంటోంది. అంతేకాకుండా సైడ్ కవర్లు, బాడీ గ్రాఫిక్స్, క్రోమ్ ఎక్సాహాస్ట్ కవర్ నూ అప్ డేట్ చేశారు. ఏసీజీ సైలెంట్ స్టార్ట్ సిస్టం ఈ మోటార్ సైకిల్లోని మరో ప్రత్యేకత. ఈ సరికొత్త హోండా షైన్ 124 సీసీ ఇంజిన్ ను కలిగి ఉండి 10.5 బీహెచ్ పీ బ్రేక్ హార్స్ పవర్, 11 ఎన్ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. అంతేకాకుండా ఇది 5-స్పీడ్ గేర్ బాక్స్ ట్రాన్స్ మిషన్ వ్యవస్థతో పనిచేస్తుంది. అయితే దీని బీఎస్4 మోడల్ 4-స్పీడ్ గేర్ బాక్స్ వ్యవస్థను కలిగి ఉంది.
%d bloggers like this:
Available for Amazon Prime