రెన్యూవబుల్ ఎనర్జీ కోర్సులు

ప్రస్తుతం ఒకవైపు ఇంధన అవసరాలు పెరుగుతున్నాయి. మరోవైపు తరుగుతున్న వనరుల ఫలితంగా ప్రత్యామ్నాయ ఇంధన వనరులపై దృష్టిసారించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో జాబ్ మార్కెట్లో ప్రత్యామ్నాయ ఇంధన వనరుల (రెన్యూవబుల్ ఎనర్జీ)పై అవగాహన ఉన్న నిపుణులకు డిమాండ్ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో రెన్యూవబుల్ ఎనర్జీకి అకడమిక్ సబ్జెక్ట్‌లలో స్థానం కల్పించారు. కొన్ని యూనివర్సిటీలు ఎనర్జీ స్టడీస్-ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీరింగ్‌లో భాగంగా ఈ సబ్జెక్ట్‌ను బోధిస్తున్నాయి. మరికొన్ని యూనివర్సిటీలు పీజీలో స్పెషలైజేషన్‌గా అందిస్తున్నాయి. ఇందులో సోలార్ ఎనర్జీ, బయోమాస్, విండ్ ఎనర్జీ, టైడ్ అండ్ వేవ్ ఎనర్జీ, ఫ్యూయల్ సెల్స్, హైడ్రోజన్ ఎనర్జీ, ఎనర్జీ మేనేజ్‌మెంట్, న్యూక్లియర్ ఎనర్జీ, ఎనర్జీ జనరేషన్, ఎనర్జీ పాలసీస్ తదితర అంశాలు బోధిస్తారు. ఈ కోర్సులు పూర్తిచేసిన అభ్యర్థులకు సోలార్-విండ్-న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్, బయోమాస్ కంపెనీలు, ఆర్కిటెక్చర్ ఫర్మ్స్, ఎన్‌జీవో, ఇంధనానికి సంబంధించిన ప్రభుత్వ శాఖల్లో అవకాశాలు ఉంటాయి.

రెన్యూవబుల్ ఎనర్జీ కోర్సులను అందిస్తున్న ఇన్‌స్టిట్యూట్‌లు:

 

 1. యూనివర్సిటీ ఆఫ్ పెట్రోలియం ఎన ర్జీ అండ్ స్టడీస్-డెహ్రాడూన్
  కోర్సు: ఎంటెక్ (పవర్ సిస్టమ్స్).
  వెబ్‌సైట్: www.upes.ac.in
 2. అమిటీ యూనివర్సిటీ-నోయిడా
  కోర్సు: ఎంటెక్ (సోలార్ అండ్ ఆల్టర్నేటివ్ ఎనర్జీ).
  వెబ్‌సైట్: www.amity.edu
 3. మౌలానా ఆజాద్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ-భోపాల్.
  కోర్సు: ఎంటెక్ (రెన్యూవబుల్ ఎనర్జీ).
  వెబ్‌సైట్: www.manit.ac.in
%d bloggers like this:
Available for Amazon Prime