నిమ్మ పండు

నిమ్మతో ఆరోగ్యం

నిమ్మ కాయలు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో తెలిసిందే. వాటిని ఆహారంలో కలుపుకున్నా.. రసం తీసుకుని తాగినా ఆరోగ్యానికి ఎంతో మంచిది. నిమ్మలో విటమిన్-C‌, కాల్షియం, ఫాస్ఫరస్, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. ఉదయాన్నే గోరు వెచ్చని నీటిలో నిమ్మరసం, తేనె కలిపి తాగితే బరువు తగ్గుతారు. వేసవిలో వేడి నుంచి ఉపశమనం పొందేందుకు నిమ్మరసం ఎనర్జీ డ్రింక్‌లా పనిచేస్తుంది. అయితే, నిమ్మకాయలను ఆహారంగా తీసుకోవడం వల్లే కాదు. ఇంట్లో ఉంచుకున్నా సరే ఆరోగ్యానికి మంచిదే.  కరోనా వైరస్ నేపథ్యంలో ఎక్కువ మంది నిమ్మను రోజువారీ ఆహారంతో తీసుకుంటున్నారు. నిమ్మతో రోగ నిరోధక శక్తి పెరుగుతుందని, రోజూ దీన్ని తీసుకోవడం ఆరోగ్యానికి మంచిదని ఆహర నిపుణులు చెబుతున్నారు.

మన పూర్వికులు గుమ్మానికి నిమ్మ కాయలు కట్టేవారు. ఇప్పటికీ కొన్ని దుకాణాలు, వాణిజ్య కేంద్రాల్లో నిమ్మకాయలను కడతారు. కొందరు నీటిలో నిమ్మకాయ, పసుపు వేసి అలంకరణగా పెడతారు. వాటిని మనం దిష్టి నిమ్మకాయలని భావిస్తాం. అయితే, దీని వెనుక ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి. అవేంటో తెలిస్తే మీరు కూడా ఆశ్చర్యపోతారు.

❂ నిమ్మ రసం రక్తంలో కొవ్వు నియంత్రిస్తూ రక్తనాళాల్లో పూడికలు ఏర్పడకుండా కాపాడుతుంది.
❂ నిమ్మ రసంలో తేనె కలుపుకుని తాగితే అజీర్ణం, పైత్యం తగ్గుతాయి. కాలేయం శుభ్రమవుతుంది.
❂ నోటి పూతకు నిమ్మ మంచి ఔషదం.
❂ నిమ్మ రసంలోని సిట్రిక్‌ యాసిడ్‌ కడుపులోని చెడు క్రిములను నాశనం చేస్తుంది.
❂ బాగా నీరసంగా ఉన్నప్పుడు కొబ్బరినీటిలో నిమ్మరసం పిండుకొని తాగడం వల్ల తక్షణ శక్తి కలుగుతుంది.
❂ మంచి పోషక పదార్ధాలతోపాటు నిమ్మరసం తీసుకుంటే మహిళల్లో గర్భస్రావాలు ఉండవు.
❂ జలుబు తగ్గాలంటే నిమ్మ షర్బత్ తాగండి.
❂ జీర్ణక్రియ వ్యాధులైన మలబద్ధకం, అజీర్ణం లాంటి వాటిని తగ్గించటంలో నిమ్మరసం సహాయపడుతుంది.
❂ గజ్జి, తామర, చుండ్రు, మొటిమలు, కుష్టు మొదలైన చర్మవ్యాధులతో బాధపడేవారు నిమ్మరసాన్ని రోజుకు రెండు లేదా మూడుసార్లు తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

నిద్రపోయే ముందు నిమ్మకాయలను ముక్కులుగా కోసి బెడ్ రూమ్‌లో పెడితే గాలి శుభ్రమవుతుంది.

❂ నిమ్మకాయలను రూమ్‌లో పెడితే ప్రత్యేకంగా రూమ్ ప్రెషర్ అవసరం ఉండదు. నిమ్మ వాసనతో గది పరిమళ భరింతం అవుతుంది.

❂ నిమ్మకాయ ముక్కలను బెడ్రూంలో పెట్టుకుని నిద్రిస్తే శ్వాస చక్కగా తీసుకోగలుగుతారు.

❂ ఊపిరి తీసుకోడానికి ఇబ్బందిగా ఉన్నట్లయితే తప్పకుండా నిమ్మ ముక్కలను గదిలో పెట్టుకుని నిద్రించండి.

❂ నిమ్మ వాసన డిప్రెషన్‌ను తొలగిస్తుంది.

❂ నిమ్మ వాసన వల్ల యాంగ్జైటీ దూరమై మీలో పాజిటీవ్ ఫీలింగ్స్ కలుగుతాయి.

❂ నిమ్మ వాసన వల్ల ఊపిరితిత్తుల పనితీరు మెరుగవుతుంది.

❂ నిమ్మ వాసన ఒత్తిడిని సైతం దూరం చేస్తుంది.

❂ ఆస్తమా, అలర్జీలు, జలుబు తదితర సమస్యలతో బాధపడుతున్నవారు నిమ్మ ముక్కలను బెడ్ రూమ్‌లో పెట్టుకుని నిద్రిస్తే మంచిది.

❂ ఇంట్లో దోమలు ఎక్కువగా ఉంటే నిమ్మకాయను కట్ చేసి లవంగాలను గుచ్చి పెట్టండి. దెబ్బకు దోమలు పారిపోతాయ్.

❂ ప్రయాణాల్లో నిమ్మకాయ వాసన చూడటం వల్ల కడుపులో తిప్పడం, వికారం తగ్గుతుంది. కాబట్టి.. అది ఇంట్లో ఉంటే ఆ సమస్యలే దరిచేరవు.

❂ నిమ్మ వల్ల మూత్రంలో సిట్రేట్‌ స్థాయి పెరుగుతుంది. దీనివల్ల మూత్ర పిండాల్లో రాళ్లు ఏర్పడవు.
❂ చిన్న పిల్లల్లో వచ్చే టాన్సిలైటిస్‌ సమస్యకు చెంచాడు నిమ్మరసం, చిటికెడు సైంధవ లవణం వేసి తాగిస్తే ఫలితం కనిపిస్తుంది.
❂ నిమ్మరసంలో చిటికెడు ఉప్పు, వంటసోడా కలిపి దంతాల మీద రుద్దితే దుర్వాసన పోతుంది.
❂ గోరువెచ్చని నీటిలో నిమ్మరసం కలిపి తాగితే అజీర్తి నుంచి ఉపశమనం లభిస్తుంది.
❂ శరీరంలో వాపు, కణాలు దెబ్బతినడానికి కారణమయ్యే కణాలను విటమిన్‌-C నిర్వీర్యం చేస్తుంది.
❂ రోజూ ఆహారంలోగానీ, విడిగాగానీ నిమ్మరసాన్ని తప్పనిసరిగా వాడాలి. దీనివల్ల వ్యాధులు దరిచేరవు.
❂ జ్వరంగా ఉన్నప్పుడు నిమ్మరసం తాగితే కాస్త ఉపశమనం ఉంటుంది.
❂ దగ్గు మందుల్లో కఫాన్ని తగ్గించడానికి కూడా నిమ్మరసం కలుపుతారు.

❂ నిమ్మ ఆకుల రసానికి తేనె కలిపి ఇస్తే కడుపులో నూలి పురుగులు తగ్గుముఖం పడతాయి.
❂ గుండెల్లో మంట, డయేరియా, బద్ధకం నివారణకు నిమ్మరసం మంచి ఔషధం
❂ కొవ్వు తగ్గించడంలో నిమ్మ కీలక పాత్ర పోషిస్తుంది.
❂ బ్యాక్టీరియా వల్ల కలిగే దుర్వాసనను నిర్మూలించే లాలాజలాన్ని నిమ్మరసం ఉత్పత్తి చేస్తుంది.
❂ రోజూ పరగడుపున ఒక గ్లాసుడు గోరువెచ్చని నీళ్ళలో కొద్దిగా నిమ్మకాయ రసం, కొంచెం ఉప్పు కలిపి తాగితే ఊబకాయం తగ్గుతుంది.
❂ నిమ్మరసాన్ని తేనెతో కలిపి తీసుకుంటే జీర్ణశక్తి బాగుంటుంది. ఒంట్లో కొవ్వు శాతం తగ్గుతుంది.
❂ కొంచెం ఉప్పు, నిమ్మరసం, కొద్దిగా పసుపు కలిపి వారానికి రెండుసార్లయినా బ్రష్ చేస్తే దంతాలు మెరుస్తాయి.
❂ ప్రయాణాలలో వాంతులతో బాధపడేవారు నిమ్మకాయ వాసన చూడడం లేదా నిమ్మ చెక్కను చప్పరించినా చక్కని ఉపశమనం కలుగుతుంది.

నిమ్మ వల్ల కలిగే మరికొన్ని ప్రయోజనాలు:

✺ నిమ్మ కాయలను ఆహారంతో తీసుకుంటే వృద్ధాప్య చాయలు కనిపించవు.

✺ నిమ్మరసాన్ని జుట్టుకు పట్టించడం వల్ల చుండ్రు సమస్యను అరికట్టవచ్చు.

✺ నిమ్మరసం రక్తాన్ని శుద్ధి చేసి, అందులోని రోగ కారక క్రిములను నశింపజేస్తుంది.

✺ రోజూ నిమ్మరసం తీసుకోవడం వల్ల కలరా, మలేరియా వంటి వ్యాధులు దరిచేరవు.

✺ ముఖం మీద ఏర్పడే నల్లటి మచ్చలను తగ్గించడంలోనూ నిమ్మ ఉపయోగపడుతుంది.

✺ రోజుకో గ్లాస్ నిమ్మ రసం తాగితే వల్ల ఆర్థరైటీస్, జీర్ణ సంబంధ సమస్యల నుంచి బయటపడవచ్చు.

ఉదయాన్నే వేడి నిమ్మకాయ నీరు

1. జీర్ణ ప్రయోజనాలు: మనం తినే ఆహారo ఆహార పైపు గుండా వెళుతుంది. మంచి రాత్రి నిద్ర తర్వాత ఆహార పైపు లో ఆహారం యొక్క అవశేషాలు ఉండవచ్చు, మరియు వెచ్చని లెమన్/నిమ్మ నీరు త్రాగటం ఆహార పైపును శుభ్రంగా చేస్తుంది. వెచ్చని నీరు నూనెను తొలగించడంలో కూడా సహాయపడుతుంది,

2. రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది: నిమ్మకాయలోని విటమిన్-సి మరియు పొటాషియం రోగనిరోధక శక్తిని పెంచును.  వాటిని ఖాళీ కడుపుతో తీసుకోవటం వలన శోషణ మంచిది మరియు శరీరం పూర్తి ప్రయోజనాన్ని పొందుతుంది.

3. బరువు తగ్గించే సహాయం: ఉత్తమ బరువు తగ్గించే సహాయాలలో ఒకటిగా, వెచ్చని లెమన్/నిమ్మ  నీరు జీవక్రియను పెంచుతుంది మరియు శరీరాన్ని కొవ్వును దహించడానికి అనుమతిస్తుంది, తద్వారా బరువు నియంత్రణకు సహాయపడుతుంది. ఖచ్చితంగా బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

4. మెరుస్తున్న చర్మం: కొల్లాజెన్ ఏర్పడటానికి నిమ్మ కాయ/లైం లో ఉండే విటమిన్-సి అవసరం, అది చర్మాన్ని ఆరోగ్యంగా మరియు ప్రకాశవంతంగా ఉంచడంలో సహాయపడుతుంది. అలాగే, చర్మ సంరక్షణ అవసరాలలో హైడ్రేషన్ ఒకటి, మరియు ఉదయాన్నే వెచ్చని లైం /నిమ్మ నీరు త్రాగటం వల్ల టాక్సిన్స్ బయటకు వెళ్లి చర్మం మెరుస్తూ మరియు స్పష్టంగా ఉంటుంది.

5. పరిశుబ్ర కాలేయం: కాలేయం జీవక్రియకు కేంద్రం మరియు ఉదయం వెచ్చని లెమన్/నిమ్మ నీరు త్రాగటం కాలేయాన్ని శుభ్రంగా ఉంచడానికి సహాయపడుతుంది. కాలేయం రాత్రిపూట చురుకుగా ఉంటుంది మరియు ఉదయం వెచ్చని లెమన్/నిమ్మ నీరు త్రాగటం దాని శక్తిని పునరుద్ధరించడానికి సహాయపడుతుంది. ఇది శరీరంలో శోషరస మరియు పిత్త ప్రవాహాన్ని పెంచుతుంది.

6. గాయాలను త్వరగా మాన్పుతుంది.: గాయాలు అయినవారికి, నిమ్మకాయలో ఉండే విటమిన్-సి కొల్లాజెన్ ఉత్పత్తికి సహాయపడుతుంది మరియు గాయం నయం చేయడంలో సహాయపడుతుంది. ఇది మృదులాస్థి మరియు ఎముకలతో సహా బంధన కణజాల నిర్మాణాన్ని మెరుగుపరుస్తుంది.

7. మూడ్ పెంచేది: నిమ్మరసం యొక్క వాసన మీ మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది ఇది ఆందోళన మరియు నిరాశను కూడా తగ్గిస్తుంది.

8. పిహెచ్ బ్యాలెన్స్: లైం/నిమ్మ కాయ లోని ఆస్కార్బిక్ మరియు సిట్రిక్ ఆమ్లం సులభంగా జీర్ణమవుతాయి మరియు ఫలితం ఆల్కలీన్ వాతావరణం. శరీర పిహెచ్ ఆమ్లంగా ఉన్నప్పుడు శరీర వ్యాధులు సంభవిస్తాయి. పర్యావరణాన్ని ఆల్కలీన్‌గా ఉంచడం ద్వారా, లైం/నిమ్మ నీరు శరీర అనారోగ్యానికి మొత్తం అవకాశాన్ని తగ్గిస్తుంది.

ఒక రోజులో ఎంత నిమ్మకాయ తినడం మంచిది?

నిమ్మ‌కాయ‌ల‌ను తిన‌డం, వాటి జ్యూస్ ను తాగ‌డం చేస్తే మ‌న‌కు విట‌మిన్ సి ఎక్కువ‌గా అందుతుంది. విట‌మిన్ సి వ‌ల్ల శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. నిత్యం మ‌నం 90 మిల్లీగ్రాముల వ‌ర‌కు విట‌మిన్ సి తీసుకోవ‌చ్చు. విట‌మిన్ సి లోపం ఉన్న‌వారు అయితే గ‌రిష్టంగా 2000 మిల్లీగ్రాముల వ‌ర‌కు విట‌మిన్ సి తీసుకోవ‌చ్చు. అంత‌కు మించితే దంతాల‌పై ఉండే ఎనామిల్ క్షీణిస్తుంది. అలాగే విరేచ‌నాలు వ‌స్తాయి. ఇత‌ర అనారోగ్య స‌మ‌స్య‌లు క‌లుగుతాయి.

ఒక సాధార‌ణ నిమ్మ‌కాయ ద్వారా మ‌నకు దాదాపుగా 30 మిల్లీగ్రాముల వ‌ర‌కు విట‌మిన్ సి ల‌భిస్తుంది. అంటే రోజుకు 3 నిమ్మ‌కాల‌ను తినొచ్చు. అంత‌కు మించ‌కూడ‌దు. అదే విట‌మిన్ సి లోపం ఉన్న‌వారు 66 వ‌ర‌కు నిమ్మ‌కాయ‌ల‌ను తినొచ్చు. కానీ ఎవ‌రైనా అన్ని నిమ్మ‌కాయ‌ల‌ను తిన‌లేరు. క‌నుక స‌గ‌టున ఒక వ్య‌క్తి రోజుకు 3 నిమ్మకాయ‌ల‌ను తిన‌డం ఆరోగ్య‌క‌రం. విటమిన్ సి లోపం ఉంటే కేవ‌లం నిమ్మ‌కాయ‌లు మాత్ర‌మే కాకుండా ఇత‌ర విట‌మిన్ సి ఉండే ఆహారాల‌ను తీసుకోవాలి.

%d bloggers like this: