హెచ్సీయూ ఎంఎస్సీ
ఇంటర్ బైపీసీ అర్హతతో హెచ్సీయూ అందించే ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీ కోర్సులో చేరొచ్చు. బైపీసీ విద్యార్థులకు ఫిజిక్స్, కెమికల్ సైన్సెస్, సిస్టమ్స్ బయాలజీ, ఆప్టోమెట్రీ అండ్ విజన్ సైన్సెస్ స్పెషలైజేషన్స్ అందుబాటులో ఉన్నాయి. ఔత్సాహికులు నోటిఫికేషన్ను అనుసరించి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు రాత పరీక్ష, ఇంటర్వ్యూలు నిర్వహించి ప్రవేశాలను ఖరారు చేస్తారు. వీటితోపాటు హెచ్సీయూ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయోకెమిస్ట్రీ, ప్లాంట్ బయాలజీ అండ్ బయోటెక్నాలజీ, బయోటెక్నాలజీ, మాలిక్యులర్ బయాలజీ, యానిమల్ బయోటెక్నాలజీ, హెల్త్ సైకాలజీ స్పెషలైజేషన్స్తో ఎంఎస్సీ కోర్సును ఆఫర్చేస్తోంది. ఈ కోర్సులో ప్రవేశానికి సదరు సబ్జెక్టులో గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత తప్పనిసరి.
You must log in to post a comment.