భారత్, చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణల్లో కల్నల్ సంతోశ్ బాబు వీరమరణం పొందారు. ఆయనది తెలంగాణలోని సూర్యాపేట జిల్లా. అత్యంత ధైర్యవంతుడు, ప్రతిభావంతుడైన సంతోశ్ గురించి ఆయన తల్లిదండ్రులు కీలక వివరాలు తెలిపారు.

అమ్మా త్వరలో హైదరాబాద్ వచ్చేస్తా..

‘అమ్మా.. హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అయిందిగా, ఇంకో నెల రోజుల్లో వచ్చేస్తా’ అని తన కుమారుడు చెప్పాడని సంతోశ్ బాబు తల్లి తెలిపారు. చివరిసారిగా ఆదివారం (జూన్ 14) తనతో ఫోన్లో మాట్లాడినట్లు ఆమె తెలిపారు. తన కుమారుడు ఇప్పటికే హైదరాబాద్ రావాల్సి ఉన్నా.. కరోనా లాక్డౌన్ వల్ల ఆలస్యమైందని, అక్కడికి రావాల్సిన బలగాలు ఇంకా చేరుకోకపోవడం వల్ల అక్కడే ఉండిపోయాడని ఆమె తెలిపారు. సంతోశ్ మరణవార్తతో ఆయన అత్తగారు కుప్పకూలిపోయారు. ఆమెను తరలించారు. సంతోశ్ సతీమణి తన పిల్లలతో ఢిల్లీలో ఉన్నారు. సంతోశ్ బాబు భార్య పేరు సంతోషి. వీరికి కుమార్తె అభిజ్ఞ (9), కుమారుడు అనిరుధ్ (4) ఉన్నారు.
నా కలను కొడుకు రూపంలో చూసుకున్నా..

దేశం కోసం సైనికుడిగా పనిచేయాలని తనకు బలంగా ఉండేదని సంతోశ్ బాబు తండ్రి తెలిపారు. కొన్ని కారణాల వల్ల తాను ఆ అవకాశం పొందలేకపోయానని వివరించారు. బ్యాంక్ మేనేజర్‌గా పనిచేసి రిటైర్డ్ అయిన ఆయన సూర్యాపేటలో నివాసం ఉంటున్నారు. ‘సైన్యంలో పనిచేయాలనేది నా కల. నా కలను కొడుకు రూపంలో చూసుకున్నాను. అతడిని ముందు నుంచే ఆ లైన్లో తయారు చేశాను. కోరుకుండ సైనిక్ స్కూల్లో చదివించాను. అతడి కోసం నేను 800 కి.మీ. ట్రాన్స్ఫర్ చేయించుకొని అక్కడికి వెళ్లాను’ అని ఆయన చెప్పారు.
రాళ్ల దెబ్బలు.. నిలువెల్లా గాయాలతో..

భారత్-చైనా సరిహద్దు ఘర్షణల్లో అమరుడైన కల్నల్ సంతోష్ కుమార్ భార్య సంతోషికి ప్రభుత్వం గ్రూప్-1 స్థాయి ఉద్యోగం, ఇంటి స్థలం, రూ.5 కోట్ల నగదు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ మేరకు సోమవారం ముఖ్యమంత్రి కేసీఆర్ సూర్యాపేట వెళ్లి ఉత్తర్వులను ఆమెకు అందజేశారు. గ్రూప్-1 ఉద్యోగంలో భాగంగా సంతోష్ బాబు భార్య సంతోషి ఇకపై కమర్షియల్ టాక్స్ ఆఫీసర్ కనిపించనున్నారు. దీనికి సంబంధించి సంతోషిని ఆ ఉద్యోగంలో నియమిస్తూ సీఎస్ సోమేశ్ కుమార్ సోమవారం రాత్రి ఉత్తర్వులు జారీచేశారు. ఆమె నియామకాన్ని ప్రత్యేక కేసుగా పరిగణిస్తున్నట్లు అందులో పేర్కొన్నారు.
హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 14లో కల్నల్ సంతోష్‌బాబు సతీమణి సంతోషి పేరు మీద 711 గజాల స్థలం ఇస్తున్నట్లు ఉత్తర్వులు విడుదల చేసిన సంగతి తెలిసిందే. సంతోషికి రూ.4 కోట్ల చెక్కును, తల్లిదండ్రులకు రూ.కోటి చెక్కును ముఖ్యమంత్రి కేసీఆర్ అందించిన సంగతి తెలిసిందే.