కావల్సినవి :
గుడ్లు – నాలుగు (పచ్చసొన మాత్రమే తీసుకోవాలి),
చక్కెర – పావుకప్పు,
మొక్కజొన్న పిండి – చెంచా
(కొన్ని పాలతో చిక్కగా చేసుకోవాలి), క్రీమ్ – కప్పు,
చిక్కటి పాలు – అరకప్పు, ఉప్పు – చిటికెడు,
వెనిల్లా ఎసెన్స్ – చెంచా
తయారీ :
అడుగు మందంగా ఉండే పాత్రలో పచ్చసొనా, చక్కెర, మిగిలిన పాలూ, మెక్కజొన్న మిశ్రమం తీసుకుని అన్నింటినీ బాగా కలపాలి.
ఇప్పుడు క్రీమ్ వేసి మరోసారి కలపాలి. ఈ పాత్రను సన్నని మంటపై ఉంచి అడుగు అంటకుండా కలుపుతూ ఉండాలి.
చిక్కగా అయ్యాక ఉప్పూ, వెనిలా ఎసెన్స్ కలిపి దింపేయాలి.
ఇది బాగా చల్లారాక మరో గిన్నెలోకి తీసుకుని డీప్ ఫ్రీజర్‌లో ఉంచాలి.
నాలుగైదు గంటలకు గట్టిబడుతుంది. తర్వాత బయటకు తీసి మీకు కావాలనుకుంటే దీనిపై చాక్లెట్ పలుకులు వేసుకోవచ్చు.
తర్వాత చల్ల చల్లగా సర్వ్ చేయండి.
You must log in to post a comment.