నోబెల్ పురస్కారం… అంతర్జాతీయంగా ఎంతో పేరు, ప్రాధాన్యత వున్న అవార్డు . మానవ సమాజానికి ఉపయోగపడిన శాస్త్రవేత్తలకు ,స్వీడన్‌కు చెందిన ఆల్ర్ఫెడ్ నోబెల్ పేరు మీద 1901 నుంచి నోబెల్ బహుమతిని ఆరు రంగాల్లోఇస్తున్నారు. మెడిసిన్ / ఫిజియోలజీ , ఫిజిక్స్ ,కెమిస్ట్రీ,ఎకనమిక్స్, లిటరేచర్ ,శాంతి లో అవార్డు లు డిసెంబరు 10 న,స్టాక్ హోంలో ప్రతి సంవత్సరం ఇస్తారు. శాంతి బహుమతి బ్యాంకు ఆ ఫ్ స్వీడన్ ద్వారా ఇస్తారు
భారతీయులు, భారత సంతతికి చెందిన వారు లేదా భారత పౌరసత్వం వున్న, ఇప్పటివరకు నోబెల్ పొందిన భారతీయులు :
- రవీంద్రనాథ్ టాగూర్, (1913): భారత దేశాని కి చెందిన గొప్ప కవి. నవల రచయిత , నాటక కర్త, తత్వ వేత్త, విద్యావేత్త .
1913 లో సాహిత్యం లో నోబెల్ ప్రైజ్(గీతాంజలి) అందుకొన్నారు. శాంతినికేతన్, విశ్వభారతి, ప్రారంభించారు.
2 . సర్ సి.వి.రామన్ (1930): చంద్రశేఖర వెంకట రామన్ గొప్ప భారతీయ శాస్రవేత్త. రామన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్( బెంగుళూరు) కు వ్యవస్థాపక డైరెక్టర్ .

1930 లో ఫిజిక్స్ లో నోబెల్ ప్రైజ్ వచ్చింది. ప్రముఖ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (బెంగుళూరు) కి కి ఈయన మొదటి ఇండియన్ డైరెక్టర్ గ పనిచేసారు.1954 లో భారత ప్రభుత్వం మొట్టమొదటిసారిగా దేశంలో అత్యుత్తమ బిరుదు ‘భారతరత్న’ తో సత్కరించారు.
3. హర్‌గోవింద్ ఖొరానా (1968): ఈయన ఇండియన్ -అమెరికన్ బయో కెమిస్ట్ . 1968 లో కృత్రిమ జన్యువు కు మెడిసిన్/ఫిజియాలజీ లో నోబెల్ అందుకున్నారు.
4. మదర్ థెరిస్సా (1979): అల్బేనియా పుట్టిన రోమన్ క్యాథెలిక్ సన్యాసిని. 1979 లో నోబెల్ శాంతి బహుమతి పొందారు. 1980 లో భారత రత్న అవార్డు కూడా అందుకున్నారు.
5. సుబ్రహ్మణ్యన్ చంద్రశేఖర్(1983): భారత దేశం లో పుట్టి అమెరికా పౌరసత్వం స్వీకరించిన చంద్రశేఖర్ కు 1983 లో ఫిజిక్స్ లో నోబెల్ బహుమతి లభించింది. ” చంద్రశేఖర్ లిమిట్” ని కనుగొన్నందుకు ఈయనకి నోబెల్ వచ్చింది .
6. అమర్త్యసేన్ (1998): భారత్ కు చెందిన ఎకనామిస్ట్ . ఈయనకు 1998 లో ఎకనామిక్స్ లో నోబెల్ ప్రైజ్ , భారత రత్న అవార్డులు వచ్చాయి . ఈయన సంక్షేమ ఆర్థిక శాస్రం (వెల్‌ఫేర్ ఎకనమిక్స్) లో పరిశోధనలు చేసారు. లoడ న్ స్కూల్ అఫ్ ఎకనామిక్స్, ట్రినిటీ లో పనిచేసారు.
7.విద్యాధర్ సూరజ్ నయిపాల్ (2001): పూర్వీకుల రీత్యా భారత సంతతికి చెందినవాడు. ఆయన పూర్వీకులు వెస్టిండీస్‌లోని ట్రిని డాడ్ దీవికి వ్యవసాయక్షేత్రాలలో కూలీలుగా పనిచేయటానికి వెళ్ళారు. వారికీ సాహిత్యం లో నోబెల్ వచ్చింది .
8.వెంకట్రామన్ రామకృష్ణన్ (2009): భారత సంతతి శాస్తవ్రేత్త , రైబోసోముల రూపము, ధర్మములపై చేసిన పరిశోధనలకు గాను 2009 కెమిస్ట్రీ లో నోబెల్ ప్రైజ్ లభించింది .
9. కైలాష్ సత్యార్థి(2014) : ఈయన మధ్య ప్రదేశ్ కి చెందిన వారు. 2014 లో నోబెల్ శాంతి బహుమతి ని అందుకున్నారు. బాలల హక్కులు , విద్య కోసం పోరాడారు .ఈయన 1995 లో రాబర్ట్ కెన్నడీ మానవ హక్కుల అవార్డు , 2019 లో మదర్ తెరెసా మెమోరియల్ మొ. అవార్డులు పొందారు.
10. అభిజిత్ బెనర్జీ(2019): ఆర్థిక శాస్త్రంలో అభిజిత్ బెనర్జీకి ఈ పురస్కారం వచ్చింది. ఎకనమిక్స్‌లో నోబెల్ ప్రైజ్ అందుకుంటున్న రెండో భారతీయ వ్యక్తి ఈయన.ఈయన అమెరికాలోని మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఎకనమిక్స్ ప్రొఫెసర్‌గా ఉన్నారు.పేదరిక నిర్మూలనపై చేసిన పరిశోధనలకు గానూ నోబెల్ పురస్కారం వచ్చింది.
You must log in to post a comment.