పులిహోర

మన దక్షిణ భారత దేశం లో దీనిని విరివిగా తయారు చేసుకుంటారు. అలానే ఆంధ్ర లో ఏమైనా పండుగలు వచ్చినా లేదా ఏదైనా మంచి పుణ్య కార్యాలు చేసిన దీనిని తయారు చేసుకుంటారు. అంతే కాదు దేవాలయాల్లో కూడా పులిహోర ని చేసి ప్రసాదంగా భక్తులకి ఇస్తారు.

ఒకవేళ అన్నం మిగిలిపోయిన సరే పులిహోర చేసుకోవచ్చు ఇలా చేసినా రుచిగానే ఉంటుంది. పులిహోరా లోని పులిని “పుల్లని రుచి” గా అనువదించవచ్చు ఎందుకు అంటే చింతపండు ఫ్రథాన పదార్ధం కనుక మరియు చింతపండు కొలెస్ట్రాల్ తగ్గించే ప్రభావాన్ని కలిగి ఉన్న ఫైబర్ కారణంగా గుండెకు మంచిది. ఇది మధుమేహ వ్యాధిగ్రస్తులకు కూడా మంచిది. ఇలా ఇక్కడ పులిహోర ఎలా తయారు చేసుకోవాలో చూసేయండి…

పులిహోర కు కావలసిన పదార్థాలు :

ముందుగా ఉడికించి పెట్టుకొన్న అన్నం
పసుపు
ఉప్పు
చింతపండు
పచ్చిమిర్చి
అల్లం
ఇంగువ
ఎండుమిరపకాయలు
మినపప్పు
సెనగపప్పు
వేరు శనగ పలుకులు
ఆవాలు
కరివేపాకు
నూనె

తయారు చేసుకునే విధానం :

ముందుగా చింతపండు పులుసు తీసుకుని పక్కన పెట్టుకోవాలి . ఇప్పుడు పోపుకు సిద్ధం చేసుకోవాలి, ఒక కడాయిలో నూనె వేసి అందులో మినప్పప్పు, శనగపప్పు , ఆవాలు, వేరు శనగ పలుకులు, ఎండుమిర్చి ,పచ్చిమిర్చి, అల్లం, కొంచెం ఇంగువ, మరియు కరివేపాకు వేసి బాగా వేగనివ్వాలి. ఈ మిశ్రమాన్ని కూడా పక్కన పెట్టుకోవాలి. తరువాత ముందుగా ఉడికించి పెట్టిన అన్నం తీసుకుని దానిలో చింతపండు పులుసు వేసుకుని బాగా కలపాలి. దీనిలో కొంచెం పసుపు మరియు తగినంత ఉప్పు వేసుకుని మరొకసారి కలుపుకోవాలి. ఈ మిశ్రమం పసుపు రంగు లో మారిన తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న పోపు మిశ్రమాన్ని వేసుకుని ఇంకా బాగా కలపాలి. అంతే ఎంతో రుచికరమైన పులిహోర తయ్యార్. ఒక వేళ చింతపండు రుచి ఇష్టపడని వారు ఉంటే చింతపండు కి బదులుగా నిమ్మకాయ రసం లేదా మామిడి కాయ గుజ్జు వాడవచ్చు. వీటికి కూడా పుల్లటి రుచి ఉంది కనుక పులిహోర రుచికరంగా ఉంటుంది.
పులిహోర చిట్కాలు:

ఎప్పుడైతే అన్నం విడివిడిగా ఉంటుందో అప్పుడే పులిహోర చాలా రుచికరంగా మరియు చూడటానికి ఎంతో చక్కగా వస్తుంది . అలా రావాలంటే అన్నం ఉడికించేటప్పుడు కొంచెం వెనిగర్ వేస్తే అన్నం పొడి పొడిగా వస్తుంది దాంతో పులిహోర కూడా చక్కగా ఉంటుంది.
బియ్యం ఉడికిన తరువాత ఒక ప్లేట్‌ లో సమానంగా విస్తరించండి. బాగా చల్లబడితే అన్నం మెత్తగా ఉండదు. పోపు బాగా వేగితే పులిహోర బాగా రుచిగా ఉంటుంది.

అన్నం లో పసుపు, ఉప్పు వేసే ముందు కొంచెం తగినంత నూనె వేసుకుంటే అన్నం ముద్దగా అవ్వకుండా విడివిడిగా ఉంటుంది. నువ్వులు రుచి ఇష్టపడే వారు పసుపు తో పాటు నువ్వుల పొడి వేస్తే మరింత రుచికరంగా ఉంటుంది.
%d bloggers like this:
Available for Amazon Prime