సాఫ్ట్ వేర్ కోర్సులు

హెచ్‌టీఎంఎల్:
నేటి డిజిటల్ యుగంలో సమాచారం మునివేళ్లపై లభిస్తోంది. ప్రతిదీ వెబ్‌సైట్లలో అందుబాటులో ఉంటుంది. వెబ్ పేజీలను డెవలప్ చేయడంలో హైపర్ టెక్ట్స్ మార్కప్ లాంగ్వేజ్ (హెచ్‌టీఎంఎల్) ప్రధాన పాత్ర పోషిస్తోంది. ఇది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌కాకున్నా.. వెబ్ అప్లికేషన్లను సృష్టించడంలో మొదటి నుంచి హెచ్‌టీఎంఎల్‌ను ఉపయోగిస్తున్నారు. దీనిపై పట్టుసాధించడం ద్వారా వెబ్ డిజైనర్‌గా, వెబ్ డెవలపర్‌గా రాణించొచ్చు. కంప్యూటర్ బేసిక్స్ తెలిసి వెబ్‌డిజైన్ వైపు వెళ్లాలనుకునే వారు హెచ్‌టీఎంఎల్ నేర్చుకోవచ్చు.
వెబ్‌సైట్https://www.w3schools.com/html

సీఎస్‌ఎస్:హెచ్‌టీఎంఎల్ వెబ్‌పేజీలను ఆకర్షణీయంగా తీర్చిదిద్దడానికి కాస్కేడింగ్ స్టైల్ షీట్ (సీఎస్‌ఎస్) ఉపయోగిస్తారు. వెబ్‌పేజీలో కలర్స్, ఫాంట్, టెక్ట్స్, ఇమేజ్, లింక్స్, టేబుల్స్, బార్డర్స్, మార్జిన్స్, ఔట్‌లైన్స్, డెమైన్షన్స్, స్క్రోల్‌బార్, పొజిషినింగ్, యానిమేషన్స్.. మొదలైన ఎన్నో ఫీచర్లు సీఎస్‌ఎస్ సొంతం. హెచ్‌టీఎంఎల్, సీఎస్‌ఎస్‌లను డిజైనింగ్, డెవలప్‌మెంట్ కోసం ఉపయోగించే ఇతర సాఫ్ట్‌వేర్‌లలోనూ ఉపయోగిస్తారు. యాంగులర్ జేఎస్, పీహెచ్‌పీ టెక్నాలజీలపై పనిచేసే క్రమంలో హెచ్‌టీఎంఎల్, సీఎస్‌ఎస్‌లు కూడా ఉపయోగించాల్సి ఉంటుంది. ఈ కోర్సులను అన్ని మూక్స్ ప్రొవైడర్లు ఆఫర్ చేస్తున్నారు. యూట్యూబ్‌లోనూ ఎంతో సమాచారం అందుబాటులో ఉంది.
వెబ్‌సైట్: https://www.w3schools.com/html

డెవాప్స్ (Devops):
సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్‌లో ప్లానింగ్, కోడింగ్, టెస్టింగ్, ప్రొడక్ట్ రిలీజ్, డిప్లాయ్, ఆపరేషన్, మానిటర్… ఇలా వివిధ దశలు ఉంటాయి. సాఫ్ట్‌వేర్ సంస్థలు కొన్ని ‘మోడల్స్’ ప్రకారం మొత్తం ప్రక్రియను పూర్తిచేస్తాయి. దీనికోసం వాటర్‌ఫాల్ మోడల్, ఏజైల్ మోడల్స్ లాంటి వాటిని సంస్థలు అనుసరిస్తుంటాయి. అయితే ఈ క్రమంలో ఆయా ‘మోడల్స్’లోని కొన్ని ప్రతికూలతలు సంస్థలకు సవాలుగా మారుతున్నాయి. ఉదాహరణకు డెవలప్ మెంట్ చేసిన కోడ్‌ను డిప్లాయ్ చేయడానికి పట్టే సమయం ఎక్కువగా ఉంటుంది. అలానే ఆపరేషన్స్ కూడా సంతృప్తిగాకరం లేకపోవడం, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఆటోమేషన్ టూల్స్ సమర్థంగా లేకపోవడం తదితర కారణాలతో సరికొత్త మోడల్ ఆవశక్యత ఏర్పడింది. ఈ క్రమంలోనే ‘డెవాప్స్(Devops)’ మార్కెట్‌లోకి వచ్చింది. ఇందులో డెవలపర్స్, ఆపరేషన్స్ విభాగాల సభ్యులు కలిసి ‘ఉత్పాదకత’ పెంచేందుకు కృషిచేస్తారు. అంటే.. ఏ ఒక్క ఉద్యోగి పని ఒకదశలోనే ఆగిపోకుండా ఒక జట్టుగా సాఫ్ట్‌వేర్ డెలివరీ, మెయింటెన్స్ వరకు కలిసి పనిచేస్తారు. డెవలపర్స్, సిస్టమ్ అడ్మిన్స్, టెస్టర్స్.. మొదలైన వారందరూ డెవాప్స్ ఇంజనీర్లుగా కలిసి పనిచేస్తారు. సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్‌కు కావాల్సిన రిక్వైర్‌మెంట్స్, టెస్టింగ్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డిప్లాయ్‌మెంట్, అప్లికేషన్ డెవలప్‌మెంట్, మానిటరింగ్, ఫీడ్‌బ్యాక్ తీసుకోవడం వరకూ… ఎండ్ టు ఎండ్ బాధ్యత అందరిపైనా ఉంటుంది. ఇదొక సైక్లింగ్ ప్రక్రియ.

  • గత సాఫ్ట్‌వేర్ లైఫ్ సైకిల్ మోడల్స్‌లో ఉన్న సవాళ్లను అధిగమించడానికి డెవాప్స్‌లో చాలా టూల్స్ ఉన్నాయి. వీటిద్వారా కంటిన్యూయస్ డెవలప్‌మెంట్, కంటిన్యూయస్ టెస్టింగ్, కంటిన్యూయస్ ఇంటిగ్రేషన్, కంటిన్యూయస్ డిప్లాయ్‌మెంట్, కంటిన్యూయస్ మానిటరింగ్ చేయడానికి వీలుంటుంది. డెవాప్స్‌కు జాబ్ మార్కెట్ సానుకూలంగా ఉంది. సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ లైఫ్ సైకిల్ ఆటోమేషన్‌వైపు వెళుతుంటే.. డెవాప్స్‌పై అవకాశాలు మెరుగవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. డెవాప్స్‌లో పలు దశల్లో ఉపయోగించే టూల్స్‌లో GIT, JENKINS, SELENIUM, DOCKER, PUPPET, CHEF, ANSIBLE, NAGIOS, ELK STACK, SPLUNK మొదలైన డెవలప్‌మెంట్, టెస్టింగ్, ఇంటిగ్రేషన్, డిప్లాయ్‌మెంట్, మానిటరింగ్ టూల్స్‌కు డిమాండ్ ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు.
  • డెవాప్స్‌పై వెళ్లాలంటే గతంలో ఐటీ రంగంలో పనిచేసిన అనుభవం ఉంటే మేలని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పలు ప్రాజెక్టుల్లో పనిచేసిన వారైతేనే రియల్ టైం పని అనుభవంతో బాగా రాణించడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా కోడింగ్, నెట్‌వర్కింగ్ తెలిసిన వారికి ఇది నప్పుతుంది. టూల్స్‌లో ఒక్కొక్కటి వేర్వేరు స్టేజీల్లో ఉపయుక్తంగా ఉంటాయి. ఉదాహరణకు స్ల్పంక్ టూల్ డేటా క్రోడీకరణకు సంబంధించిన టూల్‌గా చెప్పొచ్చు. ఆయా టూల్స్ నేర్చుకోవడానికి వాటి పేరు మీదనే వెబ్‌సైట్లు ఉన్నాయి.

వెబ్‌సైట్: https://www.edureka.co

%d bloggers like this:
Available for Amazon Prime