కంప్యూటర్‌ నెట్‌వర్కింగ్‌

కంప్యూటర్‌ డిజైన్, మెయింటెనెన్స్‌ అధ్యయనాన్ని కంప్యూటర్‌ నెట్‌వర్కింగ్‌గా చెప్పొచ్చు. ఇందులో నైపుణ్యం సాధించాలంటే ఆపరేటింగ్‌ సిస్టమ్స్, మైక్రోప్రాసెసర్స్, పీసీల కాన్ఫిగరేషన్, కంప్యూటర్‌ అసెంబ్లింగ్, డిసెంబ్లింగ్, ట్రబుల్‌ షూటింగ్‌ టెక్నిక్‌లపై పూర్తి అవగాహన అవసరం.
పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సులు ఆఫర్‌ చేస్తున్న సంస్థలు..
హైదరాబాద్‌లోని జవహర్‌లాల్‌ నెహ్రూ టెక్నలాజికల్‌ యూనివర్సిటీ, స్కూల్‌ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ.. కంప్యూటర్‌ నెట్‌వర్క్స్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ సెక్యూరిటీలో ఎంటెక్‌ కోర్సును అందిస్తోంది. గేట్‌/పీజీసెట్‌లో ప్రతిభ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. గేట్‌/పీజీసెట్‌ ద్వారా 72 శాతం విద్యార్థులను, స్పాన్సర్డ్‌ కేటగిరీ కింద 28 శాతం మంది విద్యార్థులను తీసుకుంటారు.
వెబ్‌సైట్‌: https://sit.jntuh.ac.in/
 
విశాఖపట్నంలోని ఆంధ్రా విశ్వవిద్యాలయం.. కంప్యూటర్‌ నెట్‌వర్క్స్‌ స్పెషలైజేషన్‌లో ఎంటెక్‌ కోర్సును అందిస్తోంది. గేట్‌/ప్రవేశ పరీక్ష ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు.
వెబ్‌సైట్‌www.andhrauniversity.info
తమిళనాడులోని కలసలింగం యూనివర్సిటీ.. నెట్‌వర్క్‌ ఇంజనీరింగ్, ఇన్ఫర్మేషన్‌ అస్యూరెన్స్‌ అండ్‌ సెక్యూరిటీ విభాగంలో ఎంటెక్‌ కోర్సును అందిస్తోంది.
అర్హత: సంబంధిత బ్రాంచ్‌లో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత.
ప్రవేశం: యూనివర్సిటీ నిర్వహించే ప్రవేశపరీక్షలో ర్యాంకు ఆధారంగా.
వెబ్‌సైట్‌: www.kalasalingam.ac.in
కోయంబత్తూర్‌లోని అమృత స్కూల్‌ ఆఫ్‌ ఇంజనీరింగ్‌.. కంప్యుటేషనల్‌ ఇంజనీరింగ్‌ అండ్‌ నెట్‌వర్కింగ్‌లో ఎంటెక్‌ కోర్సును ఆఫర్‌ చేస్తోంది.
అర్హత: 60 శాతం మార్కులతో ఏదైనా బ్రాంచ్‌లో బీఈ/బీటెక్‌ లేదా 60 శాతం మార్కులతో మ్యాథమెటిక్స్‌/ఫిజిక్స్‌/కంప్యూటర్‌ సైన్స్‌లలో ఎంఎస్సీ.
ప్రవేశం: ప్రవేశపరీక్ష/గేట్‌/జీడీ/పీఐలలో మార్కుల ఆధారంగా.
వెబ్‌సైట్‌: www.amrita.edu
%d bloggers like this:
Available for Amazon Prime