బీకామ్ (కంప్యూటర్స్)

డిగ్రీలో బీకామ్ (కంప్యూటర్స్) చదివాను. తర్వాత ఎంబీఏ ఫైనాన్స్ చేయాలనుకుంటున్నాను. నాకు ఎలాంటి అవకాశాలు అందుబాటులో ఉన్నాయో తెలపండి?

 ఏ వ్యాపారానికైనా  ఫైనాన్స్ విభాగం జీవనాడి లాంటిది. ఎంబీఏ ఫైనాన్స్ పూర్తి చేసిన వారికి కార్పొరేట్ రంగంలో ఉద్యోగాలకు కొదవలేదు. ఫైనాన్స్‌ను కెరీర్‌గా ఎంచుకోవాలనుకునేవారు అకౌంటింగ్, ఫైనాన్స్, టాక్సేషన్లతోపాటు కాలానుగుణంగా స్టాటిస్టిక్స్, ఎకనోమెట్రిక్స్లో నైపుణ్యాలు పెంపొందించుకోవాలి. చాలామంది ఫైనాన్స్‌ను అకౌంటింగ్, టాక్సేషన్కు సంబంధించిన ఒక అంశంగానే భావిస్తారు. కానీ వాస్తవానికి ఫైనాన్స్ పరిధి చాలా విస్తృతమైనది.

 ప్రస్తుత పరిస్థితుల్లో ఫైనాన్స్ రంగంలో స్థిరపడాలంటే.. ఫైనాన్స్‌కు సంబంధించిన కొత్త సాఫ్ట్వేర్, ప్రోగ్రామింగ్ పద్ధతులను కూడా నేర్చుకోవాలి. ఇటీవల కాలంలో క్రేజీగా నిలుస్తున్న ఫిన్‌టెక్(ఫైనాన్షియల్ టెక్నాలజీ)పై అవగాహన పెంచుకోవాలి. అప్పుడే విభిన్న నైపుణ్యాలతో మంచి సంస్థలో కెరీర్ ప్రారంభించడానికి సాధ్యమవుతుంది.

 కొన్ని ప్రత్యేకమైన రంగాల్లో ప్రవేశించాలంటే…అదనపు సర్టిఫికేట్ కోర్సులనూ అభ్యసించాల్సి ఉంటుంది. ఉదాహరణకు క్యాపిటల్ మార్కెట్స్‌లో చేరాలనుకునేవారు సెబీకి చెందిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సెక్యూరిటీస్ మార్కెట్ అందించే ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్, డెరివేటివ్స్ అండ్ సెక్యూరిటీస్ ఆపరేషన్స్, రిస్క్‌మేనేజ్‌మెంట్ తదితర సర్టిఫికెట్ కోర్సుల్లో అర్హత సాధించాల్సి ఉంటుంది.
%d bloggers like this:
Available for Amazon Prime