సంగీతం

మన శాస్త్రీయ సంగీతానికి,  విదేశాలకు వ్యత్యాసాలు ఉన్నాయా?

 

భారతీయులకే కాక ఐరోపా లో కూడా శాస్త్రీయ సంగీతం ఉన్నది. దాన్ని వెస్ట్రన్ క్లాసికల్ మ్యూజిక్ అంటారు. రినైజన్స్ యుగంలో కళల పట్ల పెరిగిన అవగాహన, కొత్త కొత్త పోకడలు, అప్పటిదాకా మతపరమైన సంగీతం నించి విడి వడి స్వయం ప్రతిపత్తి గల కళ గా (secular art form) పరిణమించింది. మోజర్ట్ వంటి మహా కళాకారుడు (మన సంగీత మూర్తిత్రయం పుట్టిన సమయంలోనే ) పియానో లో అద్భుతమైన ఓపెరాలు (గేయ రూపకం) రూపొందించి బహుళ ప్రాచుర్యం పొందాడు. రొమాంటిక్ యుగంలో (18వ శతాబ్దం) లో బీతోవెన్, బాక్ వంటి వారు ఎన్నెన్నో అద్భుతమైన సంగీత రూపకాలని, ధోరణులను ప్రవేశ పెట్టారు.
వెస్ట్రన్ క్లాసికల్ మ్యూజిక్ లో ప్రధానమైన వాయిద్యాలు పియానో,
వయోలిన్
ఇవి రెండూ 1700లు, 1600ల కాలంలో నిర్మింపబడ్డాయి. ఇటలీ, ఆస్ట్రియా వెస్ట్రన్ క్లాసికల్ కి ముఖ్య స్థానాలు.
వయోలా,
 
చెల్లో
ఫ్లూట్
ఇలా ఇతర వాయిద్యాలు కూడా వీటిలో వాడతారు. ప్రధానంగా ఐరోపా వర్ధిల్లుతున్న యుగంలో క్రోడీకరింపబడటం వల్ల సుస్థిరమయిన పద్ధతులు, శిక్షణా కేంద్రాలు (కన్సర్వేటరీ లు) ఏర్పడ్డాయి. ఇటలీ, ఆస్ట్రియా, ఫ్రాన్స్ దేశాల్లో ఇప్పటికీ 16/17 వ శతాబ్దాల కన్సర్వేటరి లు నడుస్తూ ఉన్నాయి.
ప్రతి సంస్కృతి లోను వారి వారి సంప్రదాయ సంగీతం, పాటలు ఉన్నా, శాస్త్రీయంగా నిర్దుష్టంగా ఉన్నవి బహుశా వెస్ట్రన్ క్లాసికల్ మ్యూజిక్, భారతీయ సంగీతాలు మాత్రమే.
మన సంగీతం లో పాడటం, కీర్తన రచన, సాహిత్య స్పర్శ ఉంటుంది. ప్రదర్శన ధోరణి (stage show) తక్కువ. మనది ఛాంబర్ మ్యూజిక్.
పాశ్చాత్య సంగీతం లో కొన్ని పదుల సంఖ్యలో వయోలిన్లు, పియానోలు, ఫ్లూట్, లయ వాయిద్యాలు, ఇలా ఇన్ని కూడి ఒక ఓపెరా వాయిస్తారు. అక్కడ గానం ఉన్నా, ఇదే ప్రధానం.
మనది వ్యక్తిగత కళ, పాశ్చాత్యులది సామూహిక కళ.
పాశ్చాత్య సంగీతంలో స్వరాలకి వేరే గుర్తులు (symbols) ఉన్నాయి. డో రే మీ … ఇలా వారి స్వరాల పేర్లు వారు రాయరు.. ఇలా రాస్తారు..
మన సంగీతంలో ఎవరి భాష లో వారు స్వరాలు రాసుకుంటారు. సమాపదమాపదని….ఇలా..
%d bloggers like this: