సివిల్స్-2020 ప్రిలిమ్స్ పరీక్ష విధానం..సిలబస్..ప్రిపరేషన్ గెడైన్స్

దేశ అత్యున్నత సర్వీసుల్లో చేరడం లక్షల మంది ప్రతిభావంతుల కల. అందుకోసం ఏళ్లతరబడి అహోరాత్రులు పుస్తకాలతో కుస్తీపడుతుంటారు.
Career guidanceఆ స్వప్నం సాకారమైతే.. జీవితాంతం సమాజంలో ఉన్నత హోదా, గుర్తింపుతోపాటు సకల సౌకర్యాలు సొంతమవుతాయి. ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్(ఐఏఎస్), ఇండియన్ పోలీస్ సర్వీస్(ఐపీఎస్), ఇండియన్ ఫారిన్ సర్వీస్(ఐఎఫ్‌ఎస్) వంటి 24 దేశ అత్యుత్తమ సర్వీసుల్లో చేరాలంటే.. యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షకు హాజరవడం తప్పనిసరి. తాజాగా యూపీఎస్సీ ప్రిలిమ్స్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నేపథ్యంలో.. అభ్యర్థులకు ఉపయోగపడేలా సివిల్స్ 2020 నోటిఫికేషన్ సమాచారంతోపాటు ప్రిలిమ్స్ పరీక్ష తీరు, సిలబస్, ప్రిపరేషన్‌పై ప్రత్యేక కథనం…

 

పేపర్ 1 కీలకం:
మూడు దశలుగా ఉండే సివిల్ సర్వీసెస్ ఎంపిక ప్రక్రియలో ప్రిలిమ్స్‌ను వడపోత పరీక్షగా పేర్కొనవచ్చు. ప్రిలిమ్స్ రెండు పేపర్లుగా ఉంటుంది. ఇందులో పేపర్ 1 అత్యంత కీలకమైంది. ఇందులో పొందిన మార్కుల ఆధారంగానే మెయిన్స్‌కు అర్హత లభిస్తుంది. పేపర్ 2(సీశాట్).. కేవలం అర్హత పరీక్ష మాత్రమే. ఇందులో 33 శాతం మార్కులు సాధిస్తే సరిపోతుంది. ప్రశ్నపత్రాలు మల్టిపుల్ చాయిస్ విధానంలో, ఇంగ్లిష్, హిందీ మాధ్యమాల్లో ఉంటాయి. ప్రతి తప్పు సమాధానానికి 1/3 వంతు మార్కు కోత విధిస్తారు.

పరీక్ష స్వరూపం :

పేపర్ ప్రశ్నలు మార్కులు సమయం
జనరల్ స్టడీస్‌పేపర్ 1 200 200 2 గంటలు
జనరల్ స్టడీస్‌పేపర్ 2 200 200 2 గంటలు

సిలబస్‌లో ఏడు అంశాలు
 :
పేపర్ 1లో ఏడు ప్రధాన అంశాలను పేర్కొన్నారు.
అవి..1. జాతీయ, అంతర్జాతీయ ప్రాధాన్యాంశాలు
2. భారతదేశ చరిత్ర, భారత స్వాతంత్రోద్యమం
3. భారత, ప్రపంచ భౌగోళికశాస్త్రం: భౌతిక, సామాజిక, ఆర్థిక భౌగోళిక అంశాలు,
4. భారత రాజకీయ వ్యవస్థ, పరిపాలన-రాజ్యాంగం, పంచాయతీరాజ్, పౌర విధానం, హక్కులు-సమస్యలు,
5. ఆర్థిక, సామాజిక, సుస్థిర-అభివృద్ధి, పేదరికం, ద్రవ్యోల్బణం, డెమోగ్రాఫిక్స్, సామాజిక రంగ కార్యక్రమాలు,
6. పర్యావరణం, జీవవైవిధ్యం, వాతావరణ మార్పులు- సాధారణ అంశాలు,
7. జనరల్ సైన్సు.

 

పేపర్ 2 :

 

 • సిలబస్‌లో 6 అంశాలను కీలకంగా పేర్కొన్నారు. అవి.. కాంప్రహెన్షన్, ఇంటర్‌పర్సనల్ స్కిల్స్(కమ్యూనికేషన్ స్కిల్స్), లాజికల్ రీజనింగ్ అండ్ అనలిటికల్ ఎబిలిటీ, డెసిషన్ మేకింగ్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్, జనరల్ మెంటల్ ఎబిలిటీ, బేసిక్ న్యూమరసీ, డేటా ఇంటర్‌ప్రిటేషన్.
 • సివిల్స్ ప్రిలిమ్స్ ఫ్యాక్చువల్ డేటా, అప్లికేషన్ల కలయికగా ఉంటుంది. అభ్యర్థులు సిలబస్‌ను స్టాటిక్, డైనమిక్ భాగాలుగా విభజించుకోవాలి. ముందుగా స్టాటిక్ పార్ట్ ప్రిపరేషన్‌ను పూర్తిచేసిన తర్వాత డైనమిక్ పార్ట్‌పై అధిక సమయం వెచ్చించాలి.
 
ప్రశ్నల వైవిధ్యత :
 • సివిల్స్‌లో అడిగే ప్రశ్నలు అత్యంత వైవిధ్యంగా ఉంటాయి. కాబట్టి ప్రిలిమ్స్‌కు హాజరయ్యే అభ్యర్థులంతా ముందు పరీక్ష స్వరూపం, తీరుతెన్నులను అర్థంచేసుకోవాలి. ప్రిలిమ్స్‌లో అడిగే ప్రశ్నల శైలి, వెయిటేజీ ప్రతి ఏటా భిన్నంగా ఉంటుంది. ఒక సంవత్సరం హిస్టరీకి ప్రాధాన్యం లభిస్తే.. మరో సంవత్సరం పాలిటీకి వెయిటేజీ పెరుగుతుంది. ఒక్కోసారి పూర్తిగా కరెంట్ అఫైర్స్ హవా కొనసాగుతుంది. కాబట్టి అన్ని రకాలుగా సన్నద్ధులైన అభ్యర్థులకే పరీక్షలో విజయావకాశాలు ఉంటాయి.
 • ప్రతి అంశాన్ని భిన్న కోణాల్లో చదవడం, వైవిధ్యభరితమైన ప్రశ్నల సాధన, బేసిక్స్‌పై పట్టుతో ప్రిలిమ్స్‌లో సులభంగా అర్హత సాధించవచ్చు. కాబట్టి అభ్యర్థులు తదనుగుణంగా ప్రిపరేషన్ స్ట్రాటజీ రూపొందించుకోవాలి. బేసిక్స్‌పై పట్టుతో ప్రిలిమ్స్‌లో దాదాపు సగం ప్రశ్నలకు సమాధానాలు గుర్తించే అవకాశం లభిస్తుంది. మిగిలిన ప్రశ్నల్లో నుంచి ఐదు నుంచి పది ప్రశ్నలకు సమాధానాలు గుర్తించగలిగితే మెయిన్స్‌కు అర్హత లభించినట్లే!
 
జనరల్ స్టడీస్ :సివిల్స్‌లో జనరల్ స్టడీస్ కీలకం. ఇందులో కరెంట్ అఫైర్స్ ఆధారిత ప్రశ్నలు ఎక్కువగా అడుగుతారు. జీఎస్‌ను స్టాటిక్, డైనమిక్ భాగాలుగా విభజించుకోవాలి. 1857 తిరుగుబాటు, భారత భౌగోళిక స్వరూపం తదితరాలు స్టాటిక్ కిందకొస్తాయి. న్యూస్ పేపర్లు, యోజన మ్యాగజీన్, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో(పీఐబీ), ఎకనామిక్ అండ్ పొలిటికల్ వీక్లీ తదితరాలను అనుసరించడం ద్వారా డైనమిక్ పార్ట్‌పై అడిగే ప్రశ్నలకు సమాధానాలు గుర్తించగలుగుతారు.

 

చరిత్ర-స్వాతంత్య్రోద్యమం :
ప్రాచీన, మధ్యయుగ, ఆధునిక భారతదేశ చరిత్ర, భారత స్వాతంత్య్రోద్యమం నుంచి ప్రశ్నలు అడుగుతారు. ప్రాచీన చరిత్రలో సింధు నాగరికత, వేదకాలం నాటి భారతదేశం, మహాజనపదాలు, భౌద్దమతం,మౌర్యసామ్రాజ్యం-పరిపాలన, మధ్య ఆసియా నుంచి జరిగిన దాడులు, దక్షిణ భారతంలోని రాజ్యాలు కీలకంగా నిలుస్తాయి. ప్రాచీన చరిత్రలో సింధు నాగరికత, రుగ్వేదం, బౌద్ధ, జైన మతాల కాలం నాటి శిల్ప సంపద, బుద్ధుడి జీవితంతో ముడిపడిన ప్రదేశాలపై ప్రశ్నలు అడుగుతున్నారు. మధ్యయుగ చరిత్రలో ఉత్తర భారత, దక్కను రాజ్యాలు, ఢిల్లీ సుల్తానులు, భారత్‌లో ఇస్లామిక్ రాజ్యాలు, విజయనగర సామ్రాజ్యం, భక్తి-ఇతర సాంస్కృతిక, మత ఉద్యమాలు, మొగల్ పరిపాలన, యూరోపియన్ల రాక తదితరాలు ప్రధానమైనవి. మధ్యయుగ చరిత్ర నుంచి 1 లేదా 2 ప్రశ్నలకు మించి రావట్లేదు. ఆధునిక భారతదేశ చరిత్ర, భారత స్వాతంత్య్రోద్యమం నుంచి ఎక్కువగా ప్రశ్నలు వస్తాయి. పరీక్ష పరంగా ఆధునిక భారత చరిత్రలో స్వాతంత్య్రోద్యమం అత్యంత కీలకం.

చరిత్రలో కీలక అంశాలు:

 

 • ఆంగ్లో-మైసూరు, ఆంగ్లో-మరాఠా యుద్ధాలు
 • గవర్న్‌ర్ జనరల్స్-చట్టాలు, సంస్కరణలు
 • రైత్వారీ, మహల్వారీ విధానాలు
 • బెంగాల్ విభజన, మింటో మార్లే సంస్కరణలు
 • గిరిజనుల తిరుగుబాటు
 • 1857 సిపాయిల తిరుగుబాటు
 • ఇతర పౌర తిరుగుబాట్లు
 • భారత ప్రభుత్వ చట్టాలు (1858, 1909, 1019, 1935 తదితరం)
 • ప్రముఖ వ్యక్తులు-ఆలోచనలు(గాంధీ, రాజేంద్రప్రసాద్, దాదాబాయి నౌరోజీ, అంబేద్కర్)
 • పూనా ఒప్పందం, రౌండ్ టేబుల్ సమావేశాలు
 • కాంగ్రెస్ మహాసభలు, కేబినెట్ మిషన్, ఆగష్టు ఆఫర్
 • సామాజిక-మత ఉద్యమాలు.
 • ఎన్‌సీఈఆర్‌టీ, స్పెక్ట్రమ్ పుస్తకం హిస్టరీ ప్రిపరేషన్‌కు ఉపయోగపడతాయి.
 
సంస్కృతి-కళలు :
ప్రిలిమ్స్‌లో సంస్కృతి-కళలపై ఎక్కువగా ప్రశ్నలు అడుగుతున్నారు. వీటి ప్రిపరేషన్‌కు భిన్న మార్గాలను అనుసరించొచ్చు. ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాలు చదవడం లాభిస్తుంది. సంస్కృతికి సంబంధించి దేవాలయ శిల్పసంపద, చిత్రాలు, స్మారక స్థూపాలు, యునెస్కో గుర్తించిన ప్రదేశాల గురించి చదవాలి. ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాల్లో పూర్తి పేజీలో ముంద్రించిన చిత్రపటాలపై ప్రశ్నలు వస్తున్నాయి. కాబట్టి అభ్యర్థులు ఆయా చిత్రపటాల సమాచారాన్ని అధ్యయనం చేయాలి. దీంతోపాటు గుప్తులు, మౌర్యులు, దక్షిణ భారతదేశంలోని సంగమ వంశం కాలం నాటి శిల్పకళపై ప్రశ్నలు వస్తున్నాయి. ఈ దిశగా సెంటర్ ఫర్ కల్చరల్ రిసోర్స్ అండ్ ట్రైనింగ్(సీసీఆర్‌టీ) వెబ్‌సైట్‌లో లభించే సమాచారం అభ్యర్థులకు ఉపయోగపడుతుంది.

 

పరిపాలన :
ప్రభుత్వ పాలన-ఆచరణలు ఈ టాపిక్ కిందకు వస్తాయి. దీన్ని అంచనాలకు అందని విభాగంగా పేర్కొనవచ్చు. రాజ్యాంగ సంస్థలు (ఉదా: ఎన్‌హెచ్‌ఆర్‌సీ), మంత్రిత్వ శాఖలు- కార్యక్రమాలు, పౌరసేవలపై పట్టుసాధిస్తే.. ఇందులో మంచి స్కోరు చేయొచ్చు. శాఖలు-సంస్థల అధికారిక వెబ్‌సైట్లను పరిశీలించి.. వాటి నిర్మాణం, చరిత్ర, పనితీరు, కార్యక్రమాలు, మిషన్ల గురించి తెలుసుకోవచ్చు. లక్ష్మీకాంత్ పాలిటీ పుస్తకం చదవడం లాభిస్తుంది.

దీంతోపాటు..

 

 • లీగల్‌సర్వీస్ ఇండియా.కామ్
 • ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో వెబ్‌సైట్ వంటివి ఉపయోగపడతాయి.

సైన్స్, టెక్నాలజీ :

ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాలు, 6-10 తరగతుల పుస్తకాలు, కరెంట్ అఫైర్స్ మ్యాగజీన్‌ల అధ్యయనంతో సైన్స్ అండ్ టెక్నాలజీలో మంచి మార్కుల పొందవచ్చు. సిలబస్‌లో 9 కీలక విభాగాలను పేర్కొన్నారు. వీటిలో బయోటెక్నాలజీ టాపిక్ అత్యంత కీలకమైంది. ఈ విభాగం నుంచి ఏటా ప్రశ్నలు వస్తున్నాయి. దీంతోపాటు ఐఓటీ, 3డీ ప్రింటింగ్, హెల్త్‌కేర్, ఐఆర్‌ఎస్, రామ్సన్‌వేర్, ఏపీఐ యాప్స్, సైబర్ సెక్యూరిటీ, స్పేస్ శాటిలైట్స్, నావిగేషన్ సిస్టమ్ తదితరాలు ముఖ్యమైనవి.

 

ఆర్థికం :
ఎకనామిక్స్‌లో స్టాటిక్ పార్టు నుంచి ప్రశ్నలు రావట్లేదు. అభ్యర్థులు రెపోరేటు, రివర్స్ రెపో, సీఆర్‌ఆర్ వంటి బేసిక్స్ అంశాల గురించి అధ్యయనం చేయడం తప్పనిసరి.ఎకనామిక్స్‌లో అడిగే ప్రశ్నలు గణాంకాల ఆధారితంగా ఉంటున్నాయి. కాబట్టి ఈ విభాగాన్ని పూర్తిగా కరెంట్ అఫైర్స్ కోణంలో ప్రిపేరవ్వాలి. బడ్జెట్, తాజా ఎకనామిక్ సర్వే, వార్తా పత్రికలు ప్రిపరేషన్ పరంగా సోర్సులుగా ఉంటాయి. జాగ్రఫీలో అడిగే చాలా ప్రశ్నలు అంచనాకు అందట్లేదు. ఎన్‌సీఈఆర్‌టీ ఇంటర్ పుస్తకాలు చదవితే జాగ్రఫీ చాలా వరకు కవర్ అవుతుంది.

పథకాలు :
పథకాలను ప్రిపేరయ్యేటప్పుడు.. సదరు పథకం లక్ష్యం, అమలుచేసే మంత్రిత్వ శాఖలు/నోడల్ ఎజెన్సీలు, ఒనగూరే ప్రయోజనాలు, అర్హులు, పథకం కిందకు రాని వారు.. తదితర అంశాల గురించి తెలుసుకోవాలి. ప్రధానమంత్రి ఫసల్ భీమా యోజన, అటల్ పెన్షన్ యోజన, ఆయుష్మాన్ భారత్, సంసద్ ఆదర్ష్ గ్రామ్ యోజన, డిజిటల్ ఇండియా, ప్రధానమంత్రి ముద్రా యోజన, సాయిల్ హెల్త్ కార్డ్ సిస్టమ్, శ్యామా ప్రసాద్ ముఖర్జీ రూర్బన్ మిషన్ తదితర కేంద్ర కార్యక్రమాలు/పథకాల గురించి క్షుణ్నంగా తెలుసుకోవాలి.

కరెంట్ అఫైర్స్ :గత 10-12 నెలల వ్యవధిలోని జాతీయ, అంతర్జాతీయ ప్రాధాన్యాంశాల గురించి అధ్యయనం చేయాలి. సివిల్స్ అభ్యర్థులు పత్రికలను పరీక్ష కోణంలోనే చదవాలి. అలాకాకుండా పేపర్ మొత్తం చదవడం వల్ల ఉపయోగం లేకపోగా సమయం వృథా అవుతుంది. వార్తా పత్రికల్లో ప్రశ్నలు అడిగేందుకు ఆస్కారం ఉన్న అంశాలనే చదివి నోట్ చేసుకోవాలి. పరీక్షలో కీలక విభాగాలైన సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎకనామిక్స్‌లో అడిగే ప్రశ్నలు కరెంట్ అఫైర్స్ ఆధారితంగా ఉంటాయి. కాబట్టి ప్రిపరేషన్ పరంగా వార్తా పత్రికలకు ప్రాధాన్యం ఇవ్వాలి. సివిల్స్‌లో స్టాటిక్ పార్ట్ కంటే ఫ్యాక్చువల్ డేటాపై ఎక్కువగా ప్రశ్నలు అడుగుతున్నారు.

టెస్టు సిరీస్‌లు :
ప్రిలిమ్స్‌కు సన్నద్ధమవుతోన్న అభ్యర్థులు ప్రిపరేషన్‌లో టెస్టు సిరీస్‌లకు ప్రాధాన్యం ఇవ్వాలి. కనీసం 30-40 టెస్టు సిరీస్‌లకు హాజరయ్యేలా ప్రణాళికలు రూపొందించుకోవాలి. దీంతోపాటు స్వీయ పరీక్ష విధానాన్ని అనుసరించాలి. తద్వారా స్వీయ సామర్థ్యం, ప్రశ్నల తీరుపై అవగాహన లభిస్తుంది. టెస్టు సిరీస్ వివరణల్లోని కొత్త అంశాలను నోట్ చేసుకొని అధ్యయనం చేయాలి. తద్వారా ప్రిపరేషన్ పరంగా బలపడటంతోపాటు ప్రశ్నలు ఏవిధంగా అడిగినా గందరగోళానికి గురికాకుండా ఉంటారు.
గత మూడేళ్ల వెయిటేజీ:
సివిల్స్ ప్రిలిమ్స్‌లో గత మూడేళ్లలో ఆయా సబ్జెక్టులు/టాపిక్స్‌కు లభించిన వెయిటేజీ వివరాలు శాతాల్లో…

 

విభాగం 2017 2018 2019
కరెంట్ అఫైర్స్ 34 28 22
హిస్టరీ 14 15 17
జాగ్రఫీ 7 8 14
పాలిటీ 22 13 15
ఎకానమీ 8 16 14
సైన్స్ అండ్ టెక్నాలజీ 4 7 7
ఎన్విరాన్‌మెంట్ 11 13 11

2019 ప్రిలిమ్స్ కటాఫ్ మార్కులు :
కేటగిరీ మార్కులు
జనరల్ 98.00
ఓబీసీ 96.66
ఎస్సీ 84.00
ఎస్టీ 83.34

ముఖ్య సమాచారం :ఆన్‌లైన్ దరఖాస్తు, ఫీజు చెల్లింపునకు చివరి తేదీ: మార్చి 3,2020
పరీక్ష ఫీజు: రూ.100, ఎస్సీ, ఎస్టీ, మహిళలు, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు.
ప్రిలిమినరీ పరీక్ష తేదీ: మే 31, 2020
వయసు: కనిష్ట వయసు 21 ఏళ్లు కాగా, గరిష్ట వయసు 32 ఏళ్లు. రిజర్వ్ కేటగిరీ అభ్యర్థులకు నిబంధనల మేరకు వయో సడలింపు ఉంటుంది.
పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, వరంగల్, తిరుపతి.
పూర్తి వివరాలకు వెబ్ సైట్https://www.upsc.gov.in

 

యుపిఎస్సి (UPSC) నిర్వహించే సివిల్స్ పరీక్షకు ఉత్తమ వ్యూహం మరియు పుస్తకాలు (Best Strategy And Books For UPSC Civils Exam)

పాఠశాల రోజులలో మీరు  6 నుండి 12 వరకు NCERT పాఠ్యపుస్తకాలను చదివి ఉంటె మీరు చరిత్రసాంఘిక శాస్త్రం మరియు విజ్ఞాన శాస్త్రం కోసం అదనపు పుస్తకాలు చదవలసిన  అవసరం లేదు.
 
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యొక్క (UPSCయుపిఎస్సి)సివిల్స్ ఎగ్జామ్స్   భారతదేశపు అత్యంత ప్రధాన పరీక్షలలో ఒకటి. ఇందులో ఉత్తిర్ణులైనవారు కేంద్ర  ప్రభుత్వ సేవలకు అధికారులుగా  నియమిoపబడతారు.
 
సివిల్స్ ఒక అవలోకనం: సవాళ్లు మరియు వాటిని పరిష్కరించడానికి వ్యూహాలు
భారతదేశం తన భౌతికఆర్థిక మరియు భౌగోళిక రంగాలలో ఎలా అభివృద్ధి చెందిందనే దానిపై జ్ఞానం సంపాదించడానికి మీకు నిజమైన ఆసక్తి ఉంటేమీ ఆసక్తికి ఉపయోగపడే పరీక్ష ఇది.
 యుపిఎస్సి సివిల్స్ క్లియర్ చేయడానికి మొదటి అవసరం ప్రతి రంగం గురించి జ్ఞానం పొందడం. పరిశోధనాత్మక స్వభావం ఈ పరీక్షను క్లియర్ చేయడానికి కావలసిన గుణం.
 Image result for UPSC exam stages
మీరు సివిల్స్ ను లక్ష్యంగా చేసుకునిమీ తయారీని ఎక్కడ ప్రారంభించాలో అయోమయంలో ఉంటేమీరు అనుసరించాల్సిన వ్యూహం మీరు సరైన పుస్తకాలను చదవటం. భారతదేశపు  ప్రధాన పరీక్షలలో యుపిఎస్సి నిర్వహించే సివిల్స్ ఒకటి.
 
ఒకటిన్నర సంవత్సరాల సమయం లేదా సుమారు రెండు వందల రోజుల సమయం సివిల్స్  పరీక్ష యొక్క ప్రిలిమ్స్ స్టేజ్ మరియు మెయిన్స్ కోసం మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోవడానికి సరిపోతుంది. అయితే మీరు సరైన మెటీరియల్ పొందగలగాలి.
 
మొదటసివిల్స్ సిలబస్ గురించి మీకు సరైన అవగాహన అవసరం. సిలబస్ మరియు మీరు దృష్టి సారించాల్సిన టాపిక్స్/అంశాల గురించి బాగా అర్థం చేసుకోవడానికి సిలబస్ ను కనీసం మూడుసార్లు పరిశిలించండి.  ఎల్లప్పుడూ గుర్తుంచుకోండిప్రతి పరీక్ష దాని సిలబస్‌పై మాత్రమే ఆధారపడి ఉంటుంది
 
ఏమి అధ్యయనం చేయాలి మరియు జ్ఞానం పొందటానికి మీరు ఏ పుస్తకాలు మరియు రచయితలను  ఎంచుకోవాలి అనే ఆలోచనతో మీరు గందరగోళానికి గురైతేయుపిఎస్సి ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ పరీక్షలో విజయం సాధించడానికి కొన్ని ఉత్తమ పుస్తకాల జాబితా ఇక్కడ ఉంది.
1. లక్ష్మీకాంత్ :“ఇండియన్ పాలిటీ Indian Polity”
ఎం. లక్ష్మీకాంత్ రచించిన “ఇండియన్ పాలిటీ Indian Polity”ని భారతదేశంలోని రాజకీయ సినారియో  కి బైబిల్ అని కూడా పిలుస్తారు. భారత రాజ్యాంగం యొక్క చారిత్రక నేపథ్యాన్ని అర్థం చేసుకోవడానికి ఇది ఉత్తమమైన పుస్తకాల్లో ఒకటి. ఇది 800 పేజీలు ఉన్నప్పటికీభారత రాజకీయాలపై అన్ని ప్రశ్నలను అర్ధం చేసుకోవడానికి నిపుణులు రెండు లేదా మూడుసార్లు దిన్ని  చదవమని సిఫార్సు చేస్తారు. ఇది చాలా పెద్దదిగా ఉందికాని సివిల్స్  పరీక్షకు చదవడం లో ఇంత  విలువైనది మరే ఇతర పుస్తకం లేదు.
 
2. ఎ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ మోడరన్ ఇండియా: రాజీవ్ అహిర్స్పెక్ట్రమ్ పబ్లికేషన్స్
చాలా మంది సివిల్స్ రాసేవారు భారతదేశ చరిత్ర పుస్తకాలపై గందరగోళం చెందుతున్నారు. మార్కెట్లో ఉన్న టన్నుల కొద్దీ పుస్తకాలలో  రాజీవ్ అహిర్ రాసిన మరియు స్పెక్ట్రమ్ ప్రచురించిన “ఆధునిక భారతదేశం యొక్క సంక్షిప్త చరిత్ర A brief history of Modern India” అనే పుస్తకం  భారతదేశ చరిత్ర గురించి అత్యంత సంక్షిప్త సారంశాన్ని అందిస్తుంది.
అంతేకాకమీకు సమయం ఉంటేమీ భారతీయ చరిత్ర పై జ్ఞానాన్ని పెంచుకోవటానికి బిపాన్ చంద్ర రాసిన హిస్టరీ ఆఫ్ మోడరన్ ఇండియా కూడా చదవవచ్చు.
 
3. సర్టిఫికేట్ ఫిజికల్ అండ్ హ్యూమన్ జియోగ్రఫీ బై జిసి లియోంగ్ 
40 నుండి 50 సంవత్సరాల క్రితం వ్రాసినప్పటికీజిసి లియోంగిస్ రాసిన “సర్టిఫికేట్ ఫిజికల్ అండ్ హ్యూమన్ జియోగ్రఫీ” యుపిఎస్సి సివిల్స్  పరీక్ష కోసం తప్పక చదవాలి. ఇది మీకు గణనీయమైన సైద్ధాంతిక నేపథ్యాన్ని అందిస్తుంది. ప్రపంచంలోని భౌగోళిక భావనల గురించి బాగా అర్థం చేసుకోవడానికి పుస్తకం యొక్క మొదటి విభాగం చాలా ఉపయోగ పడుతుంది. మీ జ్ఞానాన్ని పెంచడానికి బ్లాక్ స్వాన్ లేదా ఆక్స్ఫర్డ్ అట్లాస్ కూడా ఉపయోగపడును..
 
4.ఎన్‌సిఇఆర్‌టి (NCERT) బుక్స్
పాఠశాల రోజుల లో అనగా 6 నుండి 12 వరకు NCERT పాఠ్యపుస్తకాలను చదవిన  మీరు చరిత్రసాంఘిక శాస్త్రం మరియు విజ్ఞాన శాస్త్రం కోసం అదనపు పుస్తకాలు చదవలసిన అవసరం లేదు. ఎన్‌సిఇఆర్‌టి సిరీస్ అద్భుతంగా ఉంది.. మీ అవసరానికి అనుగుణంగా వీటిని ఒకటి లేదా రెండుసార్లు చదవండి.
 
5.కరెంట్ అఫైర్స్  Current Affairs
వార్తలను చదివే అలవాటును పెంచుకోండిఇది ప్రపంచవ్యాప్తంగా కరెంట్ అఫైర్స్/ప్రస్తుత వ్యవహారాల గురించి మీకు తెలియజేయడంలో సహాయపడటమే కాకుండామీ రచనా నైపుణ్యాలను (writing skills) బలోపేతం చేస్తుంది మరియు మీ ఆలోచనా సామర్థ్యo అభివృద్ధి చెందడంలో మీకు సహాయపడుతుంది.
నిపుణుల అభిప్రాయం ప్రకారం ది హిందూబిబిసిఇండియన్ ఎక్స్‌ప్రెస్ అత్యంత సిఫార్సు చేయబడిన మరియు నమ్మదగిన వనరులు. మీ పరిధులను విస్తృతం చేయడానికి మరియు మీ భాష పటిమను పెంచడానికి ప్రముఖ రచయితల పుస్తకాలు  విశ్రాంతి సమయం లో చదవండి. మీ వ్యాస రచన నైపుణ్యాలను మెరుగుపరచడానికి ఆర్టికల్స్ చదవండితద్వారా మీరు మీ ఆలోచనలను స్పష్టంగా మరియు సమగ్రంగా వ్యక్తపరచ వచ్చు
6.          పాత పేపర్స్ ప్రాక్టీస్ Practice Papers చేయండి
తరచు అడిగే  ప్రశ్నలను గుర్తించడానికి ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ యొక్క మునుపటి సంవత్సరాల  ప్రశ్న పత్రాలను పొందండి. వీటిని క్రమం తప్పకుండా ప్రాక్టీస్ చేయండి. మీ పురోగతిని తెలుసుకోవడానికి మరియు మీ సమయ నిర్వహణ నైపుణ్యాలను మెరుగుపరచడానికి ఆన్‌లైన్ పరీక్షలు తోడ్పడుతాయి.

 

%d bloggers like this:
Available for Amazon Prime