మెషీన్ లెర్నింగ్

అల్గారిథమ్స్, స్టాటిస్టికల్ మోడళ్ల శాస్త్రీయ అధ్యయనమే మెషీన్ లెర్నింగ్ (ఎంఎల్). దీన్ని కృత్రిమ మేధ (ఏఐ)కు ఉప విభాగంగా చెప్పొచ్చు. ప్రతిదానికీ ప్రోగ్రామింగ్ చేయాల్సిన అవసరంలేకుండా.. కంప్యూటర్లు అంతకుముందు నిక్షిప్తమైన డేటా ఆధారంగా వాటంతటవే నిర్ణయాలు తీసుకునేలా చేయడమే మెషీన్ లెర్నింగ్. డేటాసైన్స్, డేటా మేనేజ్‌మెంట్, డేటా అనలిటిక్స్ సమ్మిళితంగా మెిషీన్ లెర్నింగ్ కార్యకలాపాలు ఉంటాయి.

  • నైపుణ్యాలు: మెషీన్ లెర్నింగ్ కెరీర్ దిశగా వెళ్లాలనుకునేవారు కంప్యూటర్ బేసిక్స్, ప్రోగ్రామింగ్ స్కిల్స్, కంప్యూటర్ హార్డ్‌వేర్ నైపుణ్యాలు పెంపొందించుకోవాలి. మ్యాథమెటికల్ స్కిల్స్, కంప్యుటేషనల్ స్కిల్స్, డేటా మోడలింగ్, సాఫ్ట్‌వేర్ డిజైన్, డెవలప్‌మెంట్ తదితర అంశాల బేసిక్స్‌పై పట్టుసాధిస్తే మెషీన్ లెర్నింగ్ అల్గారిథమ్స్, కోడింగ్, ప్రోగ్రామింగ్ పరంగా మరింత మెరుగ్గా రాణించే అవకాశం ఉంటుంది.
    ఎంఎల్ ఔత్సాహికులు పైథాన్, జావా, స్కాలా, సీ++, జావాస్క్రిప్ట్ నైపుణ్యాలపైనా దృష్టిసారించాల్సి ఉంటుంది.
  • కోర్సులు: ఐబీఎం, సిస్కో, అమెజాన్, ఇంటెల్, మైక్రోసాఫ్ట్ వంటి ప్రముఖ సంస్థలు మెిషీన్ లెర్నింగ్‌లో సర్టిఫికేషన్ కోర్సులు అందిస్తున్నాయి. మెషీన్ లెర్నింగ్‌కు పెరుగుతున్న ప్రాధాన్యాన్ని దృష్టిలో పెట్టుకుని.. ఇప్పుడు పలు ప్రముఖ ఇన్‌స్టిట్యూట్‌లు ఎంటెక్ స్థాయిలో ఏఐ/ఎంఎల్ స్పెషలైజేషన్ కోర్సులను అందుబాటులో ఉంచుతున్నాయి. బీటెక్ సీఎస్‌ఈ/ఐటీ ఉత్తీర్ణులు ఈ కోర్సులకు అర్హులు.


జాబ్ ప్రొఫైల్స్:

  • మెషీన్ లెర్నింగ్ ఇంజనీర్.
  • డేటా ఆర్కిటెక్ట్.
  • డేటా సైంటిస్ట్.
  • డేటా మైనింగ్ స్పెషలిస్ట్.
  • క్లౌడ్ ఆర్కిటెక్ట్.
  • సైబర్ సెక్యూరిటీ అనలిస్ట్ తదితర.
%d bloggers like this:
Available for Amazon Prime