ఎకనామిక్స్‌లో ఉన్నత విద్యా కోర్సులు, కెరీర్ అవకాశాలు

ప్రపంచీకరణ, ఎల్లలు లేని వాణిజ్యం కారణంగా బ్యాచిలర్ ఆఫ్ ఎకనామిక్స్ (బీఏ) పూర్తిచేసిన వారికి జాబ్ మార్కెట్లో అవకాశాలు విస్తృతమవుతున్నాయి. వాస్తవానికి బీఏ ఎకనామిక్స్ విద్యార్థులు మూడేళ్లు/నాలుగేళ్ల (ఆనర్స్) బ్యాచిలర్ కోర్సులో భాగంగా ఎకనామిక్స్‌తోపాటు హిస్టరీ, పాలిటీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ తదితర సబ్జెక్టుల నుంచి ఏవైనా రెండు సబ్జెక్టులను ఎంచుకొని చదవాల్సి ఉంటుంది. బీఏ ఎకనామిక్స్ తర్వాత పోస్టుగ్రాడ్యుయేషన్ చేయడం ద్వారా ఉన్నత అవకాశాలను అందిపుచ్చుకోవచ్చు.

ఉన్నత విద్య:

  • ఎంఏ ఎకనామిక్స్
  • ఎంఏ అప్లైడ్ ఎకనామిక్స్
  • ఎంఎస్ క్వాంటిటేటివ్ ఎకనామిక్స్
  • మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ తదితర కోర్సులు అందుబాటులో ఉన్నాయి.


ఉద్యోగావకాశాలు:బీఏ ఎకనామిక్స్ తర్వాత ఎక్కువ మంది విద్యార్థులు బ్యాంకింగ్, ఇన్సూరెన్స్ రంగంలో ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తారు. దీంతోపాటు యూపీఎస్సీ నిర్వహించే సివిల్స్, రాష్ట్రాల స్థాయిలోని పబ్లిక్ సర్వీస్ కమిషన్‌లు జరిపే గ్రూప్స్ పరీక్షలకు హాజరయ్యేందుకు మొగ్గుచూపుతారు. బీఏ ఎకనామిక్స్ తర్వాత ఎకనామిక్స్‌లో పీజీ కూడా పూర్తిచేస్తే.. యూపీఎస్సీ ఏటా నిర్వహించే ఇండియన్ ఎకనామిక్ సర్వీస్‌కు సన్నద్ధమయ్యే వీలుంది. సబ్జెక్టుపై పట్టు, ప్రతిభ కలిగిన అభ్యర్థులు ఆర్థిక నిపుణులుగా రాణించొచ్చు. రిజర్వ్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ), నీతి ఆయోగ్, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ అండ్ పాలసీ వంటి విభాగాల్లో అవకాశాలు అందిపుచ్చుకోవచ్చు. దీంతోపాటు బోధన రంగంలోనూ అవకాశాలకు కొదవలేదు. ఎకనామిక్స్‌లో ఉన్నత విద్య తర్వాత ప్రైవేటు రంగంలో రీసెర్చ్ అనలిస్ట్, మార్కెటింగ్ అనలిస్ట్, ఎకనామిక్ కన్సల్టెంట్‌గా కెరీర్ ప్రారంభించొచ్చు.

ఉపాధి కల్పిస్తున్న రంగాలు:

  • ఎకనామిక్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూషన్స్
  • అనాలసిస్ అండ్ ఫోర్‌కాస్టింగ్ సంస్థలు
  • స్టాక్‌ఎక్ఛేంజ్‌లు
  • బ్యాంకులు, ఇతర క్రెడిట్ యూనిట్లు
  • మాన్యుఫ్యాక్చరింగ్ సంస్థలు
  • కంప్యూటర్, టెలీ కమ్యూనికేషన్ సంస్థలు
  • గవర్న్‌మెంట్ డిపార్ట్‌మెంట్స్ అండ్ స్టాటిస్టికల్ రీసెర్చ్ సంస్థలు..


టాప్ ఇన్‌స్టిట్యూట్‌లు:

  1. జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం ఎంఏ ఎకనామిక్స్‌ను ఆఫర్ చేస్తోంది.
    వెబ్‌సైట్:
     www.jnu.ac.in/main
  2. ఇందిరాగాంధీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డెవలప్‌మెంట్ రీసెర్చ్ (ఐజీఐడీఆర్) ఎంఎస్సీ ఎకనామిక్స్‌ని ఆఫర్ చేస్తోంది.
    వెబ్‌సైట్:
     http://www.igidr.ac.in
  3. ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ (యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ).. ఎంఏ ఎకనామిక్స్‌ను ఆఫర్ చేస్తోంది.
    వెబ్‌సైట్:
     http://econdse.org
  4. సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ స్టడీస్ (తిరువనంతపురం).. ఎంఏ అప్లయిడ్ ఎకనామిక్స్‌ను ఆఫర్ చేస్తోంది.
    వెబ్‌సైట్:
     http://www.cds.edu
  5. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ఎంఏ ఎకనామిక్స్‌ను ఆఫర్ చేస్తోంది.
    వెబ్‌సైట్:
     www.uohyd.ac.in
  6. మద్రాస్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్.. ఎంఏ జనరల్, పైనాన్షియల్, అగ్రికల్చర్, అప్లైడ్ క్వాంటిటేటివ్ ఫైనాన్స్, ఎన్విరాన్‌మెంటల్ వంటి స్పెషలైజేషన్లను ఆఫర్ చేస్తోంది.
    వెబ్‌సైట్:
     www.mse.ac.in
  7. ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్‌స్టిట్యూట్ (ఐఎస్‌ఐ).. ఎంఎస్-క్వాంటిటేటివ్ ఎకనామిక్స్ కోర్సును ఆఫర్ చేస్తోంది.
    వెబ్‌సైట్:
     www.isical.ac.in  
%d bloggers like this:
Available for Amazon Prime