వివాహం

మానవ జీవితంలో అతి ముఖ్యమైన ఘట్టం వివాహం.
రెండు హృదయాలు ఒక్కటై చివరి వరకు సాగే ప్రయాణం.
ఇది ప్రేమ వివాహమైనా కావచ్చు, పెద్దలు నిర్ణయించిన సంబంధమైనా కావచ్చు, మూడు ముళ్ళు తో ఏకమై, ఏడడుగులతో ప్రయాణం మొదలుపెట్టి, నూరేళ్లపంటను పండించే అందమైన ప్రయాణము.
తల్లిదండ్రి కానీ, తోడబుట్టిన కానీ, స్నేహితులు కానీ
కొంతవరకే సాగేది. చివరివరకు తోడుగా నీ వెంట ఉండేది
భార్య/భర్త మాత్రమే.
నిజంగా ఇదొక అద్భుత ప్రయాణం. ఎక్కడో పుట్టినటువంటి అమ్మాయి పెళ్లి అనే పేరుతో పుట్టింటి నుండి అత్తవారింటికి వచ్చి, మొదట్లో ఎవరు ఎలాంటి వారు తెలుసుకుని, పెంచిన వాళ్ల తల్లిదండ్రులను వదిలివేసి, కొత్త ఇంటిలో ఆమె చేసే అష్టావధానం నిజంగా భగవంతుడి యొక్క ప్రసాదం.
సంతానం కలిగిన తర్వాత వారి కోసమే జీవితమంతా ధారపోయడం ఆ మాతృమూర్తికే చెందుతుంది. కోపతాపాలు ఇంటిలో ఈసడింపులు భరిస్తూ వివాహవ్యవస్థను గౌరవిస్తూ ముందుకు సాగే ధన్యముర్తి భార్య.

ఇక్కడ ఒక నిజం చెప్పదలుచుకున్నా. భార్య భర్తలలో
భర్త ముందుగా పోయిన బతకగలదు. ఒకవేళ  భార్య చనిపోతే భర్త యొక్క బతుకు నరక ప్రాయమే.
వారి బాధలు వర్ణనాతీతం. సకాలానికి భర్తకు అందించే స్త్రీ
భర్తను చిన్నపిల్లవాడిలా చూసుకొనే భార్య దూరమైతే,
ఆ భర్త బ్రతికి ఉన్నా సచ్చిన వాడితోనే సమానం..
అందుకే భాగస్వామి లేకపోతే బతుకు భారమే.

భార్య భర్తల అనుబంధం నమ్మకం మీద ఆధారపడి సాగుతుంది. బండికి రెండు చక్రాలు ఎంత ముఖ్యమో కుటుంబానికి వారు అంతే ముఖ్యం. చక్రాలను బ్యాలెన్స్ చేసేది ఇరుసు అంటే ఇక్కడ ఒకరి మీద ఒకరికి నమ్మకం ఉండాలి. తప్పులు ఇద్దరూ కలిసి సరిదిద్దుకోవాలి. చిన్న చిన్న తప్పులను చిలికి గాలివాన చెయ్యకుండా. ఒకరికొకరు క్షమించుకుంటూ ముందుకు సాగిపోతే, ఆ సంసారమే స్వర్గంతో సమానం. సంసారం నిస్సారంగా అయిందా అది నరకంతో సమానం.

భారతీయవివాహవ్యవస్థను చూసి ప్రపంచదేశాలన్నీ మెచ్చుకుంటుంటే గర్వపడుతున్నాను. వివాహమనే ఒప్పందంపై కలకాలం కలిసి జీవించే, మహోత్సవ కార్యక్రమం వివాహమని, ఎన్ని ఒడుదొడుకులు వచ్చినా చివరి ప్రయాణం సాగించేది ఒక భారతీయవివాహవ్యవస్థలోనే ఉన్నదని మనందరికీ తెలిసిన విషయమే.
%d bloggers like this:
Available for Amazon Prime