ఫిక్స్‌డ్ డిపాజిట్ ( F.D.I)

SBI vs పోస్టాఫీస్.. రూ.లక్ష పెడితే చేతికి రూ.2 లక్షలు!

పోస్టాఫీస్‌లో డబ్బులు పెడితే ఎక్కువ లాభం వస్తుందా? లేదంటే ఎస్‌బీఐలో డబ్బులు డిపాజిట్ చేస్తే ఎక్కువ రాబడి వస్తుందా? ఎందులో మీరు ఇన్వెస్ట్ చేస్తే ఎక్కువ లాభం వస్తుందో తెలుసుకోండి.

sbi vs post office
డబ్బులు సంపాదించాలని యోచిస్తున్నారా? చేతిలోని డబ్బులు ఎక్కడైనా డిపాజిట్ చేసి అదిరిపోయే రాబడి సొంతం చేసుకోవాలని భావిస్తున్నారా? అయితే మీకు చాలా ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడని వారు బ్యాంకుల్లో లేదంటే పోస్టాఫీస్‌లో డబ్బులు డిపాజిట్ చేసుకోవచ్చు. రిస్క్ లేకుండా రాబడి పొందొచ్చు.

అయితే బ్యాంకులు, పోస్టాఫీసుల్లో చాలా స్కీమ్స్ అందుబాటులో ఉన్నాయి. స్కీమ్ ప్రాతిపదికన వడ్డీ రేట్లు మరతాయి. అలాగే మీకు వచ్చే రాబడి కూడా మారుతుంది. అందువల్ల ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాలి.

దేశీ అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) కూడా ఫిక్స్‌డ్ డిపాజిట్ (ఎఫ్‌డీ) స్కీమ్స్ అందిస్తోంది. ఐదేళ్లకు పైన కాల పరిమితి గల ఎఫ్‌డీల్లో ఇన్వెస్ట్ చేస్తే పన్ను మినహాయింపు కూడా పొందొచ్చు. పోస్టాఫీస్ కూడా టైమ్ డిపాజిట్ స్కీమ్స్‌ను అందిస్తోంది. వీటిల్లో కూడా పన్ను మినహాయింపు ఉంటుంది.

ఎస్‌బీఐ ఐదేళ్ల ఎఫ్‌డీ స్కీమ్, పోస్టాఫీస్ ఐదేళ్ల టైమ్ డిపాజిట్ విషయానికి వస్తే.. వీటి మధ్య వడ్డీ రేటు వ్యత్యాసం 1.3 శాతంగా ఉంది. ఎస్‌బీఐ 5.4 శాతం వడ్డీ అందిస్తే.. పోస్టాఫీస్ 6.7 శాతం వడ్డీ రేటును ఆఫర్ చేస్తోంది. పోస్టాఫీస్ టైమ్ డిపాజిట్లను మెచ్యూరిటీ తర్వాత కూడా పొడిగించుకునే సౌకర్యం ఉంది. ఎఫ్‌డీలకు కూడా ఇది వర్తిస్తుంది. 

పదేళ్ల కాల పరిమితితో స్టేట్ బ్యాంక్‌లో రూ.లక్ష పెడితే మెచ్యూరిటీ సమయంలో మీరు రూ.1.64 లక్షలు తీసుకోవచ్చు. అంటే మీకు వడ్డీ రూపంలో రూ.64 వేల రాబడి లభిస్తుంది. ఎస్‌బీఐలో కాకుండా పోస్టాఫీస్‌లో రూ.లక్ష ఇన్వెస్ట్ చేస్తే.. అప్పుడు మీకు మెచ్యూరిటీ సమయంలో రూ.2 లక్షలు లభిస్తాయి. అంటే మీ డబ్బు రెట్టింపు అయ్యిందని చెప్పుకోవచ్చు. ఎస్‌బీఐ కన్నా దాదాపు రూ.36,000 ఎక్కువ రాబడి వస్తోంది.
%d bloggers like this:
Available for Amazon Prime