‘టీ’

Types Of Tea - Sakshi

ఒత్తిడితో చిత్తయ్యే చాలా మంది టీ లేదా కాఫీ తాగి ఉపశమనం పొందుతుంటారు. ఇంట్లోనూ కాస్త ఫ్రీ టైమ్‌ దొరికిందంటే టక్కున గుర్తుకొచ్చేదీ ఇదే. అలా టీ తాగుతూ నచ్చిన పుస్తకాన్ని చదివితే అంతకంటే మనసుకు ఆహ్లాదం ఇంకేముంటుంది. స్నేహితులు కలిసినపుడు, తెలిసిన వారు బజారులో పలకరించినపుడు, మర్యాదపూర్వక భేటీల సమయంలో తప్పకుండా ఒక ‘స్ట్రాంగ్‌ టీ’ గుటకేయాల్సిందే!! లేదంటే చాలా మందికి ప్రాణం ఉసూరుమంటుంది.

తేనీటి ఘుమఘుమలకు టీ ప్రియులు ఫిదా అవుతున్నారు. నిత్య జీవనంలో టీ ప్రముఖ పాత్రే పోషిస్తోంది. మూడు దశాబ్దాల కిందట ఒకటీరెండు రకాల తేనీరే అందుబాటులో ఉండేది. కప్పు రూ.0.15 పైసలతో మొదలై.. ఇప్పుడు రూ.15కు చేరింది. 

నాలుగు చినుకులు పడ్డాయంటే..
బయట చిరుజల్లులు. ఆహ్లాదకరమైన వాతావరణం. వేడివేడిగా తేనీటి చుక్కలు గొంతులోకి దిగుతుంటే భలే ఉంటుంది కదూ. ఇద్దరు మిత్రులు కలవగానే నోటి నుంచి వచ్చే మొదటి మాట ‘టీ తాగుదాం భయ్యా’, ‘టీ తాగుదాం బాబాయ్‌..’, స్ట్రాంగ్‌ చాయ్‌ తాగుదాం మావా..’. ఇక విద్యార్థులైతే ఒన్‌బైటూ చాయ్‌ చెబుతారు. బందువులు ఇంటికి రాగానే తేనీటి సేవనంతోనే కబుర్లు మొదలవుతాయి. మనసు చికాకు పుట్టినా.. కొత్తవారితో దోస్తీ కట్టినా.. వాన పడినా.. మంచు కురిసినా, ఎండ కాసినా టీ రుచులను ఆస్వాదించాల్సిందే. చిరుద్యోగి నుంచి కార్పొరేట్‌ కంపెనీ సీఈఓ వరకు రోజుకు ఒక్కసారైనా టీ సేవించాల్సిందే.
నగరాల్లో ఇరానీ చాయ్‌ వచ్చేసింది. ప్రత్యేకంగా ఇరానీ చాయ్‌ రుచులు చూపించే దుకాణాలు ఉన్నాయి. తేయాకు రుచులకు డిమాండ్‌ నానాటికీ పెరుగుతోంది. ఆరోగ్యం.. ఆనందం..ఆహ్లాదం.. ఆస్వాదన పంచే తేనీరుతో కొన్ని హోటళ్లు ప్రత్యేక ఆహ్వానం పలుకుతున్నాయి. సమయానికి తగినట్లుగా, మూడ్‌కు అనుగుణంగా సరికొత్తగా కొత్త కొత్త రుచులతో తేనీరు అందుబాటులోకి వచ్చింది. మారిన జీవన శైలి.. పోటీ పడి అలసిన వారు కాసేపు సేద తీరేందుకు ఇటు వైపుగా అడుగులు వేస్తున్నారు. నగరంలోనూ కేఫ్‌ క్లబ్‌లు వెలుస్తున్నాయి. ఆధునిక పోకడలకు దర్పణం పడుతున్నాయి.

కొత్తగా ఆస్వాదించాల్సిందే..
మారుతున్న పరిస్థితుల్లో అన్ని వర్గాల్లోనూ ఆరోగ్య స్పృహ పెరిగింది. ఖర్చు ఎక్కువనా వెనుకంజ వేయడం లేదు. కార్పొరేట్‌ సంస్కృతి అందుబాటులోకి వచ్చింది. కాసేపైనా సమావేశాలు, స్నేహితులు బందువులతో గడపాలంటే టీ రూమ్‌లకే ప్రాధాన్యం ఇస్తున్నారు. ఏకాంతంగా గడిపేందుకు అనుకూల వాతావరణం ఆస్వాదించడానికి అద్భుతమైన రుచులను కోరుతున్నారు. నగరంలో వివిధ బ్రాండ్ల టీ రకాలు అందుబాటులో ఉన్నాయి. హైవే పైనా కాఫీ క్లబ్‌లు, టీ షాప్‌లు వెలిశాయి. 24 గంటలపాటు వీటి సేవలు ప్రజలకు అందుబాటులో ఉంటున్నాయి. ఇక టీ బంకులు ఉండనే ఉన్నాయి. టీ కాస్త బాగుంటే చాలు.. షాప్‌ వద్ద జనాలు గుంపులు గుంపులే. అర్ధరాత్రి వరకు టీ దుకాణాలు తెరిచే ఉంటున్నాయి. పాత మార్కెట్‌ సెంటర్‌తోపాటు పలు ప్రాంతాల్లో రకరకాల టీలు లభిస్తున్నాయి.
ఘుమఘుమలతో ఫిదా..
టీ గ్లోబల్‌ మార్కెట్‌. అంతర్జాతీయంగా ఉండే టీ రకాలు స్థానిక మార్కెట్‌కు వస్తున్నాయి. మూడు దశాబ్దాల కిందట టీ రకం ఒకటే. ఇప్పుడు రకరకాలు. రంగు.. రుచి.. వాసన ఘుమఘుమలతో నగరవాసులు టీకి ఫిదా అవుతున్నారు. 1853లో తేయాకు తోటలను తొలిసారిగా సాగు చేశారు. క్రమంగా విస్తరించి లక్షలాది ఎకరాల్లో తేయాకు పండిస్తున్నారు. అస్సాం, పశ్చిమబెంగాల్, తమిళనాడు, కేరళ, త్రిపుర, అరుణాచల్‌ప్రదేశ్, హిమాచల్‌ప్రదేశ్, సిక్కిం, నాగాలాండ్, ఉత్తరాఖండ్, మిజోరాం, మేఘాలయ, కర్నాటక, ఒడిశా తదితర రాష్ట్రాల నుంచి రకరకాల తేయాకు మార్కెట్‌కు వస్తోంది. కిలో రూ.139 నుంచి రూ.1200 వరకు ఉండే రకాలు ఇక్కడ లభిస్తున్నాయి. ఆరోగ్య సూత్రాలు బాగా అవలంబిస్తున్న నేపథ్యంలో బ్లాక్, గ్రీన్, హెర్బల్, దినుసులతో తయారు చేసిన టీ రకాలను ఆస్వాదించే వారి సంఖ్య బాగా పెరిగింది. ఇప్పుడు చిన్న డిస్పోజల్‌ బ్యాగ్‌లలోనూ టీ లభిస్తోంది. బ్లాక్, చీజ్, పౌడర్, రెడీ టీ, గ్రీన్, జింజర్‌ రకరకాలు మార్కెట్‌లో లభ్యమవుతున్నాయి.
ఔరా అనాల్సిందే..
ఎల్లో బడ్‌ టీ రెండు కప్పుల విలువ ఎంతో తెలుసా? అక్షరాలా రూ.6,500. స్టార్‌ హోటళ్లల్లో ఈ టీ లభిస్తుంది. టీ వినియోగానికి పెరిగిన ఆదరణకు ఇది ప్రతీక. అచ్చమైన తేయాకును ఎండబెట్టి 24 కేరట్ల బంగారంతో మిళితం చేసిన ఫ్లేవర్‌తో ఎల్లో బడ్‌ టీ పొడి తయారు చేస్తారు. ఈ టీ పౌడర్‌ కిలో ధర సుమారు రూ.8 లక్షలు. ఎంతటి వారైనా ఈ ధర చూసి ఔరా అనాల్సిందే.  స్థానిక మార్కెట్‌లోనూ 40 రకాలకు తగ్గకుండా టీ లభిస్తోంది. అల్పాహార హోటళ్లల్లోనూ నిత్యం వినియోగించే రకాలను అందుబాటులో ఉంచుతున్నారు. ఒంగోలులోని వివిధ సెంటర్లలో జింజర్‌ టీ, గ్రీన్, బ్లాక్, దాల్చిన చెక్క, వైట్‌ టీ, ఎల్లో టీ, బాదం టీ, మింట్, మిరియాలు, వాము, గార్లిక్‌.. ఇలా రకరకాల టీలు విక్రయిస్తున్నారు. ఉదయాన్నే అల్లం టీ తాగేందుకు వాకర్లు గుంపులుగుంపులుగా టీ కొట్ల వద్దకు చేరుతున్నారు. ఉదయం పూట ఒక్క మంగమూరు రోడ్డులోని రెండు మూడు కేంద్రాల్లో వందలాది టీలు అమ్ముడవుతున్నాయి. షాప్‌ నిర్వాహకులు పార్ట్‌ టైం సర్వెంట్లను పెట్టుకుని ఉదయం టీ మార్కెట్‌ నడిపిస్తున్నారు. పాలు, పంచదార కలపకుండా చక్కటి రుచి, సువాసన కలిగిన టీలు కాఫీ షాప్‌ల్లో లభిస్తున్నాయి. ఎలాంటి రసాయనాలు కలపకుండా స్వచ్ఛమైన తేయాకుతో తయారు చేసే టీలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి.

గ్రీన్ టీ


మీరు తెలుసుకోవలసిన గ్రీన్ టీ ప్రయోజనాలు

Image result for green tea advantages

పురాతన చైనాలో గ్రీన్ టీ ఖరీదైన పానీయం డానిని కులీనులు మాత్రమె సేవించేవారు కానీ క్రీ.శ 1368 లో మంగోలియన్ సామ్రాజ్యం పతనం తరువాత, చైనా మొత్తం జనాభా టీ త్రాగటం ప్రారంభించారు.

ఆధునిక కాలంలో నీటి తర్వాత టీ ప్రపంచంలో అత్యంత ప్రాచుర్యం పొందిన పానీయం మరియు గ్రీన్ టీ అనేది కామెల్లియా సినెన్సిస్ ఆకుల నుండి తయారైన ఒక రకమైన పానీయం. గ్రీన్ టీ లో యాంటీఆక్సిడెంట్ల అధికంగా ఉన్నాయి.
మీ రోజువారీ ఆహారంలో భాగంగా గ్రీన్ టీని ఉపయోగించడం వల్ల దాని లోని యాంటీఆక్సిడెంట్ల వల్ల మీరు దీర్ఘకాలిక సహజ శక్తిని పొందవచ్చు.
గ్రీన్ టీ సహజ శక్తి యొక్క మూలం మాత్రమే కాదు, ముఖ్యంగా శీతాకాలంలో ఇది హైడ్రేషన్ యొక్క విలువైన మరియు నమ్మదగిన మూలం.
గ్రీన్ టీ ఏడాది పొడవునా వినియోగించబడుతుంది ఎందుకంటే ఇది కేలరీలు లేని పానీయం.
గ్రీన్ టీ వల్ల వందలాది ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి, వాటిలో కొన్ని క్రింద ఇవ్వబడ్డాయి.

గ్రీన్ టీ యొక్క ఆరోగ్య ప్రయోజనాలు:

ఆధునిక పరిశోధనలో గ్రీన్ టీలో యాంటీఆక్సిడెంట్లు మరియు చాలా తక్కువ స్థాయి కెఫిన్ ఉన్నందున అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని కనుగొనబడింది
చైనాలో, గ్రీన్ టీని శతాబ్దాలుగాఆరోగ్య ప్రయోజనాల కోసం ఉపయోగిస్తారు. మానసిక పదును (mental sharpness) మెరుగుపరచడానికి చైనీయులు గ్రీన్ టీ తీసుకుంటున్నారు.
శీతాకాలంలో గ్రీన్ టీ ఇన్ఫ్లుఎంజాతో సహా వైరస్లతో పోరాడటానికి సహాయపడుతుంది.
‘చెడు’ కొలెస్ట్రాల్.-(తక్కువ-సాంద్రత కలిగిన లిపోప్రొటీన్ (ఎల్‌డిఎల్) స్థాయిలు గ్రీన్ టీ తగ్గించును., 
.గ్రీన్ టీ మూత్రాశయం, శోషరస కాన్సర్లు , రొమ్ము, గర్భాశయ, అన్నవాహిక, పెద్దప్రేగు, ఊపిరితిత్తులు, ఎముకలు, క్లోమం, ప్రోస్టేట్, కడుపు మరియు చర్మం యొక్క క్యాన్సర్లతో పోరాడటానికి సహాయపడుతుంది.
గ్రీన్ టీ సహనం (endurance) పెంపుదలకు  సహాయపడుతుంది
ఆధునిక కాలంలో, బరువు తగ్గడాన్ని ప్రోత్సహించడంలో గ్రీన్ టీ బాగా ప్రాచుర్యం పొందింది.


టీ, బ్లాక్ టీ.. రెండింటిలో ఏది బెటర్
black tea 1

వేడి వేడి టీని ఆల్మోస్ట్ అంతా ఇష్టపడతారు. మన లైఫ్‌లో టీ కూడా ఒక భాగమే. రోజు మొత్తం మీద ఎప్పుడైనా ఒక కప్పు టీని అంతా ఇష్టపడి తాగుతారు. టీ అంటే పాలూ, పంచదారా కలిపిన టీ అని అనుకుంటాం.. కానీ, ఈ రెండిటి కాంబినేషన్ టీతో పోషకాలు పోతాయట. అందుకని హెల్త్ గురించి ఆలోచించే వాళ్ళు గ్రీన్ టీ కానీ, బ్లాక్ టీ కానీ ఎక్కువగా ఇష్టంగా తాగుతున్నారు.
బ్లాక్ టీ రుచిగా ఉండడంతో పాటూ, ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. దీంతో, బ్లాక్ టీ కి బోలెడంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అందులో ఉన్న కెఫీన్ వల్ల బద్ధకం పోయి కావాల్సిన ఉత్సాహాన్నిస్తుంది. బ్లాక్ టీలో పాలిఫినాల్స్ అనే యాంటీ-ఆక్సిడెంట్స్ పుష్కలం గా ఉంటాయి. దీంతో మెటబాలిజం బూస్ట్ అయి అరుగుదల బాగుంటుందని అంటారు. పాలీఫెనాల్స్ బరువుని తగ్గించడంలో తోడ్పడుతాయి అంటారు, మరి బ్లాక్ టీ బరువు తగ్గిస్తుందా?
samayam telugu
పాలూ, పంచదారా లేని బ్లాక్ టీ తాగడం ఆరోగ్యానికి మంచిది. బరువు తగ్గడం గురించి ఆలోచించకుండా హెల్త్ కి మంచిది కాబట్టి బ్లాక్ టీ తాగడం బెటర్ అని చెబుతున్నారు.బ్లాక్ టీ యాంటీ ఆక్సిడెంట్స్ తో సమృద్ధమై మీ రోగనిరోధక వ్యవస్థని బలోపేతం చేయడమే కాకుండా, అందులో ఉండే పాలిఫినాల్స్ అనే యాంటి ఆక్సిడెంట్స్ శరీరంలోకి కెమికల్స్ వెళ్ళకుండా చేస్తాయి. అవి బ్యాక్టీరియాతో పోరాడడమే కాకుండా ఎముకలని బలంగా చేస్తాయి. బ్లాక్ టీ లో ఉన్న ఆల్కైలమీన్ యాంటిజెన్స్, టానిన్స్ రోగనిరోధక శక్తి ని పెంచి జీర్ణకోశాన్ని బలోపేతం చేస్తాయి.

ఇరానీ చాయ్

Irani Chai | The flavour of Hyderabad! - Travel Twosome

చాయ్ తాగితే కలిగే ఫీలింగ్ అంతా ఇంతా కాదు పని ఒత్తిడికి గురైన వారు ఎందరో ఛాయ్ తాగి రిలాక్స్ అవుతూ ఉంటారు , అందులో ఇరానీ ఛాయ్ గురించి చెప్పే పని లేదు, హైదరాబాద్ లో హైదరబాద్ బిర్యాని తో, పాటు ఇరానీ చాయ్ కూడా ఫేమస్.

ఇరానీ చాయ్ లో తేయాకు నీరు చక్కెర తప్ప, పాలు లేకుండానే చాయ్ తయారు చేస్తారు కొంచెం తాగితే ఆ మజానే వేరు ఇదే మనకు ప్రస్తుతం రుచి చూపిస్తున్న ఇరానీ ఛాయ్.
గతంలో ఇరానిలు మన హైదరాబాద్ కి వచ్చి స్థిరపడ్డారు, అయితే వారు నగరానికి వచ్చింది బ్రిటిష్ వారి లా దోచుకునేందుకు కాదు, వాళ్లు మన దగ్గర స్థిరపడటమే కాకుండా వారికి తెలిసిన ఇరానీ చాయ్ ని అలవాటు చేసి క్రమక్రమంగా ఇరానీ ఛాయ్ వ్యాపారం చేసేందుకు .
ఇరానీ చాయ్ దగ్గర కూడా బ్రిటిష్ వాళ్ళు కుట్ర చేశారు కానీ ఫలితం లేకుండా పోయింది, ఇరాన్ చాయ్ నీ మించిన ఛాయ్ చేయాలని నాణ్యమైన తేయాకు పండించారు, కానీ అంతగా రుచి లేక ఇరానీ చాయ్ కింద దిగదుడుపే అయిపోయింది.
%d bloggers like this:
Available for Amazon Prime