ప్రొబేషనరీ ఆఫీసర్(పీవో)

ఎస్బీఐ పీవో

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) దేశవ్యాప్తంగా ఉన్న బ్రాంచుల్లో ప్రొబేషనరీ ఆఫీసర్(పీవో) కొలువుల భర్తీకి క్రమం తప్పకుండా నోటిఫికేషన్లు విడుదల చేస్తోంది. ఏదైనా విభాగంలో డిగ్రీ పూర్తి చేసిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. వయసు 21 ఏళ్ల నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ వర్గాలకు వయో సడలింపు లభిస్తుంది. మూడు దశల్లో జరిగే పీవో ఎంపిక ప్రక్రియలో.. ప్రిలిమ్స్, మెయిన్, గ్రూప్ ఎక్సర్సైజ్ అండ్ పర్సనల్ ఇంటర్వ్యూలు ఉంటాయి. ప్రిలిమ్స్ను 100 మార్కులకు నిర్వహిస్తారు. పరీక్ష వ్యవధి గంట. ప్రశ్నపత్రంలో ఇంగ్లిష్ లాంగ్వేజ్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, రీజనింగ్ ఎబిలిటీ విభాగాలు ఉంటాయి. సెక్షనల్ టైమింగ్ ఉంటుంది. మెయిన్ పరీక్ష ఆబ్జెక్టివ్, డిస్క్రిప్టివ్ విధానంలో 250 మార్కులకు జరుగుతుంది. ఆబ్జెక్టివ్ పరీక్షలో రీజనింగ్ అండ్ కంప్యూటర్ ఆప్టిట్యూడ్, డేటా అనాలసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్, జనరల్ అవేర్నెస్, ఇంగ్లిష్ లాంగ్వేజ్ ఉంటాయి. పరీక్ష కాల వ్యవధి మూడు గంటలు. సెక్షనల్ టైమింగ్ ఉంటుంది. డిస్క్రిప్టివ్ పరీక్ష 50 మార్కులకు జరుగుతుంది. ఇందులో అభ్యర్థి ఇంగ్లిష్ నైపుణ్యాలను(లెటర్ రైటింగ్, ఎస్సే) పరీక్షించే విధంగా రెండు  ప్రశ్నలు అడుగుతారు. పరీక్ష వ్యవధి 30 నిమిషాలు. గ్రూప్ ఎక్సర్సైజ్(జీఈ) అండ్ ఇంటర్వ్యూ(పీఐ)కు 50 మార్కులు ఉంటాయి. ఇందులో జీఈకి 20 మార్కులు, ఇంటర్వ్యూకి 30 మార్కులు కేటాయించారు. ప్రతి దశలోనూ నిర్ణీత కటాఫ్ మార్కులు పొందిన వారే తర్వాత దశకు ఎంపికవుతారు. మూడు దశలను విజయవంతంగా పూర్తి చేసుకున్న వారిని పీవోలుగా నియమిస్తారు. రెండేళ్ల ప్రొబేషనరీ సర్వీస్ అనంతరం సర్వీస్ను కన్ఫర్మ్ చేస్తారు. పీవోలుగా ఎంపికైన వారికి రూ.8 లక్షల నుంచి రూ.13 లక్షల వరకూ  వార్షిక వేతనం లభిస్తుంది.
 
%d bloggers like this:
Available for Amazon Prime