డిజిటల్ మార్కెటింగ్‌

ఇంటర్నెట్ ద్వారా మార్కెటింగ్, అడ్వర్‌టైజ్‌మెంట్, ఆయా ఉత్పత్తులు, సేవలకు ప్రచారం కల్పించడమే… డిజిటల్ మార్కెటింగ్! ఇది కూడా సంప్రదాయ మార్కెటింగ్, అడ్వర్‌టైజింగ్‌లాగే ఉంటుంది కాకపోతే ఇంటర్నెట్ ద్వారా ఆన్‌లైన్ విధానంలో టెక్నాలజీని ఉపయోగిస్తూ ఉత్పత్తులకు మార్కెటింగ్ చేయాల్సి ఉంటుంది. నేటి సోషల్ మీడియా యుగంలో కంపెనీలు డిజిటల్ మార్కెటింగ్ విధానాలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నాయి. విని యోగదారులు ఎక్కువ సమయం ఆన్‌లైన్‌లో గడపుతుం డటమే అందుకు కారణమని చెప్పొచ్చు. ఏ విభాగంలో డిగ్రీ పూర్తిచేసినా డిజిటల్ మార్కెటింగ్‌ను తమ కెరీర్‌గా ఎంచుకోవచ్చు. కంప్యూటర్స్, ఇంటర్నెట్, ఈ కామర్స్, స్టాటిస్టిక్స్, డేటాతోపాటు సృజనాత్మకత కూడా ఉండాలి. వినియోగదారులను ఆకట్టుకునేలా తమ ఉత్పత్తులు, సేవలకు ఆన్‌లైన్‌లో ప్రచారం కల్పించగలిగే చాకచక్యం తప్పనిసరి. డిగ్రీ పూర్తయ్యాక ఆయా ఇన్‌స్టిట్యూట్‌లు డిజిటల్ మార్కెటింగ్‌కు సంబంధించి అందించే డిప్లొమా కోర్సులు, సర్టిఫికెట్ కోర్సుల్లో చేరడం ద్వారా డిజిటల్ మార్కెటింగ్ విధానాల గురించి అవగాహన పొందొచ్చు. మూక్స్ విధానంలో ఆన్‌లైన్ కోర్సులు పూర్తిచేసుకునే వీలుంది. ముఖ్యంగా డిజిటల్ మార్కెటింగ్ కెరీర్‌లో రాణించాలంటే.. సెర్చ్ ఇంజన్ ఆప్టిమైజేషన్, సెర్చ్ ఇంజన్ మార్కెటింగ్, వెబ్ డిజైనింగ్, ఈ కామర్స్ సొల్యూషన్స్, ఆన్‌లైన్ మార్కెటింగ్, ఈమెయిల్ మార్కెటింగ్, డిజిటల్ మార్కెటింగ్, కాపీ రైటింగ్ తదితర అంశాలపై పట్టు అవ సరం.

 

సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్ స్పెషలిస్ట్ అవ్వాలంటే?

డిజిటల్  మార్కెటింగ్  లో మనకు ఎక్కువ అవకాశాలు ఉన్న రంగం ఏదైనా ఉందా అంటే అది సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్. SEM ని సెర్చ్ ఇంజిన్ advertising అని, PPC అని కూడా అంటారు. PPC అంటే Pay Per Click. PPC expert అవ్వాలంటే ఏం చేయాలో యీ ఆర్టికల్ లో చూద్దాం.

డిజిటల్ మార్కెటింగ్ బేసిక్స్

PPC నేర్చుకునే ముందు డిజిటల్ మార్కెటింగ్ పై ప్రాథమిక అవగాహన ఖచ్చితంగా ఉండాల్సిందే. ఒక వేళ మీకు డిజిటల్ మార్కెటింగ్ బేసిక్స్ నేర్చుకోవాలి అనుకుంటే డిజిటల్ బడి తెలుగు లో అందిస్తున్న ఉచిత డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ నేర్చుకోండి.

గూగుల్ యాడ్స్ నేర్చుకోవడం

గూగుల్ ఒక్కటే సెర్చ్ ఇంజిన్ కాదు, గూగుల్ తో పాటు చాలా సెర్చ్ ఇంజిన్స్ ఉన్నప్పటికీ ఎక్కువ శాతం అంటే 96.63% గూగుల్ నే మన దేశంలో వాడతారు కాబట్టి మనం గూగుల్ యాడ్స్ ని నేర్చుకోవడానికి ప్రాధాన్యతని ఇవ్వాలి. గూగుల్ యాడ్స్ నేర్చుకుంటే చాలు ప్రారంభంలో. తరువాత అవసరాన్ని బట్టి బింగ్ యాడ్స్ ని కూడా నేర్చుకోవొచ్చు.
  • Google Adwords ని Google Ads గ పేరు మార్చారు
  • Bing Ads ని Microsoft Advertising గ పేరు మార్చారు
గూగుల్ యాడ్స్ ని ప్రాక్టికల్ గ నేర్చుకోవాలంటే యాడ్స్ రన్ చేస్తూ నేర్చుకోవాలి.

మెట్రిక్స్ నేర్చుకోవాలి

గూగుల్ యాడ్స్ లో ఉండే మెట్రిక్స్ కొన్ని
  1. Click-through rate
  2. Cost Per Click
  3. Quality Score
  4. Return on Ad Spend (ROAS)
  5. Cost Per Conversion
 
గూగుల్ యాడ్స్ ని ప్రాక్టికల్ గ నేర్చుకోవాలంటే యాడ్స్ రన్ చేస్తూ నేర్చుకోవాలి.

Best Resources

గూగుల్ యాడ్స్ ని మరింత మెరుగ్గా నేర్చుకోవాలంటే అవసరమైన వనరులు ఇవి.
మీరు బిగినర్స్ అయితే ఇందులో readiness series వీడియోస్ ని చూడండి

Landing Pages

లాండింగ్ పేజెస్ గురించి కూడా నేర్చుకోవాల్సిందే. లాండింగ్ పేజెస్ అత్యంత కీలక పాత్ర పోషిస్తాయి కన్వర్షన్స్ విషయంలో. లాండింగ్ పేజీ ని ఎలా క్రియేట్ చేయాలి, ad copy ఎలా ఉండాలి, visitor ని ఒప్పించగలిగేలా రాయటం ఎలా, ఇటువంటివి నేర్చుకోవాల్సి ఉంటుంది. లాండింగ్ పేజెస్ గురించి పూర్తి అవగాహన కోసం నేను మీకు Ultimate Landing Page Guide ఇస్తున్నాను. ఇది పూర్తిగా చదివితే మీకు అర్థము అవుతుంది.

Excel నేర్చుకోవాలి

గూగుల్ యాడ్స్ కి మాత్రమే కాదు, Microsoft Excel ని ప్రతి డిజిటల్ మార్కెటర్ నేర్చుకోవాలి. Excel యొక్క అవసరత SEO లో మరియు సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్ లో చాలా ఉంటుంది. యాడ్ copies ని సిద్ధం చేసుకోవడంలో కావొచ్చు , ad copy variations ఒకే place లో రాసుకొని ఇంప్రూవ్ చేయడం కోసం కావొచ్చు, బడ్జెట్ forecasting , campaign అనలిస్ లాంటి చాలా పనులకు excel చాలా అవసరం అవుతుంది. ఉదాహారణకు యీ ఆర్టికల్ చుడండి మీకు అర్థము అవ్వడానికి https://www.hanapinmarketing.com/ppc-library/guide/the-complete-guide-to-using-excel-for-ppc/
మీరు excel లో beginners అయితే PPC templates ని వాడండి.
 
%d bloggers like this:
Available for Amazon Prime