మునగకాడ. కూరలు

Drumstick Food Varieties Special Story - Sakshi

మునగాకు పప్పుకూర
కావలసినవి:
తాజాగా కోసి, కాడలు లేకుండా శుభ్రపరచుకున్న మునగాకు – ఒక పెద్ద కప్పు; కందిపప్పు – చిన్న గ్లాసుడు; పసుపు – చిటికెడు; ఇంగువ – అర టీ స్పూన్‌; నూనె – 3 టీ స్పూన్లు; ఎండు మిర్చి – 2; ఆవాలు – అర టీ స్పూన్‌; జీలకర్ర  ఒక టీ స్పూన్‌; మినప్పప్పు – 2 టీ స్పూన్లు; కరివేపాకు – 2 రెమ్మలు; ఉప్పు – తగినంత.

తయారీ:
ముందుగా స్టౌ వెలిగించి, మందపాటి గిన్నెలో కందిపప్పు వేసి, సన్నటి సెగ మీద ఎర్రగా వేయించుకోవాలి ∙వేగిన కందిపప్పును రెండు సార్లు నీళ్లతో కడిగి, తగినన్ని నీళ్లు జత చేసి ఉడికించాలి ∙పప్పు సగం ఉడికాక, కడిగిన మునగాకు జత చేసి కలియబెట్టాలి ∙పసుపు, ఉప్పు, ఇంగువ జత చేయాలి ∙కందిపప్పు ఉడికి బద్దబద్దలుగా ఉన్నప్పుడే నీరంతా ఇగిరి పోయాక దించుకోవాలి ∙వేరే స్టౌ మీద కళాయి పెట్టి  నూనె వేసి పోపు వేయించుకోవాలి ∙ఉడికించుకున్న మునగాకు పప్పు వేసి బాగా కలిపి సన్న సెగ మీద కాసేపు ఉంచి,  స్టౌ మీద నుండి దించి, బౌల్‌లోకి తీసుకోవాలి. ఈ పప్పుకూరకు మునగాకు ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిది. (కుకర్‌లో వండకూడదు. పప్పు పొడిపొడిలాడుతూ ఉంటేనే చూడటానికి, అన్నంలో తినడానికి  రుచిగా ఉంటుంది).

మునగ –టొమాటో కూర
కావలసినవి:
మునగ కాడలు – 3; టొమాటోలు – అర కిలో; ఉల్లిపాయలు – 2; కొత్తిమీర – చిన్న కట్ట; పసుపు – చిటికెడు, ఉప్పు – తగినంత
పోపు కోసం… ఎండు మిర్చి – 4 (ముక్కలు చేయాలి); పచ్చి సెనగపప్పు – 2 టీ స్పూన్లు; మినప్పప్పు – ఒక టీ స్పూను; ఆవాలు – అర టీ స్పూను; జీలకర్ర – అర టీ స్పూను; మిరప కారం – 2 టీ స్పూన్లు; నూనె – రెండు టేబుల్‌ స్పూన్లు.

తయారీ: 
మునగ కాడలను చిన్న చిన్న ముక్కలుగా తరగాలి ∙టొమాటోలు, ఉల్లిపాయలను కూడా సన్నగా తరగాలి ∙స్టౌ వెలిగించి మందపాటి గిన్నె పెట్టి నూనె వేసి కాగాక, పోపు దినుసులు ఒకదాని తరవాత ఒకటి వేసి, దోరగా వేయించాలి ∙ఎండు మిర్చి, ఉల్లి తరుగు జత చేసి బాగా వేయించాలి ∙టొమాటో తరుగు, మునగ కాడ ముక్కలు, ఉప్పు జత చేసి బాగా కలపాలి ∙ సన్నటి సెగ మీద మగ్గనివ్వాలి∙బాగా ఉడికిన తరవాత, మిరప కారం వేసి బాగా కలిపి ఒక నిమిషం తరవాత దింపేయాలి ∙కూరను ఒక బౌల్‌లోకి తీసుకుని, కొత్తిమీరతో అలంకరించాలి ∙అన్నంలోకి రుచిగా ఉంటుంది.

%d bloggers like this: