కోలకతా

ఐకానిక్ హౌరా వంతెన

Howrah Bridge Kolkata - Rabindra Setu Kolkata, History, Photos

బ్రిటీష్ కాలం నాటి హౌరా బ్రిడ్జ్, కోల్కత్తా నగరానికి గేట్ వే గా పనిచేస్తుంది, ప్రతి రోజు  లక్షల  వాహనాలు  మరియు 1.5 లక్షల మంది పాదచారులు దీనిని దాటుతారు.  కోల్కత్తా మరియు హౌరాను కలిపే ఒక బల్లకట్టు వంతెన స్థానం లో  ఈ  వంతెన ఫిబ్రవరి 3, 1943 న ప్రజల ఉపయోగార్ధం  ప్రారంభింప పడినది. 

ఎల్లప్పుడూ అశేష జన సంద్రం చే సందడిగా ఉoడే తూర్పు మహానగరాన్ని(కోల్కత్తా) గంగా నది పై ఉన్న టెర్మినల్ హౌరా స్టేషన్ తో  కలిపి ఉక్కుతో నిర్మించబడిన ఈ వంతేనకు  నోబెల్ గ్రహీత మరియు కోల్కత్తా యొక్క ఆణిముత్యం కవి రబీంద్రనాథ్ ఠాగూర్ పేర “రబీంద్ర సేతు” అని(1965 లో)  పెట్టబడినది.

ప్రపంచపు నాల్గవ-అతి పొడవైన కాంటిలివర్ సస్పెన్షన్ గల ఈ వంతెన  2వ ప్రపంచ యుద్ధం కాలం లో నిర్మించబడినది.  26,500 టన్నుల ఈ భారి ఉక్కు  నిర్మాణం ప్రస్తావన  రుడ్యార్డ్ కిప్లింగ్ రచనలలో మరియు  టాటా స్టీల్ ప్రచురించిన కాఫీ టేబుల్ బుక్ ” హౌరా బ్రిడ్జ్: యాన్ ఐకాన్ ఇన్ స్టీల్ ” అనే పుస్తకం లో కన్పిస్తుంది. 2వ ప్రపంచ యుద్ధ సమయంలో హౌరా వంతెన బాంబు దాడికి లక్ష్యంగా చేసుకో బడినది.

 హౌరా బ్రిడ్జ్ నిర్మాణం అక్టోబరు 1936 లో మొదలైంది, మరియు ట్రాఫిక్ కోసం వంతెనను తెరవడానికి ఆరు సంవత్సరాలు పట్టింది. బ్రిడ్జ్  నిర్మాణ పనులలో  అన్ని వర్గాల వారు పాల్గొన్నారు. హిందువులు, ముస్లింలు,సిక్కులు నేపాలీ గూర్ఖాలు మరియు పటాన్స్ దాని  నిర్మాణం లో పనిచేసారు. కార్మిక ఇబ్బందుల వలన  ఒకరోజు కూడా పని ఆగలేదు.  హౌరా వంతెన చట్టం 1926 ద్వారా బ్రిడ్జ్ నిర్మాణ పనులు ఆరoభం అయినాయి. భూసేకరణ , లెవీ పన్నులు, ఉద్యోగులను నియమించడం మరియు నిర్వహణ కొరకు చట్టాలు రుపొందిoచబదినవి.  ఈ చట్టం తరువాత 1935 లో న్యూ హౌరా వంతెన చట్టం అమలు  లోనికి వచ్చింది. 

హౌరా వంతెన నిర్మాణం ప్రపంచవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తించింది.  ఇంజనీరింగ్, టెక్నాలజీ మరియు ఆవిష్కరణ సంబంధించిన విషయాల్లో ఆధారిటి గా పరిగణింప బడే లండన్ ఆధారిత నెలసరి పత్రిక ఇంజనీర్ ఈ వంతెన  నిర్మాణంపై విశేష చర్చ జరిపింది. రెండిల్, పాల్మెర్ మరియు ట్రిట్టన్ (Rendel, Palmer and Tritton) ఈ వంతెన నిర్మాణానికి సివిల్ ఇంజనీర్లుగా వ్యవహరించారు  మరియు బ్రిటీష్ సంస్థ క్లీవ్లాండ్ బ్రిడ్జ్ &ఇంజనీరింగ్ కంపెనీ లిమిటెడ్ ఈ బ్రిడ్జ్  మొత్తం నిర్మాణానికి కాంట్రాక్ట్ పొందినది.  కలకత్తా ఆధారిత బైత్వాైట్, బర్న్ మరియు జెస్సోప్ సంస్థ  Baithwaite, Burn and Jessop ఫ్యాబ్రికేతేడ్ ఉక్కు పనులకు సబ్-కాంట్రాక్టర్లు అయ్యారు.

 
మొత్తం నిర్మాణానికి పట్టిన 26,500 టన్నుల ఉక్కులో టాటా ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ 23,500 టన్నుల సరఫరా చేసింది. మిగిలిన 3,000 టన్నులు ఇంగ్లాండ్ లో  తయారు చేయబడ్డాయి.వంతెన నిర్మాణం లో నట్ లేదా బోల్ట్ ఉపయోగించబడలేదు. బ్రిడ్జ్ నిర్మాణం తరువాత , కోల్కతా నగర రూపురేఖలు మారినవి. 

ఇది ఇప్పుడు ప్రపంచంలోని ఆరవ అతిపెద్ద వంతెన.ఇంజనీర్ పత్రిక జనవరి 14, 1944 న ఇలా వ్రాసింది: “ఇది (వంతెన) 71 అడుగుల వెడల్పు మరియు 15 అడుగుల వెడల్పుకలిగిన  రెండు ఫుట్-పాత్ లను కలిగి ఉంది  మరియు దాని మధ్యభాగం 1500 అడుగుల పొడవు ఉంటుంది.”

కోల్కత్తా పోర్ట్ ట్రస్ట్ 2,150 అడుగుల విస్తీర్ణంలో నిర్మించబడిన ఈ వంతెన యొక్క సంరక్షకుడు మరియు అది  దాని పునాది నుండి 280 అడుగుల ఎత్తున ఉంది.


జూన్ 24, 2005 న, ఒక ప్రైవేట్ కార్గో నౌక వలన ఈ నిర్మాణం కు రూ .15 మిలియన్ విలువ అయిననష్టం జరిగింది. వంతెన కన్సల్టెంట్స్ రెండిల్, పాల్మెర్ మరియు ట్రిట్టన్ లను  పిలిచారు, మరియు వారు మరమ్మతు కోసం నిర్మాణ సమయంలో ఉపయోగించిన ఉక్కును అందించారు.


 తుప్పు, పక్షి రెట్టలు మరియు సున్నం, జర్దా తో కూడిన పాన్ (బీటిల్ ఆకు) ఉమ్మి వలన  వంతెన దెబ్బతిన్నది. 2007 మరియు 2011 మధ్య కాలంలో,ఆరు మిల్లీమీటర్లు నుండి మూడు మిల్లీమీటర్ల వరకు స్తంభాలను రక్షించే ఉక్కు హుడ్స్ యొక్క మందం తగ్గిపోయిoదని 2011 లో జరిగిన ఒక తనిఖీ వెల్లడి చేసినది.

ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోబడ్డాయి మరియు రెగ్యులర్ గా   పెయింటింగ్ చేయబడినది. 2014 లో కోల్కతా పోర్ట్ ట్రస్ట్ రూ .6.5 మిలియన్లను ఖర్చుచేసింది. 26,000 లీటర్ల లేద్-రహిత  పెయింట్తో  2.2 మిలియన్ చదరపు మీటర్ల పేయింట్ చేయబడినది.2013 మరియు 2016 మధ్యకాలంలో ఇంజినీరింగ్ నిర్వహణ కొరకు  సగటు వార్షిక వ్యయం 2.5 కోట్లు అయింది.

ఈ వంతెన సత్యజిత్ రే, రిత్విక్ ఘటక్, మృణాల్ సేన్, రాజ్ కపూర్, రోలాండ్ జోఫ్ఫ్ మరియు మీరా నాయర్ నిర్మించిన పలు చిత్రాలలో కన్పిస్తుంది. సుప్రసిద్ద తెలుగు చలన చిత్ర నటుడు చిరంజీవి నటించిన చిత్రం లో హౌరా బ్రిడ్జ్ పై సూపర్-హిట్ పాట” ఔరా హౌరా బ్రిడ్జ్”  ఉంది. శక్తిసామంత  నిర్మించిన  యొక్క “హౌరా బ్రిడ్జ్” హిందీ చిత్రం భారీ బాక్స్ ఆఫీసు విజయాన్ని సాధించింది.అందులో అందాల తార  మధుబాల నటించినది.

 హౌరా బ్రిడ్జ్ ప్రాశస్యం ఇండియా తీరాలను దాటింది.
బెల్జియం ఎంబసీ యొక్క ఫేస్-బుక్ పేజిలో హౌరా వంతెనకు ముందు హెర్జ్ యొక్క టిన్ టిన్ కనిపిస్తాడు. టిన్ టిన్, (బాయ్ డిటెక్టివ్) ఎప్పుడూ నగరాన్ని సందర్శించలేదు.

What is the best thing about living in Kolkata?

  • Food: We Bengalis love to eat and love to feed. Food is religion to us and you will find a connoisseur of good taste in ever Bengali. Heard of PatishaptaKoraishutir KochuriNolen Gurer ShondeshTele BhajaKathi roll? You can get anything as cheap as Rs. 20 plate full plate lunch to a 5 start buffet as well. Also Kolkata Biryani, we add one big potato to our biryani which completes the dish and it is just the best thing ever.
  • Heritage: Kolkata has galore of old buildings and we are immensely proud of them. Kolkata is still growing, trying to inculcate both new and old traditions, probably amalgamating them to co-exists side by side. Biggest example – The stalwart standing, Howrah Bridge.
  • Durga Puja: The whole wait of 365 days is worth it when the sound of dhak reverberates during those 5 glorious days. You have to physically witness Durga Puja to actually understand the emotions we Bengalis have during those days.
  • Trams: I don’t think anywhere in India you will find tram. Trams are easy, breezy, lazy and the symbol of Kolkata. It is the lifeline of Kolkata.
  • Metro: Metro was first started in Kolkata during the 80’s and it still is grand to us. May be it is not widespread as Delhi Metro, but still Kolkata Metro has it’s own charm. When the announcer lady announces “পারবোটি স্টেশন পার্ক স্ট্রিট” (Next station is Park Street) that’s when you know you’re in Kolkata Metro.
  • Shopping Paradise: From high end showrooms to lines of innumerable street side shops, Kolkata has plenty to offer. Gariahat or Esplanade, it has answers to all of your shopping finds.
  • Literature: Welcome to the birth place of Rabindranath Tagore, a soul reason to be a proud Bengali and land of literature fiends. We take our literature very seriously and you will always find a Bengali with a book in his hand. Kolkata book fair is the biggest fair ever and is the heart and soul that brings thousands of book lovers under one roof! College street is the paradise to find any book (no matter what it is) in any condition whatsover.
  • Eden Garden: Established over a 150 years ago, the Eden Garden Stadium in Kolkata is not only a landmark but considered a historic and heritage site. What more to say about it!
  • K.R. Market or City Market: Asia’s largest flower market situated in Kolkata. The early morning smell of flowers will just fill you like anything.
  • And just some Kolkata stuffs like Indian Coffee House, Sunday Suspense, boat ride in Princep ghat, Indian Coffee, Kalighat, Tiretta Bazaar, walk through the by-lanes of Kumartuli and what not.

Kolkata is not just a place, it more of an emotion that has different color to project each day.

%d bloggers like this: