ప్రస్తుత ప్రపంచంలో వంట కేవలం సంప్రదాయ వంటగదికే పరిమితం కాకుండా.. ఎంతో మంది ఔత్సాహిక యువతకు కెరీర్‌గా మారుతోంది. ఆధునికత, సృజనాత్మకత జోడించి రుచికరంగా, కళాత్మకంగా చేసిన వంటకాలతో భోజన ప్రియులను మొప్పించడంలోనే చెఫ్ నైపుణ్యాలు దాగి ఉంటాయి. పెరుగుతున్న మార్కెట్ డిమాండ్‌కు అనుగుణంగా సమర్థులైన ప్రొఫెషనల్ చెఫ్‌ల అవసరాలను తీర్చేందుకు ఫుడ్ ప్రాసెసింగ్, క్యాటరింగ్ టెక్నాలజీ తదితర సంబంధిత రంగాల్లో పలు విద్యాసంస్థలు అనేక రకాల కోర్సులను ఆఫర్ చేస్తున్నాయి. వివిధ రకాల ఆహార పదార్థాల తయారీ, వంట పద్ధతులపై ఆసక్తి ఉన్నవారు చెఫ్ కోర్సులను ఎంచుకోవచ్చు. కలినరీ(పాకశాస్త్ర) లేదా చెఫ్ కోర్సుల్లో పోషకాహారం, ఆయా వంటకాల తయారీ పద్ధతులతో పాటు ఇతర నిర్వహణ అంశాలపై నా శిక్షణ ఇస్తారు. దేశంలోని హోటల్ మేనేజ్‌మెంట్ విద్యా సంస్థ లు బ్యాచిలర్ స్థాయిలో కలినరీ కోర్సులను, టూరిజం అండ్ హాస్పి టాలిటీ మేనేజ్‌మెంట్, హాస్పిటా లిటీ అండ్ హోటల్ అడ్మినిస్ట్రేషన్ కోర్సులను అందిస్తున్నారు. హాస్పిటా లిటీ, హోటల్ మేనేజ్‌మెంట్ రంగంలో పెరుగుతున్న మానవ వనరుల అవసరాన్ని గుర్తించిన పలు ఇన్‌స్టిట్యూట్‌లు.. ఇంటర్మీడియెట్ అర్హతగా పీజీ, యూజీ, డిప్లొమా, సర్టిఫికెట్, కోర్సులను సైతం అందిస్తున్నాయి.
కోర్సులను అందించే ప్రముఖ ఇన్‌స్టిట్యూట్స్
కోర్సులను అందించే ప్రముఖ ఇన్‌స్టిట్యూట్స్
- కేంద్ర పర్యాటక శాఖ పరిధిలోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్‌మెంట్ క్యాటరింగ్ టెక్నాల జీ అండ్ అప్లయిడ్ న్యూట్రిషన్-హైదరాబాద్: హాస్పిటాలిటీ అండ్ హోటల్ అడ్మినిస్ట్రేషన్‌లో బీఎస్సీ ప్రోగ్రామ్‌తోపాటు ఫుడ్ ప్రొడక్షన్‌లో స్వల్పకాలిక కోర్సులు కూడా అందిస్తోంది. బీఎస్సీ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి జాతీయ స్థాయిలో నిర్వహించే నేషనల్ కౌన్సిల్ ఫర్ హోటల్ మేనేజ్‌మెంట్ అండ్ క్యాటరింగ్ టెక్నాలజీ జాయింట్ ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్ (ఎన్‌సీహెచ్‌ఎం జేఈఈ)లో ఉత్తీర్ణత సాధించాలి. అర్హత: ఇంటర్మీడియెట్.
- వెబ్‌సైట్: http://www.ihmhyd.org/
- ఎన్‌ఐటీహెచ్‌ఎం: హైదరాబాద్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్.. టూరిజం అండ్ హాస్పి టాలిటీ ఎంబీఏ, బీబీఏ; అలాగే బీఎస్సీ హాస్పి టాలిటీ అండ్ హోటల్ అడ్మినిస్ట్రేషన్ కోర్సు లను అందిస్తోంది. బీఎస్సీ, బీబీఏ కోర్సులకు 10+2 అర్హత; ఎంబీఏ కోర్సుకు డిగ్రీ ఉత్తీర్ణులైన వారు దరఖాస్తు చేసుకోవచ్చు.
- వెబ్‌సైట్: http://www.nithm.ac.in
- స్టేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్‌మెంట్ క్యాటరింగ్ టెక్నాలజీ అండ్ అప్లయిడ్ న్యూట్రిషన్, తిరుపతి: ఎన్‌సీహెచ్‌ఎం జేఈఈ ద్వారా బీఎస్సీ ఇన్ హాస్పిటాలిటీ అండ్ హోటల్ అడ్మినిస్ట్రేషన్ కోర్సును ఆఫర్ చేస్తోంది. దీంతోపాటు ఫుడ్ ప్రొడక్షన్‌లో స్వల్పకాలిక కోర్సులు కూడా అందిస్తోంది. వెబ్‌సైట్: http://www.sihmtpt.org
- అలాగే కేంద్ర టూరిజం మంత్రిత్వ శాఖ పరిధిలోని ఇండియన్ కలినరీ ఇన్‌స్టిట్యూట్ కలినరీ ఆర్ట్స్ (పాకశాస్త్రం)లో ఎంబీ ఏ, బీబీఏల తోపాటు డిప్లొమా ఇన్ ఫుడ్ ప్రొడక్షన్, డిప్లొ మా ఇన్ ఎఫ్ అండ్ బీ సర్వీస్, డిప్లొమా ఇన్ బేకరీ అండ్ కన్‌ఫెక్షరీ, క్రాఫ్ట్ కోర్సు ఇన్ ఫుడ్ ప్రొడక్షన్, క్రాఫ్ట్ ఇన్ ఎఫ్ అండ్ బీ సర్వీస్‌లను అందిస్తోంది. వెబ్‌సైట్: http://www.ici.nic.in
కెరీర్ అవకాశాలు:
కలినరీ కోర్సులు పూర్తి చేసిన తర్వాత ఏదైనా హోటల్‌లో జూనియర్ చెఫ్‌గా అవకాశాలు పొందొ చ్చు. ప్రారంభ దశలో ఎక్కువ పనిగంటలు, తక్కువ వేతనాలు ఉన్నప్పటికీ సవాలుగా స్వీకరించాలి. చెఫ్ కెరీర్‌లో విజయం సాధించా లంటే.. ముఖ్యంగా చేసే పనిని అమితంగా ప్రేమించగల గాలి. నైపుణ్యాలను మెరుగుపరచుకోవాలి. పెద్ద పెద్ద హోటళ్లలో కిచెన్ విభాగంలో అసిస్టెంట్ చెఫ్, చెఫ్, చీఫ్ చెఫ్స్ వంటి కొలువులు కీలకం. వీరికి ప్రారంభంలోనే నెలకు రూ.40వేల నుంచి రూ.50వేల వరకు వేతనం లభిస్తుంది. చెఫ్‌గా కెరీర్‌లో పేస్ట్రీ చెఫ్, సాస్ చెఫ్, ఫిష్ చెఫ్, వెజిటబుల్ చెఫ్, మీట్ చెఫ్, ప్యాంట్రీ చెఫ్, ఫ్రై చెఫ్, గ్రిల్ చెఫ్ తదితర స్పెషలైజేన్లు అందుబాటులో ఉన్నాయి.
You must log in to post a comment.