రేపే ఏపీ ఇంటర్ ఫలితాలు

ఆంధ్రప్రదేశ్ ఇంటర్ ఫలితాలను జూన్ 12(శుక్రవారం)న విడుదల చేయనున్నారు. మొదటి, రెండవ సంవత్సర పరీక్షల ఫలితాలను ఒకే సారి విడుదల చేయనున్నట్టు ప్రభుత్వం తెలిపింది. కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్ సడలింపులు ఇవ్వడంతో ఇంటర్ బోర్డ్ అధికారులు ఇటీవల ఇంటర్ పరీక్షల పేపర్ల మూల్యాకం పూర్తిచేశారు. ఈ ఫలితాల విడుదలకు విద్యాశాఖ అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. ఫలితాలను రేపు మధ్య్నానం 12:30కు విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ విడుదల చేయనున్నారు. రాష్ట్రంలో మార్చి 4 నుంచి 23 వరకు ఇంటర్ పరీక్షలు జరిగాయి. ఈ ఇంటర్ ఫలితాలను www.sakshieducation.com చూడండి.
%d bloggers like this:
Available for Amazon Prime