రుచికరమైన సాయంత్రం స్నాక్స్‌

బఠాణీ చాట్‌ కావలసినవి
తెల్ల బఠాణీ – ఒక కప్పు; పసుపు – పావు టీ స్పూను + పావు టీ స్పూను; ఉప్పు – తగినంత; నూనె – ఒక టీ స్పూను + 2 టేబుల్‌ స్పూన్లు; ఉల్లి పేస్ట్‌ – రెండు టేబుల్‌ స్పూన్లు; అల్లం వెల్లుల్లి ముద్ద – ఒక టీ స్పూను; టొమాటో పేస్ట్‌ – పావు కప్పు; మిరప కారం – ఒక టీ స్పూను; ధనియాల పొడి – ఒక టీ స్పూను; జీలకర్ర పొడి – ఒక టీ స్పూను; కొత్తిమీర తరుగు – ఒక టీ స్పూను; చాట్‌ మసాలా – ఒక టీ స్పూను; నిమ్మ రసం– ఒక టీ స్పూను; కార్న్‌ ఫ్లేక్స్‌ – తగినన్ని

తయారీ:
►బఠాణీలను ముందు రోజు రాత్రి నానబెట్టాలి
►మరుసటి రోజు ఉదయం, కుకర్‌లో బఠాణీలు, పసుపు, ఉప్పు, తగినన్ని నీళ్లు, ఒక టీ స్పూను నూనె జత చేసి స్టౌ మీద ఉంచి సన్న మంట మీద ఉంచి మూడు విజిల్స్‌ వచ్చాక దింపేయాలి
►చల్లారాక సగం బఠాణీలను మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్‌ చేయాలి
►స్టౌ మీద బాణలిలో రెండు టేబుల్‌ స్పూన్ల నూనె వేసి కాగాక, ఉల్లి ముద్ద వేసి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించాలి
►అల్లం వెల్లుల్లి పేస్ట్‌ జత చేసి వేయించాలి
►టొమాటో ముద్ద జత చేసి కొద్దిసేపు వేయించాక, బఠాణీ పేస్ట్, ఉడికించిన బఠాణీలు జత చేయాలి
►కొద్దిగా ఉప్పు జత చేయాలి
►మిరప కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, చాట్‌ మసాలా జత చేసి కలపాలి
►తగినన్ని నీళ్లు జత చేసి కొద్దిసేపు ఉడికించి దింపి, ఒక పాత్రలోకి తీసుకోవాలి
►ఉల్లి తరుగు, కొత్తిమీర తరుగు, టొమాటో తరుగులతో అలంకరించి, కొద్దిగా నిమ్మ రసం, కార్న్‌ఫ్లేక్స్‌తో అలంకరించి, అందించాలి.
భేల్‌ పూరీ కావలసినవి
స్వీట్‌ చట్నీ – రుచికి తగినంత; గ్రీన్‌ చట్నీ – రుచికి తగినంత; క్యారట్‌ తురుము – ఒక టేబుల్‌ స్పూను; కీర తురుము – ఒక టేబుల్‌ స్పూను; కొత్తిమీర – ఒక టేబుల్‌ స్పూను; టొమాటో తరుగు – పావు కప్పు; ఉల్లి తరుగు – పావు కప్పు; ఉడికించిన బంగాళ దుంప తురుము – ఒక టేబుల్‌ స్పూను; బూందీ – 2 టేబుల్‌ స్పూన్లు; సేవ్‌ – 2 టేబుల్‌ స్పూన్లు; అటుకులు – తగినన్ని
చాట్‌ మసాలా – చిటికెడు; మిరప కారం – కొద్దిగా; మరమరాలు – పావు కేజీ

తయారీ:
►ఒక పాత్రలో మరమరాలు వేసి, వాటికి మిగిలిన పదార్థాలన్నీ (స్వీట్‌ టామరిండ్‌ చట్నీ, గ్రీన్‌ చట్నీ కాకుండా) జత చేసి బాగా కలపాలి
►స్వీట్‌ టామరిండ్‌ చట్నీ, గ్రీన్‌ చట్నీ జత చేయాలి
►ప్లేటులోకి తీసుకుని, పైన స్వీట్‌ చట్నీ, గ్రీన్‌ చట్నీలను కొద్దికొద్దిగా వేసి, ఆ పైన కొత్తిమీర తరుగు, ఉల్లి తరుగు జత చేసి అందించాలి.
సమోసా చాట్‌ కావలసినవి
చెన్నా మసాలా – ఒక టీ స్పూను; ధనియాల పొడి – ఒక టీ స్పూను; జీలకర్ర పొడి – ఒక టీ స్పూను; ఉప్పు – తగినంత; టొమాటో తరుగు – పావు కప్పు; బటర్‌ – ఒక టేబుల్‌ స్పూను; ఉల్లి తరుగు – పావు కప్పు; చాట్‌మసాలా – ఒక టీ స్పూను; మిరప కారం – ఒక టీ స్పూను; సమోసాలు – 2; పెద్ద సెనగలు (కాబూలీ చెన్నా) – ఒక కప్పు; నీళ్లు – తగినన్ని; పెరుగు – ఒక కప్పు; గ్రీన్‌ చట్నీ – కొద్దిగా; స్వీట్‌ చట్నీ – కొద్దిగా; కొత్తిమీర – ఒక కట్ట

తయారీ:
►పెద్ద సెనగలను ముందు రోజు రాత్రి నానబెట్టాలి
►మరుసటి రోజు నీళ్లు ఒంపేసి, శుభ్రంగా కడిగి, కుకర్‌లో సెనగలకు తగినన్ని నీళ్లు జత చేసి, స్టౌ మీద ఉంచి నాలుగు విజిల్స్‌ వచ్చాక దింపేయాలి
►బాణలిలో బటర్‌ వేసి వేడి చేయాలి
►ఉడికించిన పెద్ద సెనగలు, టొమాటో తరుగు, ఉల్లి తరుగు, ఉప్పు, మిరప కారం, జీలకర్ర పొడి, ధనియాల పొడి, చాట్‌ మసాలా వేసి కొద్దిసేపు వేయించాలి
►తగినన్ని నీళ్లు పోసి ఉడికించాలి.
►సమోసాలను ముక్కలుగా చేసి, ఉడికించిన చాట్‌లో వేసి కలపాలి
►పెరుగు, స్వీట్‌ చట్నీ, గ్రీన్‌ చట్నీ వేసి, ఒకసారి కలిపి దింపేసి, కొద్దిగా కొత్తిమీరతో అలంకరించి, వేడి వేడి సమోసా చాట్‌ అందించాలి.
దహీ పూరీ కావలసినవి
ఉడికించిన బంగాళ దుంపలు – 3 (మీడియం సైజువి); ఉల్లి తరుగు – పావు కప్పు; టొమాటో తరుగు – పావు కప్పు; కొత్తిమీర తరుగు – కొద్దిగా; పెరుగు – ఒక కప్పు; గ్రీన్‌ చట్నీ – అర కప్పు; స్వీట్‌ చట్నీ – అర కప్పు; ఎండు మిర్చి + వెల్లుల్లి చట్నీ  – అర కప్పు; పూరీలు (గోల్‌గప్పాలు) – 30; సన్న సేవ్‌ (నైలాన్‌ సేవ్‌) – తగినంత; మిరప కారం – తగినంత; చాట్‌ మసాలా – తగినంత; వేయించిన జీలకర్ర పొడి – తగినంత; నల్ల ఉప్పు లేదా రాళ్ల ఉప్పు – తగినంత

తయారీ:
►ముందుగా చట్నీలు తయారు చేసి పక్కన ఉంచాలి
►బంగాళ దుంపలను ఉడికించి, చల్లారబెట్టి, మెత్తగా చిదమాలి
►ఒక ప్లేట్‌లో గోల్‌గప్పాలను ఉంచి, మధ్య భాగంలో చిన్నగా చిదమాలి
►బంగాళ దుంప ముద్దను స్టఫ్‌ చేయాలి ∙ఉల్లి తరుగు, టొమాటో తరుగును పైన ఉంచాలి
►కొద్దిగా చాట్‌ మసాలా, జీలకర్ర పొడి, మిరప కారం, ఉప్పు… ఒకదాని తరవాత ఒకటి కొద్దికొద్దిగా చల్లాలి
►గ్రీన్‌ చట్నీ, స్వీట్‌ చట్నీలు కొద్దికొద్దిగా వేయాలి
►పైన పెరుగు వేయాలి
►ఆ పైన మళ్లీ చాట్‌ మసాలా, జీలకర్ర పొడి, మిరపకారం, ఉప్పు చల్లాలి
►తగినంత సేవ్‌ వేసి, చివరగా కొత్తిమీరతో అలంకరించి అందించాలి.
గ్రీన్‌ చట్నీ కావలసినవి
కొత్తిమీర ఆకులు – 2 కప్పులు; పుదీనా ఆకులు – ఒక కప్పు; జీలకర్ర – ఒక టీ స్పూను; పచ్చి మిర్చి – 4; వెల్లుల్లి రెబ్బలు – 2; అల్లం – చిన్న ముక్క; నిమ్మ రసం – ఒకటిన్నర టేబుల్‌ స్పూన్లు; ఉప్పు – తగినంత

తయారీ:
►కొత్తిమీర, పుదీనా ఆకులను శుభ్రంగా కడగాలి
►మిక్సీలో అన్ని పదార్థాలను వేసి మెత్తగా ముద్దలా చేయాలి
►గాలిచొరని జాడీలో నిల్వ ఉంచుకోవాలి
►ఫ్రిజ్‌లో ఉంచి, కావలసినప్పుడు ఉపయోగించుకోవచ్చు.
స్వీట్‌ చట్నీ కావలసినవి
ఖర్జూరాలు – 10 (గింజలు లేనివి); బెల్లం తురుము – అర కప్పు; చింతపండు గుజ్జు – 2 టేబుల్‌ స్పూన్లు మిరప కారం – అర టీ స్పూను; జీలకర్ర పొడి – అర టీ స్పూను; ఉప్పు – తగినంత; నీళ్లు – తగినన్ని
తయారీ:
►ఒకపాత్రలో బెల్లం పొడి, పావు కప్పు వేడి నీళ్లు పోసి కలియబెట్టాలి
►చింతపండు గుజ్జు, ఖర్జూరాల గుజ్జు జత చేసి, స్టౌ మీద ఉంచి ఉడికించాలి
►ఉప్పు, జీలకర్ర పొడి, మిరపకారం జత చేసి కలియబెట్టి కొద్దిసేపు ఉడికించి దింపేయాలి
►గాలి చొరని సీసాలోకి తీసుకుని, నిల్వ చేసుకోవాలి.

మసాలా వడ

మసాలా వడ

మసాలా వడలు చాల ప్రసిద్ధమైన, రుచికరమైన స్నాక్ ని దసరా లాంటి సంతోషకరమైన పండగల కాలంలో వీటిని చేసుకుంటారు.మసాలా వడలను తయారు చేయటానికి సెనగ పప్పు, ఇతర మసాలాలు కలిపి వాడతారు. సాధారణంగా ఈ వడలను కర్ణాటక లో ఏదైనా పండుగ సందర్భాలలో తయారు చేస్తారు.కరకరలాడే వడలను శనగపప్పు తో పాటుగా మరికొన్ని పప్పుదినుసులు, సుగంధ ద్రవ్య మసాలాలు వాడటం వలన ఇవి వడలకి నోరూరించే రుచిని అందిస్తాయి . మరి ఈ దసరా కి ఇంకెందుకు ఆలస్యం ?మీరు ఈ రుచికరమైన రెసిపీ ని ఎలా తయారు చేసుకోవాలో చుడండి.


ప్రధాన పదార్థం

 • 1 కప్ రాత్రంతానానబెట్టినవి సెనగ పప్పు

ప్రధాన వంటకానికి

 • 1 చేతి నిండా కోయబడినవి కొత్తిమీర,  అవసరాన్ని బట్టి పసుపు
 • అవసరాన్ని బట్టి కోయబడినవి కరివేపాకు
 • అవసరాన్ని బట్టి కోయబడినవి పుదీనా ఆకులు
 • అవసరాన్ని బట్టి కోయబడినవి ఆకుపచ్చని పచ్చిమిరప కాయలు
 • 1 inch తురిమిన అల్లం.  అవసరాన్ని బట్టి ఉప్పు
 • Step 1:
  మిక్సీ లోకి నానపెట్టుకున్నసెనగ పప్పు మరియు పచ్చి మిరపకాయలు వేసుకొని కచ్చాపచ్చాగా పేస్ట్ తయారు చేసుకోవాలి ( ఈ పేస్ట్ మరి మెత్తగా అవకుండా కచ్చా పచ్చగా ఉండేటట్లు చూసుకోండి )
  samayam telugu
 • Step 2:

  గిన్నెను తీసుకోని దానిలో గ్రైండ్ చేసుకున్న పేస్ట్ తో పాటుగా అందులోనే కొత్తిమీర ఆకులు, కరివేపాకు ఆకులు, పసుపు ,పుదీనా ఆకులు మరియు అల్లం తురుము వేసుకొని అన్ని పదార్దాలని చక్కగా కలుపుకోవాలి.
  samayam telugu

 • Step 3:
  ఒక కాలాయిని తీసుకోని అందులో నూనె పోసుకొని వేడిచేసుకోవాలి. నూనె కాగిన తరువాత, ఇంతకముందు చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని గుండ్రగా వడల ఆకారం లో చేసుకొని కాగుతున్న నూనె లో వేసుకోవాలి. మసాలా వడలను 2 నుంచి 3 నిముషాలు గోల్డెన్ బ్రౌన్ రంగులోకి వచ్చేంత వరుకు బాగా వేయించుకోండి.
  samayam telugu
Step 4:
అంతే ..మసాలా వడలు రెడీ అయిపోయాయి వీటిని టీ టైం లో సైడ్ స్నాక్ లాగా లేదా ఏదైనా చట్నీలోకి లేదా సాస్ లోకి నంచుకుని తినవచ్చు.

అరటి–క్యారెట్‌ వడలు
కావలసినవి: అరటికాయ – 1 (ఉడికించుకోవాలి), బియ్యప్పిండి – 1 కప్పు, పచ్చి శనగ పప్పు – అర కప్పు(నానబెట్టుకోవాలి), క్యారెట్‌ గుజ్జు – అర కప్పు, ఉల్లిపాయ – 1(సన్నగా తరిగినవి), వెల్లుల్లి ముక్కలు – పావు టేబుల్‌ స్పూన్‌, పచ్చిమిర్చి ముక్కలు – ఒకటిన్నర టీ స్పూన్లు, కరివేపాకు – 2 రెమ్మలు, ఉప్పు – తగినంత, జీలకర్ర పొడి – అర టీ స్పూన్‌, నూనె – డీప్‌ఫ్రైకి సరిపడా

తయారీ: ముందుగా ఒక బౌల్‌ తీసుకుని.. అందులో ఉడికించిన అరటికాయను ముద్దలా చేసుకోవాలి. క్యారెట్‌ గుజ్జు, బియ్యప్పిండి, పచ్చి శనగపప్పు వేసుకుని కలుపుకోవాలి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, జీలకర్ర పొడి, కరివేపాకు, వెల్లుల్లి ముక్కలు వేసి బాగా కలుపుకుని కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ గారెల పిండి సిద్ధం చేసుకోవాలి. ఇప్పుడు చిన్న బాల్‌ సైజ్‌ మిశ్రమం తీసుకుని చేత్తో వడలా నొక్కి.. మరుగుతున్న నూనెలో డీప్‌ఫ్రై చేసుకుంటే వడలు కరకరలాడుతూ భలే రుచిగా ఉంటాయి.

ఎగ్‌ పరోటా
కావలసినవి: గుడ్లు – 5, మిరియాల పొడి –1 టీ స్పూన్‌, ఉల్లిపాయ ముక్కలు – 2 టేబుల్‌ స్పూన్లు, పచ్చిమిర్చి ముక్కలు – 3 టీ స్పూన్లు, ఉల్లికాడ ముక్కలు – 2 టేబుల్‌ స్పూన్లు, ఉప్పు – తగినంత, క్యారెట్‌ తురుము – 2 టేబుల్‌ స్పూన్లు, జీలకర్ర – పావు టీ స్పూన్‌, కొత్తిమీర తురుము – అర కప్పు, కరివేపాకు – 3 రెమ్మలు, గోధుమపిండి – పావు కిలో, నూనె – సరిపడా, నీళ్లు – తగినన్ని
తయారీ: ముందుగా కోడిగుడ్లను ఉడికించి.. సన్నగా తురుముకోవాలి. ఇప్పుడు స్టవ్‌ ఆన్‌ చేసుకుని.. పాత్రలో 1 టేబుల్‌ స్పూన్‌ నూనె వేసుకుని వేడి చేసుకోవాలి. అందులో ఉల్లిపాయ ముక్కలు, ఉల్లికాడ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, క్యారెట్‌ తురుము, కరివేపాకు, జీలకర్ర ఒకదాని తర్వాత ఒకటి వేసుకుని గరిటెతో తిప్పుతూ.. గుడ్ల తరుగు, మిరియాల పొడి, కొత్తిమీర తురుము, ఉప్పు వేసి బాగా కలుపుతూ రెండు నిమిషాల పాటు ఉడకనిచ్చి స్టవ్‌ ఆఫ్‌ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్‌ తీసుకుని.. అందులో గోధుమపిండి, ఉప్పు వేసి కొద్దికొద్దిగా నీళ్లు కలుపుతూ చపాతీ పిండిలా చేసుకుని.. అరగంట సేపు పక్కన పెట్టుకోవాలి. తర్వాత చపాతీలు చేసుకుని.. మధ్యలో గుడ్డు మిశ్రమాన్ని వేసి అంచులు మడవాలి. ఇప్పుడు నూనె వేసి రెండు వైపులా దోరగా కాల్చుకోవాలి. వీటిని వేడి వేడిగా తింటే బాగుంటాయి.
Keema Samosa And Egg Parota Recipes In Telugu - Sakshi
కీమా సమోసా
కావలసినవి: మటన్‌ కీమా – 1 కప్పు, గరం మసాలా – 1 టీ స్పూన్‌, పసుపు – అర టీ స్పూన్‌, సోంపు పౌడర్‌ –1 టీ స్పూన్‌, ఉప్పు – తగినంత, కారం – 2 టీ స్పూన్లు, మిరియాల పొడి – అర టీ స్పూన్‌, ఉల్లిపాయలు – 3 (సన్నగా తరిగినవి), నూనె – డీప్‌ఫ్రైకి సరిపడా, అల్లం – వెల్లుల్లి పేస్ట్‌ – 2 టీ స్పూన్లు, పచ్చిమిర్చి – 3 (సన్నగా తరిగినవి), గుడ్డు – 1, గోధుమపిండి – 1 కప్పు, మైదాపిండి – 2 కప్పులు, ధనియాల పొడి – 2 టీ స్పూన్లు, నిమ్మరసం – 2 టీ స్పూన్లు, నీళ్లు – సరిపడా, కొత్తిమీర తురుము – కొద్దిగా
తయారీ: ముందుగా నూనె వేడి చేసుకోవాలి. అందులో ఉల్లిపాయ ముక్కలు వేసుకుని.. వేగిన తర్వాత అల్లం – వెల్లుల్లి పేస్ట్, మటన్‌ కీమా జోడించి గరిటెతో తిప్పుతూ ఉండాలి. అందులోనే సోంపు పౌడర్, మిరియాలు, ధనియాల పొడి, పసుపు, ఉప్పు, గరం మసాలా, కారం, పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర తురుము, నిమ్మరసం వేసి బాగా ఉడికించి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక బౌల్‌ తీసుకొని అందులో.. గోధుమ పిండి, మైదాపిండి, గుడ్డు, కొద్దిగా ఉప్పు వేసి మెత్తగా కలిపి 15 నిమషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత చిన్నచిన్న చపాతీలు చేసుకుని… వాటి మధ్యలో ముందుగానే ఉడికించుకొని పెట్టుకున్న మటన్‌ కీమా మిశ్రమాన్ని నింపి.. సమోసా షేప్‌లో చుట్టుకోవాలి. ఇప్పుడు వాటిని నూనెలో డీప్‌ఫ్రై చేసుకోవాలి. వీటిని సాస్‌ లేదా కొత్తిమీర చట్నీతో తింటే భలే రుచిగా ఉంటాయి.
శనగపప్పు దోసెలు
కావలసినవి: ఆలూ మసాలా కర్రీ – 2 కప్పులు (ముందుగా రెడీ చేసుకోవాలి), బియ్యం – 4 కప్పులు, శనగ పప్పు – ఒకటిన్నర కప్పులు , మినప్పప్పు – 1 కప్పు, మెంతులు – 1 టీ స్పూన్‌, పంచదార – ఒక టీ స్పూన్‌, ఉప్పు – సరిపడా
తయారీ: శనగ పప్పు, బియ్యం, మినప్పప్పులను విడివిడిగా 5 గంటల పాటూ నానబెట్టుకోవాలి. తర్వాత అన్నింటినీ కలిపి మిక్సీలో పేస్ట్‌లా చేసుకుని రాత్రంతా పక్కన పెట్టుకోవాలి. మరునాడు నెయ్యితో దోసెలు వేసుకుని పైన ఆలూ మసాలా కర్రీని పెట్టి మడుచుకోవాలి.  వీటిని కొబ్బరి చట్నీతో తింటే భలే రుచిగా ఉంటుంది.

పచ్చి బఠాని పూరీ
కావలసినవి: గోధుమపిండి – 3 కప్పులు, కొత్తిమీర పేస్ట్‌ – 1 కప్పు, రవ్వ – 2 టేబుల్‌ స్పూన్లు, పచ్చి బఠాని – 1 కప్పు, జీలకర్ర  పొడి– అర టీ స్పూన్‌, ధనియాల పొడి – 1 టేబుల్‌ స్పూన్, పచ్చిమిర్చి – 2 (ముక్కలు చేసుకోవాలి), నూనె – సరిపడా, ఉప్పు – తగినంత, నీళ్లు – కొద్దిగా

తయారీ: ముందుగా పచ్చి బఠానీలు శుభ్రం చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత మిక్సీలో పచ్చిమిర్చి ముక్కలు, పచ్చి బఠానీ, జీలకర్ర , ఉప్పు, కొద్దిగా నీళ్లు వేసి మిక్సీలో మెత్తటి పేస్ట్‌లా చేసుకోవాలి. ఆ ముద్దను ఒక బౌల్‌లో వేసుకుని, అందులో గోధుమపిండి, రవ్వ, ధనియాల పొడి, కొత్తిమీర పేస్ట్‌తో పాటూ కొద్దిగా నీళ్లు వేసుకుని పూరీపిండిలా కలుపుకుని.. ఒక పావుగంట పక్కన పెట్టుకోవాలి. తర్వాత చపాతీ కర్రతో పూరీలు చేసుకుని, నూనెలో దోరగా వేయించేయాలి.

ఆలూ బోండా

కావలసినవి: సెనగ పిండి – ఒక కప్పు; బియ్యప్పిండి – పావు కప్పు; నీళ్లు – అరకప్పుకి కొద్దిగా తక్కువ; పసుపు – పావు టీ స్పూను; మిరపకారం – అర టీ స్పూను; ఇంగువ – కొద్దిగా; బేకింగ్‌ సోడా – పావు టీ స్పూను; ఉప్పు – తగినంత.
స్టఫింగ్‌ కోసం: బంగాళ దుంపలు – 5; ఉల్లి తరుగు – అర కప్పు; తరిగిన పచ్చి మిర్చి – 5; కరివేపాకు – రెండు రెమ్మలు; కొత్తిమీర తరుగు – రెండు టేబుల్‌ స్పూన్లు; అల్లం వెల్లుల్లి ముద్ద – ఒక టీ స్పూను; పసుపు – అర టీ స్పూను; ఇంగువ – చిటికెడు; ఆవాలు – ఒక టీ స్పూను; నిమ్మ రసం – అర టీ స్పూను; మినప్పప్పు – రెండు టీ స్పూన్లు; ఉప్పు – తగినంత; నూనె – డీప్‌ ఫ్రైకి సరిపడా.
తయారీ: ∙బంగాళ దుంపలను ఉడికించి, తొక్కతీసి, చేతితో మెత్తగా మెదపాలి ∙స్టౌ మీద బాణలిలో నూనె కాగాక ఆవాలు, మినప్పప్పు వేసి వేయించాలి ∙ఉల్లి తరుగు జత చేసి బంగారురంగులోకి మారేవరకు వేయించాలి ∙అల్లం వెల్లుల్లి ముద్ద, కరివేపాకు, పచ్చి మిర్చి తరుగు జత చేసి మరోమారు వేయించాలి ∙పసుపు, ఇంగువ జత చేసి బాగా కలిపిన తరవాత, కొత్తిమీర జత చేసి కలపాలి ∙బంగాళ దుంప ముద్ద జత చేసి కలియబెట్టాలి ∙తడిపోయి, పొడిపొడిలాడే వరకు స్టౌ మీదే ఉంచి కలుపుతుండాలి ∙నిమ్మ రసం, ఉప్పు జత చేసి, దింపేయాలి ∙కొద్దిగా చల్లారాక ఈ మిశ్రమాన్ని పెద్ద నిమ్మకాయ పరిమాణంలో ఉండలు చేసి పక్కన ఉంచాలి ∙ఒక పాత్రలో సెనగపిండి, బియ్యప్పిండి, నీళ్లు, పసుపు, మిరప కారం, ఇంగువ, బేకింగ్‌ సోడా, ఉప్పు వేసి తగినన్ని నీళ్లు జోడించి బజ్జీల పిండిగా కలుపుకోవాలి ∙స్టౌ మీద బాణలిలో నూనె పోసి కాచాలి ∙తయారు చేసి ఉంచుకున్న బంగాళ దుంప ఉండలను ఒక స్పూనుతో తీసుకుని, పిండిలో ముంచి, జాగ్రత్తగా నూనెలో వేసి బంగారు రంగులోకి మారే వరకు రెండు వైపులా వేయించి, పేపర్‌ టవల్‌ మీదకు తీసుకోవాలి ∙కొబ్బరి పచ్చడి, సాస్‌లతో తింటే రుచిగా ఉంటాయి.

జిలేబి తయారు చేయడం

కావాల్సినవి : 


మైదా – 1 కప్పు, శనగ పిండి – 1 టేబుల్‌ స్పూన్‌, తాజా పెరుగు – 1 కప్పు,

చక్కెర – 1 కప్పు, నీరు – 4 కప్పులు, కుంకుమ పువ్వు – 4-5 రేకలు, ఫ్రూట్‌ సాల్ట్‌ – చిటికెడు, కుంకుమ పువ్వు రంగు – చిటికెడు, నెయ్యి – 1 కప్పు

తయారీ : 

ఒక బౌల్‌లో మైదాపిండి శనగపిండి, తాజా పెరుగు తీసుకుని ఉండలు లేకుండా గట్టిగా కలపాలి. కలిపిన పిండిని 10 నిమిషాల పాటు కదపకుండా అలా ఉంచాలి. ఇప్పుడు పొయ్యిమీద మరొక పాన్‌లో పంచదార, నీళ్లు కలిపి పెట్టుకోవాలి. పంచదార కరిగే వరకు 3 నుంచి 5 నిమిషాల వరకు కలుపుతూ ఉండాలి. కుంకుమ పువ్వు, ఫుడ్‌ కలర్‌ వేసి తక్కువ మంట మీద బాగా కలపాలి. పిండిలో చిటికెడు ఫ్రూట్‌ సాల్ట్‌ కలపాలి. ప్లాస్టిక్‌ స్క్వీజ్‌ బాటిల్‌ తీసుకోండి. మూత తెరిచి పై భాగంలో ఒక గరాటు ఉంచండి. బాటిల్‌లోకి పిండిని గరాటు ద్వారా వేసి బాటిల్‌కి నాజిల్‌ ఉన్న మూతను పెట్టాలి. పొయ్యి మీద పాన్‌ పెట్టి నెయ్యి పోసి కరిగించి రెండు నిమిషాలు వేడి చేయాలి. నెయ్యి వేడెక్కాక పిండి వేసుకున్న బాటిల్‌ తీసుకొని బాటిల్‌ని నొక్కుతూ జిలేబి ఆకారం వచ్చేలా వేయాలి. జిలేబి రౌండ్స్‌ ఒకదాని తర్వాత ఒకటి వచ్చేలా జాగ్రత్తగా వేయాలి. రెండు వైపులా గోల్డ్‌ కలర్‌ వచ్చేవరకు జాగ్రత్తగా వేగించాలి. బాగా వేగిన జిలేబిని ఒక ప్లేట్‌లోకి తీసుకోవాలి. ఆ జిలేబి మీద పంచదార పాకాన్ని పోసి 30 సెకన్ల పాటు అలానే ఉంచాలి.  ఇక వేడి వేడి జిలేబీలతో పిల్లల్ని ఊరించండి

మిర్చి బజ్జీలు

మిర్చి బజ్జీలు క్రిస్పీగా రావాలంటే ఇలా చేయండి..

ప్రధాన పదార్థం

 • అవసరాన్ని బట్టి సెనగ పిండి
 • అవసరాన్ని బట్టి చిల్లీ పికిల్
 • 1 టేబుల్ స్పూన్ బియ్యం పిండి
 • అవసరాన్ని బట్టి నీళ్ళు

టెంపరింగ్ కోసం

 • అవసరాన్ని బట్టి రీఫైండ్ ఆయిల్ లేదా సుద్దిచేసిన నూనె

ప్రధాన వంటకానికి

 • 1 టీ స్పూన్ సోపు
 • 1 టీ స్పూన్ కారప్పొడి
 • అవసరాన్ని బట్టి ఉప్పు
 • అవసరాన్ని బట్టి పసుపు
 • అవసరాన్ని బట్టి అసఫోయ్టెడా

Step 1:

ముందుగా ఓ బౌల్ తీసుకుని శనగపిండి, బియ్యం పిండి, పసుపు, కారం, ఉప్పు, ఇంగువ ఇలా ఒకదాని తర్వాత ఒకటి వేయండి, వీటన్నింటిని ముందుగానే ఓ సారి కలపండి.

Step 2:

ఇప్పుడు పిండి మిశ్రమంలో ఓ స్పూన్ ఆయిల్ వేసి మరోసారి కలపండి. ఇందులో నీరు పోసి బజ్జీల పిండిలా కలపండి.

samayam telugu

Step 3:

ఇప్పుడు పచ్చి మిర్చిలకు మధ్యలో చీల్చండి.. ఇప్పుడు మధ్యలో కొద్దిగా కారం రాయండి. ఇలా చేయడం వల్ల బజ్జీలు స్పైసీగా, టేస్టీగా వస్తాయి.

samayam telugu

Step 4:

ఇప్పుడు పాన్ తీసుకుని నూనె వేసి వేడి చేయండి.నూనె వేడి అయిన తర్వాత మిర్చిలను పిండిలో ముంచి నూనెలో వేయండి. వీటిని కాస్తా దోరగా వేయించండి.

samayam telugu

Step 5:

వీటిని వేడివేడిగా టమాటా సాస్‌తో కానీ, ఉల్లిపాయ కాంబినేషన్‌తో తింటచే చాలా బావుంటాయి.

%d bloggers like this:
Available for Amazon Prime