బోధనావకాశాలు..
- టీచింగ్‌పై ఆసక్తి ఉన్న బీఏ గ్రాడ్యుయేట్లు బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (బీఈడీ) వైపు అడుగులు వేయొచ్చు. బీఈడీ అనంతరం డీఎస్సీలో ప్రతిభతో ఉపాధ్యాయ వృత్తిలోకి ప్రవేశించొచ్చు. ప్రస్తుతం ఉపాధ్యాయులకు వేతనాలు బాగానే ఉన్నాయి.
- ఎంఏ (హిస్టరీ) పూర్తిచేసిన అభ్యర్థులు యూజీసీ.. నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ (నెట్), స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ (సెట్)లో అర్హత సాధించడం ద్వారా లెక్చరర్ కొలువులను అందుకోవచ్చు. నెట్‌లో ప్రతిభకనబరిచిన వారికి జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ (జేఆర్‌ఎఫ్) లభిస్తుంది.
ఉన్నత విద్య :ఉన్నత విద్యకు సంబంధించి సైన్స్ గ్రాడ్యుయేట్లకు ఉన్నన్ని స్పెషలైజేషన్లు బీఏ హిస్టరీ విద్యార్థులకు ఉండవనే అభిప్రాయం చాలామందిలో ఉంది. ఇది నిజం కాదు. హిస్టరీ ఆప్షనల్‌గా డిగ్రీ పూర్తి చేసిన వారికి ఉన్నత విద్య దిశగా భిన్న రకాల కోర్సులు అందుబాటులో ఉన్నాయి. వీటిని పూర్తిచేయడం ద్వారా ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో అవకాశాలను అందుకోవచ్చు. ఉదాహరణకు ఎంఏ మ్యూజియాలజీని తీసుకుంటే.. దీన్ని హిస్టరీ గ్రాడ్యుయేట్లకు అందుబాటులో ఉన్న చక్కటి కోర్సుగా చెప్పొచ్చు. ఈ కోర్సులో మ్యూజియంల చరిత్ర, డాక్యుమెంటేషన్, ప్రజెంటేషన్, ఇంటెర్‌ప్రిటేషన్, మ్యూజియం ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్; కంప్యూటర్ అప్లికేషన్స్ ఇన్ మ్యూజియం తదితరాలను అధ్యయనం చేస్తారు.
జాబ్ ప్రొఫైల్స్: ఎగ్జిబిషన్ కన్సల్టెంట్, డిప్యూటీ క్యూరేటర్, టీచర్ అండ్ లెక్చరర్, మ్యూజియం గైడ్, ఇంటీరియర్ ఆర్ట్స్ డిజైనర్, కన్జర్వేటర్
ఎంఏ ఆర్కియాలజీ:
వైవిధ్య భరిత కెరీర్‌ను కోరుకునే వారికి ఎంఏ ఆర్కియాలజీ చక్కటి ఎంపిక. ఈ కోర్సులో ఆర్కియాలజీకి సంబంధించిన ప్రాథమిక పద్ధతులు, ఇండియన్ ఆర్కిటెక్చర్, రీసెర్చ్ మెథడాలజీ, ఎర్లీ ఇండియన్ ఆర్ట్ వంటి అంశాల గురించి నేర్చుకుంటారు. ఎంఏ ఆర్కియాలజీ చేస్తే ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్‌ఐ), దాని అనుబంధ విభాగాల్లో అవకాశాలను అందుకోవచ్చు.
జాబ్ ప్రొఫైల్స్: హెరిటేజ్ మేనేజర్, లెక్చరర్ అండ్ టీచర్, హెరిటేజ్ కన్జర్వేటర్, ఆర్కై విస్ట్, గైడ్, డాక్యుమెంటేషన్ స్పెషలిస్ట్, ఇన్ఫ ర్మేషన్ మేనేజర్, హిస్టారియన్, లైబ్రరీ సిస్టమ్స్ అనలిస్ట్.
పోటీలో విజయానికి చరిత్ర !కేంద్ర, రాష్ట్ర స్థాయిలో నిర్వహించే ఏ పోటీ పరీక్ష అయినా.. హిస్టరీ లేకుండా ప్రశ్నపత్రం ఉండదు. దీన్నిబట్టి పోటీ పరీక్షల్లో హిస్టరీ ప్రాధాన్యమేంటో అర్థంచేసుకోవచ్చు. దేశంలో అత్యున్నత సర్వీసులైన ఐఏఎస్, ఐపీఎస్ వంటి సర్వీసులను అందిపుచ్చుకునేందుకు వీలుకల్పించే సివిల్స్‌లో చరిత్ర కీలకపాత్ర పోషిస్తోంది. సివిల్స్ ప్రిలిమ్స్‌లో కీలకమైన జనరల్ స్టడీస్ పేపర్ కోసం హిస్టరీని ప్రత్యేక దృష్టితో చదవాల్సి ఉంటుంది. సివిల్స్ మెయిన్స్‌లో జనరల్ స్టడీస్ పేపర్-1 కోసం ఇండియన్ హెరిటేజ్ అండ్ కల్చర్, ఇండియన్ హిస్టరీ గురించి అధ్యయనం చేయాల్సి ఉంటుంది. రాష్ర్ట స్థాయిలో పబ్లిక్ సర్వీస్ కమిషన్లు నిర్వహించే గ్రూప్-1, గ్రూప్-2 తదితర పరీక్షల్లోనూ హిస్టరీ కీలకంగా నిలుస్తుంది. కేవలం సివిల్స్, గ్రూప్స్ వంటి పరీక్షలే కాకుండా ఎస్‌ఎస్‌సీ, రైల్వే తదితర పరీక్షల్లోనూ హిస్టరీకి ప్రాధాన్యం లభిస్తోంది.
చరిత్రతో ఉన్నత అవకాశాలు..హిస్టరీ.. మానవ సామాజిక, సాంస్కృతిక, ఆర్థిక, భాషా పరిణామ క్రమాన్ని తెలియజేస్తుంది. చరిత్రను విస్మరిస్తే మానవజాతి గతాన్ని కోల్పోయినట్లే! ప్రస్తుతం ఆర్కియాలజీ, మ్యూజియాలజీ, లింగ్విస్టిక్స్ వంటి స్పెషలైజేషన్లు ఉపాధి కల్పనలో ముందుంటున్నాయి. వీటిని పూర్తిచేసిన వారికి కెరీర్ పరంగా మంచి అవకాశాలు లభిస్తున్నాయి. పోటీ పరీక్షల విషయానికొస్తే హిస్టరీ లేనిదే ప్రశ్నపత్రమే ఉండదని చెప్పొచ్చు. సివిల్స్ విజేతల్లో హిస్టరీ ఆప్షనల్‌ను ఎంచుకున్నవారు ఎక్కువగా ఉంటున్నారు. దీన్నిబట్టి సరైన ప్రణాళికతో హిస్టరీని చదవడం ద్వారా విద్యార్థులు ఉన్నతస్థాయికి చేరుకోవచ్చు. |
You must log in to post a comment.