కంప్యూటర్‌ నెట్‌వర్కింగ్‌

కంప్యూటర్‌ డిజైన్, మెయింటెనెన్స్‌ అధ్యయనాన్ని కంప్యూటర్‌ నెట్‌వర్కింగ్‌గా చెప్పొచ్చు. ఇందులో నైపుణ్యం సాధించాలంటే ఆపరేటింగ్‌ సిస్టమ్స్, మైక్రోప్రాసెసర్స్, పీసీల కాన్ఫిగరేషన్, కంప్యూటర్‌ అసెంబ్లింగ్, డిసెంబ్లింగ్, ట్రబుల్‌ షూటింగ్‌ టెక్నిక్‌లపై పూర్తి అవగాహన అవసరం. పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సులు ఆఫర్‌ చేస్తున్న సంస్థలు.. హైదరాబాద్‌లోని జవహర్‌లాల్‌ నెహ్రూ టెక్నలాజికల్‌ యూనివర్సిటీ, స్కూల్‌ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ.. కంప్యూటర్‌ నెట్‌వర్క్స్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ సెక్యూరిటీలో ఎంటెక్‌ కోర్సును అందిస్తోంది. గేట్‌/పీజీసెట్‌లో ప్రతిభ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. గేట్‌/పీజీసెట్‌ ద్వారా 72 శాతం విద్యార్థులను, స్పాన్సర్డ్‌ కేటగిరీ కింద 28 శాతం మంది విద్యార్థులను తీసుకుంటారు. వెబ్‌సైట్‌: https://sit.jntuh.ac.in/   విశాఖపట్నంలోని ఆంధ్రా విశ్వవిద్యాలయం.. కంప్యూటర్‌ నెట్‌వర్క్స్‌ స్పెషలైజేషన్‌లో ఎంటెక్‌ కోర్సును అందిస్తోంది. గేట్‌/ప్రవేశ పరీక్ష ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. వెబ్‌సైట్‌: www.andhrauniversity.info తమిళనాడులోని కలసలింగం యూనివర్సిటీ.. నెట్‌వర్క్‌ ఇంజనీరింగ్, ఇన్ఫర్మేషన్‌ అస్యూరెన్స్‌ అండ్‌…

Read More

మెటీయోరాలజీ కోర్సు

ఆంధ్రా యూనివర్సిటీ-విశాఖపట్నం కోర్సు: ఎంఎస్సీ (మెటీయోరాలజీ) అర్హత: బీఎస్సీ (మ్యాథమెటిక్స్, ఫిజిక్స్) ప్రవేశం: రాత పరీక్ష ఆధారంగా కోర్సు: ఎంటెక్ (అట్మాస్ఫియరిక్ సైన్స్) అర్హత: మెటియోరాలజీ/ఫిజికల్ ఓషనోగ్రఫీ/ ఫిజిక్స్/ మ్యాథమెటిక్స్/ అప్లైడ్ మ్యాథమెటిక్స్‌లో ఎంఎస్సీ. వెబ్‌సైట్:  www.andhrauniversity.edu.inసావిత్రీబాయి ఫూలే పుణె యూనివర్సిటీ కోర్సు: ఎంటెక్ (అట్మాస్ఫియరిక్ సైన్స్) అర్హత: బీఈ/బీటెక్ (మెకానికల్/ఎలక్ట్రికల్/ ఎలక్ట్రానిక్స్/టెలీకమ్యూనికేషన్/కంప్యూటర్/సివిల్/అగ్రికల్చరల్/ఎన్విరాన్‌మెంటల్/కెమికల్/ ఏరోస్పేస్/ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/బయోమెడికల్/ ఇంజనీరింగ్ ఫిజిక్స్/ఇన్‌స్ట్రుమెంటేషన్/ప్రొడక్షన్ అండ్ ఇండస్ట్రియల్. వెబ్‌సైట్: www.unipune.ac.in కోర్సు: ఎంఎస్సీ (అట్మాస్ఫియరిక్ సైన్స్) అర్హత: బీఎస్సీ/బీఈ/బీటెక్. గ్రాడ్యుయేషన్ స్థాయిలో మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ చదివి ఉండాలి. కెరీర్ అవకాశాలు: ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటీయోరాలజీ, ఇండియన్ ఎయిర్‌ఫోర్స్, స్పేస్ అప్లికేషన్ సెంటర్, ఇండియన్ మెటీయోరాలజీ డిపార్ట్‌మెంట్, నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ, ఇస్రో, డీఆర్‌డీఓ తదితర ప్రభుత్వ సంస్థలు మెటీయోరాలజీ అభ్యర్థులను రిక్రూట్ చేసుకుంటున్నాయి.

Read More

సోషియాలజీ కోర్సులు

ఒక మనిషి వ్యవహారశైలిని సమాజానికి అనుగుణంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన నైపుణ్యాలను అందించే సబ్జెక్టు సోషియాలజీ. రాష్ట్రంలోని దాదాపు అన్ని యూనివర్సిటీల్లోనూ బీఏలో సోషియాలజీ ఒక సబ్జెక్టుగా అందుబాటులో ఉంది. అంతేకాకుండా సోషియాలజీలో ఎంఏ, ఎంఫిల్, పీహెచ్‌డీ కోర్సులను కూడా ఆఫర్ చేస్తున్నాయి. జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ, బెనారస్ హిందూ యూనివర్సిటీ తదితర ప్రముఖ విద్యాసంస్థలు, సెంట్రల్ యూనివర్సిటీలు పీజీ స్థాయిలో సోషియాలజీని అందిస్తున్నాయి. ఐఐటీలు కూడా సోషియాలజీని కోర్ సబ్జెక్టుగా లేదా ఇంటర్ డిసిప్లినరీ కోర్సుగా పలు స్థాయిల్లో (ఎంఏ, ఎంఫిల్, పీహెచ్‌డీ) అందుబాటులో ఉన్నాయి. సోషియాలజీలో ఉమెన్ డెవలప్‌మెంట్, రూరల్ డెవలప్‌మెంట్, ట్రైబల్ డెవలప్‌మెంట్ తదితర స్పెషలైజేషన్లలో రీసెర్చ్ చేయడం ద్వారా అద్భుత అవకాశాలను అందిపుచ్చుకోవచ్చు. సోషియాలజీ కోర్సు పూర్తిచేసిన వారు అకడమిక్ అండ్ రీసెర్చ్ సంస్థల్లో అధ్యాపకులుగా అవకాశాలను దక్కించుకోవచ్చు.…

Read More

రెన్యూవబుల్ ఎనర్జీ కోర్సులు

ప్రస్తుతం ఒకవైపు ఇంధన అవసరాలు పెరుగుతున్నాయి. మరోవైపు తరుగుతున్న వనరుల ఫలితంగా ప్రత్యామ్నాయ ఇంధన వనరులపై దృష్టిసారించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో జాబ్ మార్కెట్లో ప్రత్యామ్నాయ ఇంధన వనరుల (రెన్యూవబుల్ ఎనర్జీ)పై అవగాహన ఉన్న నిపుణులకు డిమాండ్ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో రెన్యూవబుల్ ఎనర్జీకి అకడమిక్ సబ్జెక్ట్‌లలో స్థానం కల్పించారు. కొన్ని యూనివర్సిటీలు ఎనర్జీ స్టడీస్-ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీరింగ్‌లో భాగంగా ఈ సబ్జెక్ట్‌ను బోధిస్తున్నాయి. మరికొన్ని యూనివర్సిటీలు పీజీలో స్పెషలైజేషన్‌గా అందిస్తున్నాయి. ఇందులో సోలార్ ఎనర్జీ, బయోమాస్, విండ్ ఎనర్జీ, టైడ్ అండ్ వేవ్ ఎనర్జీ, ఫ్యూయల్ సెల్స్, హైడ్రోజన్ ఎనర్జీ, ఎనర్జీ మేనేజ్‌మెంట్, న్యూక్లియర్ ఎనర్జీ, ఎనర్జీ జనరేషన్, ఎనర్జీ పాలసీస్ తదితర అంశాలు బోధిస్తారు. ఈ కోర్సులు పూర్తిచేసిన అభ్యర్థులకు సోలార్-విండ్-న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్, బయోమాస్ కంపెనీలు, ఆర్కిటెక్చర్ ఫర్మ్స్, ఎన్‌జీవో, ఇంధనానికి సంబంధించిన…

Read More

ఎర్త్‌కేక్ ఇంజనీరింగ్

ఎర్త్‌కేక్ ఇంజనీరింగ్ నిపుణులు భూకంపాలపై అధ్యయనం చేస్తారు. భూకంపాలను తట్టుకునే భవనాలు, వంతెనలు, అణు విద్యుత్ కేంద్రాలు, ప్రాజెక్టులు; పెట్రోకెమికల్, ఇతర పారిశ్రామిక ప్రాంగణాలు, బహుళ అంతస్తు భవనాలు తదితర నిర్మాణాలను డిజైన్ చేస్తారు. ఈ రంగంలో ప్రపంచ వ్యాప్తంగా పరిశోధనలు ఉపందుకోవడంతో మానవ వనరులకు డిమాండ్ పెరుగుతోంది. కోర్సులో భాగంగా సెస్మిక్ హజార్డ్ అసెస్‌మెంట్, థియరీ ఆఫ్ ఎలాస్టిసిటీ, స్ట్రక్చరల్ డైనమిక్స్, ఎర్త్‌కేక్ రెసిస్టెంట్ డిజైన్ ఆఫ్ స్ట్రక్చర్స్, ఫైనైట్ ఎలిమెంట్ మెథడ్స్ తదితర అంశాలను బోధిస్తారు. కోర్సులు అందిస్తున్న కొన్ని సంస్థలు… రూర్కీలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)లో ప్రత్యేకంగా ఎర్త్‌కేక్ ఇంజనీరింగ్ విభాగం ఉంది. ఇది సిస్మిక్ వల్నరబిలిటీ అండ్ రిస్క్‌మేనేజ్‌మెంట్; సాయిల్ డైనమిక్స్; స్ట్రక్చరల్ డైనమిక్స్ స్పెషలైజేషన్లలో ఎంటెక్‌ను ఆఫర్ చేస్తోంది. అర్హత: సివిల్ లేదా స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ లేదా తత్సమాన బ్రాంచ్‌లో…

Read More

ఎంఎస్సీ మ్యాథమెటిక్స్

ఏ కెరీర్‌కు అయినా మ్యాథమెటిక్స్ సబ్జెక్టు మంచి పునాది. మ్యాథ్స్ నైపుణ్యంతో ఏ పోటీ పరీక్షలోనైనా తేలిగ్గానే నెగ్గొచ్చు. ఎందుకంటే… మ్యాథ్స్ విద్యార్థికి లాజికల్ థింకింగ్, ప్రాబ్లం సాల్వింగ్ నైపుణ్యాలు, నిర్ణయాత్మక సామర్థ్యం అలవడుతుంది. ఈ స్కిల్స్‌తో బ్యాంక్ పీవోస్, క్లర్క్స్, ఎస్‌ఎస్‌సీ సీజీఎల్, యూపీఎస్సీ వంటి పరీక్షలకు హాజరుకావచ్చు.ఆయా పోటీ పరీక్షల్లో రాణించేందుకు మ్యాథమెటిక్స్‌పై పట్టు ఎంతగానో దోహదపడుతుంది. వీటితోపాటు మ్యాథ్స్ అభ్యర్థులు ఐటీ రంగంలోనూ ప్రవేశించొచ్చు. ముఖ్యంగా ప్రస్తుతం హాట్ కెరీర్స్‌గా మారిన డేటాసైంటిస్ట్, డేటా అనలిటిక్స్ ఉద్యోగాలకు మ్యాథ్స్ స్కిల్స్ తప్పనిసరి. ఎంఎస్సీ మ్యాథ్స్ చదువుతూనే జాబ్ మార్కెట్‌లో డిమాండ్ ఉన్న వివిధ కంప్యూటర్ కోర్సులు నేర్చుకోవడంతోపాటు, ప్రోగ్రామింగ్ నైపుణ్యాలు పెంచుకోవడం ద్వారా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా ఉద్యోగాలు సొంతం చేసుకోవచ్చు. వీటితోపాటు బీమా, బ్యాంకింగ్, ఫైనాన్స్, ఎఫ్‌ఎంసీజీ, మార్కెటింగ్ రంగాల్లో అవకాశాలు అందుకోవచ్చు.…

Read More

సంగీతం

మన శాస్త్రీయ సంగీతానికి,  విదేశాలకు వ్యత్యాసాలు ఉన్నాయా?   భారతీయులకే కాక ఐరోపా లో కూడా శాస్త్రీయ సంగీతం ఉన్నది. దాన్ని వెస్ట్రన్ క్లాసికల్ మ్యూజిక్ అంటారు. రినైజన్స్ యుగంలో కళల పట్ల పెరిగిన అవగాహన, కొత్త కొత్త పోకడలు, అప్పటిదాకా మతపరమైన సంగీతం నించి విడి వడి స్వయం ప్రతిపత్తి గల కళ గా (secular art form) పరిణమించింది. మోజర్ట్ వంటి మహా కళాకారుడు (మన సంగీత మూర్తిత్రయం పుట్టిన సమయంలోనే ) పియానో లో అద్భుతమైన ఓపెరాలు (గేయ రూపకం) రూపొందించి బహుళ ప్రాచుర్యం పొందాడు. రొమాంటిక్ యుగంలో (18వ శతాబ్దం) లో బీతోవెన్, బాక్ వంటి వారు ఎన్నెన్నో అద్భుతమైన సంగీత రూపకాలని, ధోరణులను ప్రవేశ పెట్టారు. వెస్ట్రన్ క్లాసికల్ మ్యూజిక్ లో ప్రధానమైన వాయిద్యాలు పియానో, వయోలిన్ ఇవి రెండూ…

Read More

నోబెల్ బహుమతులు

నోబెల్ పురస్కారం… అంతర్జాతీయంగా ఎంతో పేరు, ప్రాధాన్యత వున్న అవార్డు . మానవ సమాజానికి ఉపయోగపడిన శాస్త్రవేత్తలకు ,స్వీడన్‌కు చెందిన ఆల్ర్ఫెడ్‌ నోబెల్‌ పేరు మీద 1901 నుంచి నోబెల్‌ బహుమతిని ఆరు రంగాల్లోఇస్తున్నారు. మెడిసిన్ / ఫిజియోలజీ , ఫిజిక్స్ ,కెమిస్ట్రీ,ఎకనమిక్స్, లిటరేచర్ ,శాంతి లో అవార్డు లు డిసెంబరు 10 న,స్టాక్ హోంలో ప్రతి సంవత్సరం ఇస్తారు. శాంతి బహుమతి బ్యాంకు ఆ ఫ్ స్వీడన్ ద్వారా ఇస్తారు భారతీయులు, భారత సంతతికి చెందిన వారు లేదా భారత పౌరసత్వం వున్న, ఇప్పటివరకు నోబెల్ పొందిన భారతీయులు : రవీంద్రనాథ్‌ టాగూర్‌, (1913): భారత దేశాని కి చెందిన గొప్ప కవి. నవల రచయిత , నాటక కర్త, తత్వ వేత్త, విద్యావేత్త . 1913 లో సాహిత్యం లో నోబెల్ ప్రైజ్(గీతాంజలి) అందుకొన్నారు. శాంతినికేతన్, విశ్వభారతి, ప్రారంభించారు. 2 . సర్‌ సి.వి.రామన్‌ (1930): చంద్రశేఖర వెంకట రామన్ గొప్ప భారతీయ శాస్రవేత్త. రామన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్( బెంగుళూరు) కు…

Read More

మిసైల్ సైంటిస్ట్

మిసైల్ సైంటిస్ట్ ప్రధా నంగా మిసైల్ డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ కార్య కలాపాల్లో పాల్గొంటాడు. మిసైల్ సైంటిస్ట్‌గా స్థిరప డేందుకు అవసరమైన ప్రా థమిక అర్హత…ఇంజనీరింగ్ డిగ్రీ. ఏరోస్పేస్/ఎలక్ట్రికల్/మెకానికల్/ కంప్యూటర్ సైన్స్ /మెటలర్జికల్ తదితర బ్రాంచ్‌ల్లో ప్రథమ శ్రేణిలో ఇంజనీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణులైన వారు మిసైల్ వంటి విభాగాల్లో సైంటిస్ట్‌గా స్థిరపడొచ్చు. దేశంలో డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్‌డీవో).. ఇండియన్ నేవీ, ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్‌కు అవసరమైన రక్షణ వ్యవస్థలు, పరికరాలను అభివృద్ధి చేస్తోంది. ఇందులో భాగంగా డీఆర్‌డీవో వివిధ మార్గాల్లో సైంటిస్ట్‌ల రిక్రూ ట్‌మెంట్ చేపడుతుంది. వీటిద్వారా నచ్చిన విభాగంలో సైంటిస్ట్‌గా అడుగుపెట్టొచ్చు.నియామక విధానం :డెరైక్ట్ ఎంట్రీ: సైంటిస్ట్ ఎంట్రీ టెస్ట్ (సెట్) ద్వారా క్లాస్‌వన్ ఆఫీసర్ పోస్టుల (గ్రూప్ ఏ)ను భర్తీ చేస్తోంది.అర్హత: కెమికల్/కంప్యూటర్/ఎలక్ట్రికల్/ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్/మెకాని కల్ స్పెషలైజేషన్లతో బీఈ/బీటెక్ ప్రథమ శ్రేణిలో…

Read More

డిజిటల్ మార్కెటింగ్‌

ఇంటర్నెట్ ద్వారా మార్కెటింగ్, అడ్వర్‌టైజ్‌మెంట్, ఆయా ఉత్పత్తులు, సేవలకు ప్రచారం కల్పించడమే… డిజిటల్ మార్కెటింగ్! ఇది కూడా సంప్రదాయ మార్కెటింగ్, అడ్వర్‌టైజింగ్‌లాగే ఉంటుంది కాకపోతే ఇంటర్నెట్ ద్వారా ఆన్‌లైన్ విధానంలో టెక్నాలజీని ఉపయోగిస్తూ ఉత్పత్తులకు మార్కెటింగ్ చేయాల్సి ఉంటుంది. నేటి సోషల్ మీడియా యుగంలో కంపెనీలు డిజిటల్ మార్కెటింగ్ విధానాలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నాయి. విని యోగదారులు ఎక్కువ సమయం ఆన్‌లైన్‌లో గడపుతుం డటమే అందుకు కారణమని చెప్పొచ్చు. ఏ విభాగంలో డిగ్రీ పూర్తిచేసినా డిజిటల్ మార్కెటింగ్‌ను తమ కెరీర్‌గా ఎంచుకోవచ్చు. కంప్యూటర్స్, ఇంటర్నెట్, ఈ కామర్స్, స్టాటిస్టిక్స్, డేటాతోపాటు సృజనాత్మకత కూడా ఉండాలి. వినియోగదారులను ఆకట్టుకునేలా తమ ఉత్పత్తులు, సేవలకు ఆన్‌లైన్‌లో ప్రచారం కల్పించగలిగే చాకచక్యం తప్పనిసరి. డిగ్రీ పూర్తయ్యాక ఆయా ఇన్‌స్టిట్యూట్‌లు డిజిటల్ మార్కెటింగ్‌కు సంబంధించి అందించే డిప్లొమా కోర్సులు, సర్టిఫికెట్ కోర్సుల్లో చేరడం…

Read More

సాఫ్ట్ వేర్ కోర్సులు

హెచ్‌టీఎంఎల్:నేటి డిజిటల్ యుగంలో సమాచారం మునివేళ్లపై లభిస్తోంది. ప్రతిదీ వెబ్‌సైట్లలో అందుబాటులో ఉంటుంది. వెబ్ పేజీలను డెవలప్ చేయడంలో హైపర్ టెక్ట్స్ మార్కప్ లాంగ్వేజ్ (హెచ్‌టీఎంఎల్) ప్రధాన పాత్ర పోషిస్తోంది. ఇది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌కాకున్నా.. వెబ్ అప్లికేషన్లను సృష్టించడంలో మొదటి నుంచి హెచ్‌టీఎంఎల్‌ను ఉపయోగిస్తున్నారు. దీనిపై పట్టుసాధించడం ద్వారా వెబ్ డిజైనర్‌గా, వెబ్ డెవలపర్‌గా రాణించొచ్చు. కంప్యూటర్ బేసిక్స్ తెలిసి వెబ్‌డిజైన్ వైపు వెళ్లాలనుకునే వారు హెచ్‌టీఎంఎల్ నేర్చుకోవచ్చు.వెబ్‌సైట్: https://www.w3schools.com/htmlసీఎస్‌ఎస్:హెచ్‌టీఎంఎల్ వెబ్‌పేజీలను ఆకర్షణీయంగా తీర్చిదిద్దడానికి కాస్కేడింగ్ స్టైల్ షీట్ (సీఎస్‌ఎస్) ఉపయోగిస్తారు. వెబ్‌పేజీలో కలర్స్, ఫాంట్, టెక్ట్స్, ఇమేజ్, లింక్స్, టేబుల్స్, బార్డర్స్, మార్జిన్స్, ఔట్‌లైన్స్, డెమైన్షన్స్, స్క్రోల్‌బార్, పొజిషినింగ్, యానిమేషన్స్.. మొదలైన ఎన్నో ఫీచర్లు సీఎస్‌ఎస్ సొంతం. హెచ్‌టీఎంఎల్, సీఎస్‌ఎస్‌లను డిజైనింగ్, డెవలప్‌మెంట్ కోసం ఉపయోగించే ఇతర సాఫ్ట్‌వేర్‌లలోనూ ఉపయోగిస్తారు. యాంగులర్ జేఎస్, పీహెచ్‌పీ టెక్నాలజీలపై పనిచేసే…

Read More

వైల్డ్‌లైఫ్ బయాలజీ

కోర్సులను ఆఫర్ చేస్తున్న సంస్థలు..1. నేషనల్ సెంటర్ ఫర్ బయలాజికల్ సైన్స్-బెంగళూరు.కోర్సు: ఎంఎస్సీ వైల్డ్‌లైఫ్ బయాలజీ అండ్ కన్జర్వేషన్.అర్హత: కోర్ సబ్జెక్టుల్లో 60 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ.వెబ్‌సైట్: www.ncbs.res.in2. ఏవీసీ కాలేజ్, మయిలదుతరై, తమిళనాడు.కోర్సు: ఎంఎస్సీ వైల్డ్‌లైఫ్ బయాలజీ.అర్హత: లైఫ్‌లెన్సైస్ లేదా లైఫ్‌సైన్స్ అనుబంధ సబ్జెక్టులతో ఏదైనా డిగ్రీ.వెబ్‌సైట్: www.avccollege.net3. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎన్విరాన్‌మెంట్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్, పుణె.కోర్సు: ఎంఎస్సీ వైల్డ్‌లైఫ్ కన్జర్వేషన్ యాక్షన్.అర్హత: ప్యూర్ లేదా లైఫ్ సెన్సైస్‌లో బ్యాచిలర్ డిగ్రీ, బీటెక్ (ఏ బ్రాంచ్ అయినా) ఉత్తీర్ణులు అర్హులు. వైల్డ్‌లైఫ్ కన్జర్వేషన్‌లో కనీసం మూడేళ్ల పని అనుభవం ఉన్న ఇతర డిగ్రీ అభ్యర్థులు సైతం దరఖాస్తు చేసుకోవచ్చు.వెబ్‌సైట్: https://ieer.bharatividyapeeth.edu4. గవర్న్‌మెంట్ ఆర్ట్స్ కాలేజ్, ఉదగమండలం, తమిళనాడుకోర్సు: ఎంఎస్సీ వైల్డ్‌లైఫ్.అర్హత: బీఎస్సీ ఇన్ లైఫ్‌సెన్సెస్.వెబ్‌సైట్: www.govtartscollegeooty.org.in5. వైల్డ్‌లైఫ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా-డెహ్రాడూన్.కోర్సు: ఎంఎస్సీ వైల్డ్‌లైఫ్ సైన్స్.అర్హత: డిగ్రీ.వెబ్‌సైట్: www.wii.gov.inకెరీర్: భారత్ సమృద్ధి జీవవైవిధ్యానికి నిలయం. అయితే ఆర్థిక లక్ష్యాలను చేరుకునే క్రమంలో దేశంలో…

Read More

బజాజ్ పల్సర్ 125 స్ప్లిట్ సీటు

ప్రముఖ ద్విచక్రవాహన సంస్థ బజాజ్ తన పల్సర్ 125 స్ప్లిట్ సీటు వేరియంట్ బైక్ ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఎక్స్ షోరూంలో ఈ సరికొత్త మోటార్ సైకిల్ ధర వచ్చేసి రూ.79,091లుగా సంస్థ నిర్దేశించింది. పల్సర్ బైక్ అంటే కుర్రకారులో ఎంతో క్రేజ్. బజాజ్ సంస్థ పల్సర్ మోడల్ ను లాంచ్ చేసినప్పటి నుంచి ఎప్పటికప్పుడు యువత ఎంతో ఆసక్తి కనపరుస్తున్నారు. ఇటీవలే ఈ సంస్థ పల్సర్ లైనప్ లో 125 సీసీ మోడల్ ను భారత మార్కెట్లో విడుదల చేసింది. తాజాగా ఈ మోడల్లో స్ప్లిట్ సీటు వేరియంట్ ను లాంచ్ చేసింది. ఈ సరికొత్త బజాజ్ పల్సర్ 125 స్ప్లిట్ సీటు వేరియంట్ ధర వచ్చేసి ఎక్స్ షోరూంలో రూ.79,901లుగా సంస్థ నిర్దేశించింది. ఈ లైనప్ లో భారత మార్కెట్లోకి వచ్చిన…

Read More

ఎకనామిక్స్‌లో ఉన్నత విద్యా కోర్సులు, కెరీర్ అవకాశాలు

ప్రపంచీకరణ, ఎల్లలు లేని వాణిజ్యం కారణంగా బ్యాచిలర్ ఆఫ్ ఎకనామిక్స్ (బీఏ) పూర్తిచేసిన వారికి జాబ్ మార్కెట్లో అవకాశాలు విస్తృతమవుతున్నాయి. వాస్తవానికి బీఏ ఎకనామిక్స్ విద్యార్థులు మూడేళ్లు/నాలుగేళ్ల (ఆనర్స్) బ్యాచిలర్ కోర్సులో భాగంగా ఎకనామిక్స్‌తోపాటు హిస్టరీ, పాలిటీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ తదితర సబ్జెక్టుల నుంచి ఏవైనా రెండు సబ్జెక్టులను ఎంచుకొని చదవాల్సి ఉంటుంది. బీఏ ఎకనామిక్స్ తర్వాత పోస్టుగ్రాడ్యుయేషన్ చేయడం ద్వారా ఉన్నత అవకాశాలను అందిపుచ్చుకోవచ్చు.ఉన్నత విద్య: ఎంఏ ఎకనామిక్స్ ఎంఏ అప్లైడ్ ఎకనామిక్స్ ఎంఎస్ క్వాంటిటేటివ్ ఎకనామిక్స్ మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ తదితర కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఉద్యోగావకాశాలు:బీఏ ఎకనామిక్స్ తర్వాత ఎక్కువ మంది విద్యార్థులు బ్యాంకింగ్, ఇన్సూరెన్స్ రంగంలో ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తారు. దీంతోపాటు యూపీఎస్సీ నిర్వహించే సివిల్స్, రాష్ట్రాల స్థాయిలోని పబ్లిక్ సర్వీస్ కమిషన్‌లు జరిపే గ్రూప్స్ పరీక్షలకు హాజరయ్యేందుకు…

Read More