సముద్రంపై సాహసం.. మర్చెంట్ నేవీ
ఇంటర్మీడియెట్ విద్యార్థుల్లో సైన్స్ గ్రూప్‌ల వారు ఇంజనీరింగ్, మెడిసిన్ కోర్సుల వైపు ఆకర్షితులవుతున్నారు.
|
![]() మర్చెంట్ నేవీ అంటే…
సరుకుల రవాణాకు రోడ్డు మార్గం, వాయు మార్గం, జల మార్గాలను ఉపయోగిస్తారు. దేశంలోని ఓ ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి, భూ సరిహద్దు దేశాలకు సరుకును లారీలు లేదా గూడ్స్ రైళ్లలో తరలిస్తారు. చాలాదూరంలో ఉన్న విదేశాలకు అవసరాన్ని బట్టి వాయు మార్గాన్ని వినియోగిస్తారు. వాయు మార్గం చాలా ఖర్చుతో కూడుకున్నది. అన్నింటి కంటే సులువుగా, తక్కువ ఖర్చుతో ఎక్కువ మొత్తం సరుకుని సుదూర తీరాల్లోని విదేశాలకు తరలించే అవకాశం ఒక్క జల మార్గం ద్వారానే సాధ్యమవుతుంది. అంటే.. సముద్ర తీరం ఉన్న అన్ని ఖండాలు, దేశాలకు భారీ స్థాయిలో సరుకును చేరవేసేందుకు పురాతన కాలం నుంచి వినియోగంలో ఉన్న మార్గం ఇదే. ఓడల ద్వారా వ్యాపార, వాణిజ్య సరుకుల రవాణా కార్యకలాపాలను నిర్వహించేదే.. ‘మర్చెంట్ నేవీ’. అంతర్జాతీయ వాణిజ్యానికి మర్చెంట్ నేవీ వెన్నుముకగా చెప్పవచ్చు. ఈ ఓడలపై పని చేసే వివిధ విభాగాల సిబ్బంది ఒక దేశం నుంచి మరో దేశానికి సరుకులను చేరవేస్తారు. కోర్సులు…
మర్చంట్ నేవీలో కెరీర్ అవకాశాలు కోరుకునే అభ్యర్థులకు ఇండియన్ మారిటైమ్ యూనివర్సిటీ పలు కోర్సులు అందిస్తోంది. యూజీ స్థాయిలో నాలుగేళ్ల బీటెక్ మెరైన్ ఇంజనీరింగ్; ∙బీటెక్ నావెల్ ఆర్కిటెక్చర్ అండ్ ఓషన్‡ ఇంజనీరింగ్; ∙మూడేళ్ల బీఎస్సీ నాటికల్ సైన్స్; ∙మూడేళ్ల బీబీఏ లాజిస్టిక్స్, రిటైల్స్ అండ్ ఈ కామర్స్; ∙మూడేళ్ల బీఎస్సీ షిప్ బిల్డింగ్ అండ్ రిపైర్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తోంది. అలాగే పీజీ స్థాయిలో రెండేళ్ల ఎంటెక్ మెరైన్ ఇంజనీరింగ్; రెండేళ్ల ఎంటెక్ నావెల్ ఆర్కిటెక్చర్ అండ్ ఓషన్ ఇంజనీరింగ్; రెండేళ్ల ఎంటెక్ డ్రెడ్జింగ్ అండ్ హార్బర్ ఇంజనీరింగ్; రెండేళ్ల ఎంబీఏ పోర్ట్ అండ్ షిప్మేనేజ్మెంట్; రెండేళ్ల ఎంబీఏ ఇంటర్నే షనల్ ట్రాన్స్‌పోర్టేషన్ అండ్ లాజిస్టిక్స్ మేనేజ్మెంట్; రెండేళ్ల ఎంఎస్సీ కమర్షియల్ షిప్పింగ్ అండ్ లాజిస్టి క్స్‌లో అడ్మిషన్ పొందొచ్చు. వీటితోపాటు ఒక ఏడాది కాల వ్యవధి గల డిప్లొమా ఇన్ నాటికల్ సైన్స్, ఒక ఏడాది కాల వ్యవధి గల పోస్ట్‌గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ మెరైన్ ఇంజనీరింగ్ సైతం అందుబాటులో ఉన్నాయి. కోర్సుల్లో ప్రవేశం..
మర్చంట్ నేవీకి సంబంధించి కోర్సులను అందించడంలో మంచి పేరున్న కేంద్రీయ విశ్వ విద్యాలయం.. ‘ఇండియన్ మారిటైమ్ యూనివర్సిటీ’. దీనికి కోచి, చెన్నై, కోల్‌కతా, ముంబయి పోర్ట్, నవీ ముంబయి, విశాఖపట్నంలో క్యాంపస్‌లు ఉన్నాయి. అంతేకాకుండా దీనికి అనుబంధంగా దేశవ్యాప్తంగా పలు ఇన్స్టిట్యూట్లు డిగ్రీస్థాయి, డిప్లొమా స్థాయి కోర్సులను అందిస్తున్నాయి. ఐఎంయూ సెట్
ఐదు రకాల కొలువులు
మర్చెంట్ నేవీలో ప్రధానంగా ఐదు రకాల ఉద్యోగాలు ఉంటాయి. అవి.. డెక్ ఆఫీసర్స్..వీరినే నేవిగేషన్ ఆఫీసర్స్ అంటారు. అలాగే ఎలక్ట్రో– టెక్నికల్ ఆఫీసర్(ఈటీఓ), ఇంజనీర్స్, జీపీ రేటింగ్స్, క్యాటరింగ్ అండ్ హాస్పిటాలిటీ క్రూ. ఉద్యోగాలు–అర్హతలు
మర్చెంట్ నేవీలో జీపీ రేటింగ్స్ ఉద్యోగానికి పదో తరగతి అర్హత సరిపోతుంది. డెక్ ఆఫీసర్స్, టెక్నికల్ ఆఫీసర్, ఇంజనీరింగ్ కొలువులకు ఇంటర్ ఎంపీసీతోపాటు సంబంధిత కోర్సు పూర్తిచేసిన వారు అర్హులు. మంచి దేహదారుఢ్యంతోపాటు మానసికంగానూ దృఢంగా ఉండాలి. కంటి చూపులోపం ఉండరాదు. విజన్ 2.5 ప్లస్/మైనస్ వరకు ఉన్నవారు కూడా అర్హులే. మెడికల్ టెస్ట్ నిర్వహించి అర్హులను ఎంపిక చేస్తారు. వేతనాలు
అద్భుతమైన కెరీర్ మర్చెంట్ నేవీలో మంచి ఉపాధి అవకాశాలు ఉన్నాయి. తక్కువ సమయంలోనే అధిక వేతనాలు ఈ రంగంలో పొందవచ్చు. కోర్సు చేసినవారికి ఏడాదిపాటు ఓడలపై శిక్షణ ఉంటుంది. అప్పుడే వారికి నెలకు కనీసం 1000 డాలర్లు చెల్లిస్తారు. కార్గో షిప్పులు కంటే గ్యాస్, ఆయిల్ తరలించే షిప్పుల్లో పనిచేసేవారికి వేతనాలు 30 శాతం అధికంగా ఉంటాయి. చీఫ్ ఆఫీసర్ స్థాయి వారు తమ కుటుంబాలను షిప్పుల్లో తీసుకెళ్లే వెసులుబాటు కూడా ఉంది. సాహసంతోపాటు మంచి వేతనాలు కోరుకునేవారు మర్చెంట్ నేవీలో చేరవచ్చు. |
You must log in to post a comment.