దేశంలో ప్రభుత్వ రంగ బ్యాంకులకు దీటుగా ప్రైవేటు బ్యాంకులు విస్తరిస్తున్నాయి. విస్తృత ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నాయి. ప్రైవేటు బ్యాంకుల్లో ఎంట్రీ లెవల్లో విభిన్న హోదాలతో ఖాళీలు ఉంటున్నాయి. ఈ పోస్టుల్లోకి నియామకాల కోసం సొంతంగా ప్రకటనలివ్వడంతోపాటు ప్లేస్‌మెంట్స్ ద్వారా తమకు సరిపడే అభ్యర్థులను బ్యాంకులు నియమించుకుంటున్నాయి. రాత పరీక్షలు, ఇంటర్వ్యూలు నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేసుకుంటున్నాయి.
కొన్ని బ్యాంకులు ప్రైవేటు విద్యాసంస్థలతో ఒప్పందం కుదుర్చుకొని.. బ్యాంకింగ్ కార్యకలాపాలపై పీజీ డిప్లొమా కోర్సులు అందిస్తున్నాయి. ముఖ్యంగా ప్రొబేషనరీ ఆఫీసర్ స్థాయి పోస్ట్‌ల భర్తీకి ఈ కోర్సులను నిర్వహిస్తున్నాయి. ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదేని విభాగంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వారు ఈ ప్రోగ్రామ్‌కు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. ఈ కోర్సుకు ఎంపిక అవ్వాలంటే.. ఆన్‌లై¯Œ పరీక్షల్లో అర్హత సాధించి.. గ్రూప్ డిస్కషన్స్, ఇంటర్వ్యూల్లో విజయం సాధించాల్సి ఉంటుంది. విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకున్న తర్వాతే ఉద్యోగులుగా నియమించుకుంటారు. ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, యాక్సిస్, కోటక్ మహీంద్ర తదితర బ్యాంకులు పీజీ డిప్లొమా ప్రోగ్రామ్ ద్వారా శిక్షణ అందించేలా చూస్తున్నాయి. ఏడాది కాలవ్యవధి ఉన్న ఈ రెసిడెన్షియల్ ప్రోగ్రామ్‌లో క్లాస్‌రూం ట్రైనింగ్‌తోపాటు ఆయా బ్యాంకులో ఇంటర్న్‌షిప్, ఆన్ ద జాబ్ ట్రైనింగ్ ద్వారా శిక్షణ ఇస్తారు.
కెరీర్ అవకాశాలు..
బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగంలో క్లర్క్, పీవో కొలువులతోపాటు టెక్నాలజీ ఆధారిత ఉద్యోగాలు లభిస్తున్నాయి. సాఫ్ట్ స్కిల్స్, ఇంటర్ పర్సనల్ నైపుణ్యాలు, మల్టీ కల్చరల్ స్కిల్స్, ఇంగ్లిష్ స్పీకింగ్, టీమ్ లీడింగ్, స్ట్రెస్ మేనేజ్‌మెంట్, డెసిషన్ మేకింగ్ నైపుణ్యాలున్నవారు ప్రైవేటు బ్యాంకింగ్ రంగంలో సులభంగా రాణించగలుగుతారు. విధి నిర్వహణ పరంగా చురుగ్గా వ్యవహరిస్తూ, మంచి ప్రతిభ చూపితే వేగంగా ఉన్నత స్థానాలకు చేరుకోవచ్చు.

You must log in to post a comment.