
ఐరాసలో భారత్‌కు తాత్కాలిక సభ్యదేశ హోదా
184 ఓట్లను గెలుచుకున్న భారత్
2021 జనవరి 1 నుండి రెండేళ్లపాటు
ఐక్యరాజ్యసమితి (ఐరాస) భద్రతా మండలి తాత్కాలిక సభ్యత్వపు ఎన్నికల్లో భారత్ విజయం సాధించింది. బుధవారం జరిగిన ఎన్నికల్లో ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి (యుఎన్‌ఎస్‌సి)లో భారత్‌కు మరోసారి తాత్కాలిక సభ్యదేశ హోదా లభించింది. దీంతో రెండేళ్లపాటు (2021–22) భారత్ కొనసాగనుంది. ఐరాసలో సభ్యదేశంగా భారత్ ఎంపిక కావడం ఇది ఎనిమిదోసారి. 55 మంది సభ్యులున్న ఆసియా–పసిఫిక్ గ్రూప్ నుంచి కేవలం భారత్ ఒక్కటే పోటీ చేసింది. ఈ ఎన్నికల్లో ఐర్లాండ్, మెక్సికో, నార్వే కూడా భద్రతా మండలి ఎన్నికల్లో విజయం సాధించగా, కెనడా ఓటమిపాలైంది.
You must log in to post a comment.