ఉత్తర కొరియా ఒక వింత దేశం అని చెప్పొచ్చు.
మరణించిన వ్యవస్థాపకుడు కిమ్ ఇల్-సుంగ్ ఇప్పటికీ ఆత్మ రూపంలో దేశాన్ని పాలిస్తున్నారని అక్కడి ప్రజలు విశ్వాసితారు.
1. ఉత్తర కొరియా లో ఇది 106 వ సంవత్సరం.
ఇది ప్రపంచంలోని 21 వ శతాబ్దం కావచ్చు, కానీ ఉత్తర కొరియాలోని ప్రజలకు, ఇది ఇప్పటికీ 106 వ “జూచే” సంవత్సరం. ఉత్తర కొరియా స్థాపకుడు కిమ్ ఇల్-సుంగ్ పుట్టిన తేదీ ఏప్రిల్ 15, 1912 నుండి వాళ్ళ మొదటి సంవత్సరం ప్రారంభమవుతుంది.
2. అక్కడ 3 టీవీ ఛానెల్స్ మాత్రమే ఉన్నాయి.
ప్రతి అంశం కూడా ప్రభుత్వ పరిశీలనలో ఉన్నందున, ఉత్తర కొరియా లో మీడియా పైన కఠినమైన ఆంక్షలు ఉన్నాయి . ప్రజలు వీక్షించడానికి 3 టెలివిజన్ ఛానెల్స్ కి మాత్రమే అనుమతి ఉంది, ప్రభుత్వ అనుమతి లేకుండా వాటిలో ఏ కార్యక్రమం కూడా ప్రసారం చేయరు.
3. ప్రతి రాత్రి కరెంట్ కోత
అప్పుడప్పుడు విద్యుత్ కోతలు ఉంటేనే మనకి విసుగొస్తుంది. అలాంటిది దేశం మొత్తం ప్రతీ రాత్రి చీకటిగా ఉంటె ఎలా ఉంటుందో ఊహించండి. అక్కడ ఇంధన సంక్షోభం కారణంగా ఇళ్లకు తగినంత విద్యుత్ సరఫరా చేయలేక ప్రతీ రాత్రి చీకటిగానే ఉంటుంది. అంతరిక్షం నుంచి తీసిన ఉత్తర కొరియా ఫోటో వైరల్ కావడంతో ఈ విషయం విదితమే.
4. ఒకే అభ్యర్థితో ఎన్నికలు
అక్కడ ఎన్నికలు హాస్యాస్పదంగా ఉంటాయి ఎందుకంటే మేయర్, ప్రావిన్షియల్ గవర్నర్లు లేదా స్థానిక అసెంబ్లీలకు ఎన్నికలు అయినా ప్రభుత్వం ఎన్నుకున్న ఒక అభ్యర్థి మాత్రమే నిలబడతాడు ప్రజలు అతనికే ఓటు వెయ్యాలి.
5. 3 తరాల శిక్షా నియమం
మూడు తరాల శిక్షా నియమం అంటే ఒక వ్యక్తి నేరం చేస్తే అతని కుటుంభం మొత్తం అంటే తాతలు, తల్లిదండ్రులు మరియు పిల్లలతో సహా అందర్నీ జైల్లో వేస్తారు.
6. ఉత్తర కొరియన్లు 28 వెబ్‌సైట్‌లను మాత్రమే సందర్శించవచ్చు.
ఉత్తర కొరియా పౌరులకు ఇంటర్నెట్‌లో 28 వెబ్‌సైట్‌లను బ్రౌజ్ చేయడానికి మాత్రమే అనుమతి ఉంది. వారి కి ఒక ఇంట్రానెట్ ఉంది, దానిని “క్వాంగ్మియోంగ్” లేదా వెలుగు అని పిలుస్తారు, దీని ద్వారా ఇంటర్నెట్ యాక్సెస్ చేయబడుతుంది, కంప్యూటర్ కొనడానికి కూడా ప్రభుత్వం నుండి ముందస్తు అనుమతి పొందాలి!
7. దేశంలో నీలి రంగు జీన్స్ నిషేధ౦.
ఉత్తర కొరియా నీలిరంగు జీన్స్‌ను అమెరికా సామ్రాజ్యవాదానికి చిహ్నంగా చూస్తుంది మరియు అందువల్ల దేశంలో వాటిని వాడడం నిషేధించింది.
8. పురుషులకు 28 కేశాలంకరణ మాత్రమే
కొరియన్ పురుషులు 28 కేశాలంకరణ జాబితా నుండి ఎంచుకోవచ్చు. ప్రభుత్వం ఆమోదించిన కేశాలంకరణ కాకుండా ఏదైనా కేశాలంకరణ చేసుకుంటే అది నేరంగా పరిగణించబడుతుంది . పెళ్లికాని స్త్రీ తప్పనిసరిగా జుట్టును చిన్నగా ఉంచుకోవాలి, వివాహిత స్త్రీలకు చాలా ఎక్కువ ఎంపికలు ఉంటాయి.
9. గంజాయి పైన నిషేధం లేదు
గంజాయి తీసుకోవడం అక్కడ నేరమేమి కాదు. ఏ షాప్ లో నైనా అమ్ముతారు.
You must log in to post a comment.